Friday, May 25
Log In

CURRENT AFFAIRS – FEB 20

రాష్ట్రీయం
1) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ ( ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా )
2) హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ సదస్సు ప్రపంచంలోని ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు ?
జ: 40 దేశాలు
3) ప్రస్తుతం కేంద్ర , ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి ఎవరు ?
జ: రవిశంకర్ ప్రసాద్
4) తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: రజత్ కుమార్ ( 1991 IAS బ్యాచ్ అధికారి )
5) హైదరాబాద్ కు వచ్చి ప్రభుత్వ పథకాలను సమీక్షించిన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు ?
జ: అరవింద్ సుబ్రమణియన్
6) రాష్ట్రంలో మనిషి జీవిత కాలం ఎంత వరకూ పెరిగినట్టు భారత వైద్య పరిశోధనా మండలి స్టడీలో తేలింది
జ: పురుషులు : 69.4 యేళ్ళు, స్త్రీలు 73.2 యేళ్ళు
7) హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించిన ఐటీ దిగ్గజ సంస్థ ఏది ?
జ: అడోబ్

జాతీయం
8) దేశవ్యాప్తంగా మనిషి జీవిత కాలం ఎంత వరకూ పెరిగినట్టు భారత వైద్య పరిశోధనా మండలి స్టడీలో తేలింది
జ: స్త్రీలకు 70.3 యేళ్ళు, పురుషులకు 66.9 యేళ్ళు
9) రాజస్థాన్ లోని ఏ రైల్వే స్టేషన్ ను ఇకపై ఉద్యోగినులే నిర్వహించనున్నారు ?
జ: జైపూర్ లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్
10) దేశంలోనే మొదటిసారిగా మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసేందుకు రోబోలను వాడాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కేరళ
(నోట్: బ్యాండికూట్ అనే రోబోను జెన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసింది )
11) దేశంలో ఏయే నగరాల మధ్య విమానం కంటే వేగంగా దూసుకెళ్ళే హైపర్ లూప్ రవాణా వ్యవస్థను నిర్మించేందుకు అమెరికాకి చెందిన వర్సిన్ హైపర్ లూప్స్ అంగీకరించింది
జ: ముంబై టు పుణే
(నోట్: రూ.20కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ 2021 నాటికి పూర్తవుతుంది. ఈ రెండు నగరాల మధ్య 20నిమిషాల టైమ్ మాత్రమే పడుతుంది )
12) ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రంజన్ కుమార్ మహాపాత్ర.
13) నాస్కామ్ ప్రకటించిన డిజిటల్ ఎవాంజలిస్ట్ అవార్డ్ ఎవరికి దక్కింది ?
జ: ఏబీబీ సీడీఓ గౌడోజౌర్డ్

అంతర్జాతీయం
14) పాకిస్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజం మూడో పెళ్లి ద్వారా మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే ఆయన పాకిస్తాన్ లో ఏ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు ?
జ: పాకిస్తాన్ తెహ్రీక్ - ఎ- ఇన్సాఫ్ (PTI)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *