Sunday, December 16

CURRENT AFFAIRS – JAN 30

రాష్ట్రీయం
1) వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రానికి ఎన్నో స్థానం లభించింది
జ: 5 వ స్థానం (6.4శాతం)
(నోట్:మొదటి స్థానం మహారాష్ట్ర 22.3)
2) కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం ఎంతగా నిర్ణయించారు
జ: రూ.1,55,612 ( చాలా ఇంపార్టెంట్ బిట్ )
3) దేశంలో 18 హరిత విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఇందులో భాగంగా తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు
జ: కొత్తగూడెం
4) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాయు కాలుష్య స్థాయి పెరిగిందని ఢిల్లీకి చెందిన గ్రీన్ పీస్ ఇండియా సంస్థ నివేదికలో పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ఎన్ని నగరాల్లో కాలుష్య స్థాయి అధికంగా ఉంది
జ: ఏపీ - 15, తెలంగాణలో 11 నగరాల్లో
5) కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరుగుతున్న భారత్ పర్వ్ లో తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన నాట్యం ఏది ?
జ: పేరిణీ శివతాండవం


6) ఖరీఫ్ లో వరి ఉత్పత్తి తగ్గింది. 2017-18 సం.నికి లక్ష్యం 32.47 లక్షల టన్నులు. అయితే ఎన్ని టన్నుల ఉత్పత్తి అయింది
జ: 30.42 టన్నులు
7) రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ హాస్పిటల్ ను అవయవ మార్పిడి కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం రూ.20కోట్లతో ఏర్పాట్లు చేయనుంది ?
జ: గాంధీ హాస్పిటల్
8) పాస్ పోర్టుల జారీలో హైదరాబాద్ లోని ప్రాంతీయ కార్యాలయం దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది.
జ: మొదటి స్థానం ( వరుసగా మూడో ఏడాది కూడా)
9) చెల్లప్ప కమిటీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఏ కులాలను అధ్యయనం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు ?
జ: షెడ్యూల్డ్ తెగలు
10) రాష్ట్రంలో తెలుగును ప్రోత్సహించేందుకు ఉగాది కానుకగా ఏ పేరుతో చిన్న పుస్తకాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
జ: మన తెలుగు
11) వేటూరి సాహితీ పురస్కార గ్రహీత ఎవరు
జ: సినీ గేయ రచయిత చంద్రబోస్
జాతీయం
12) కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం ఈ ఏడాది, వచ్చే ఏడాదికి వ్రుద్ధి రేటు ఎంతగా అంచనా వేశారు
జ: 6.75 (2017-18), 7 - 7.5 (2018-19)
13) గత ఏడాది ఆగస్టు 23 ప్రాతిపదికగా జాతీయ తలసరి ఆదాయం ఎంతగా ఆర్థిక సర్వేలో ప్రకటించారు
జ: రూ.1,03,219 ( చాలా ఇంపార్టెంట్ బిట్ )
14) రైతుల ఆదాయాన్ని ఎప్పటి లోగా రెట్టింపు చేసేలా పథకాలు చేపడతామని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో చెప్పారు ?
జ: 2022
15) దేశంలో అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం ఏ పేరుతో స్వతంత్ర్య వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు
జ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
16) అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారతీయులు ఎవరు
జ: ప్రొ. ఆరోగ్య స్వామి జోసెఫ్ పాల్ రాజ్, సుమితా మిత్రా
17) జపాన్ కాన్సుల్ జనరల్ సీజీ బాబా చేతుల మీదుగా అత్యుత్తమ వ్యాపార నాయకత్వానికి ఇచ్చే 2018 గ్రాండ్ మోనొజుకురి అవార్డును ఎవరు అందుకున్నారు
జ: అమర్ రాజా ఛైర్మన్ రామ చంద్ర ఎన్ గల్లా
18) టాటా స్టీల్ చాలెంజర్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయ ఆటగాడు ఎవరు
జ: విదిత్ సంతోష్

-------------------------------------------------------------

TRT ఎగ్జామ్స్ పనికొచ్చే టాపిక్స్ : CURRENT AFFAIRS & GK

దాదాపు 100 మాక్ టెస్టులు (ఒక్కో టెస్టులో 25 ప్రశ్నలు -5 సార్లు రాసుకోవచ్చు)

అతి ముఖ్యమైన ప్రశ్నలను Multiple Choice విధానంలో ఇస్తున్నాం...
http://tsexams.com/current-affairs-gk/