Monday, August 19

కోర్టు ఉద్యోగాల సిలబస్

కోర్టు జాబ్స్ కి  సిలబస్ ఏంటని చాలామంది అడుగుతున్నారు.  హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ లో మాత్రం particular గా ఇదీ సిలబస్ అనీ ఏమీ mention చేయలేదు.  ఆ నోటిఫికేషన్ ను మీరు కూడా చూసే ఉంటారు. అందుకోసం కేవలం జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ అని మాత్రమే ఇచ్చారు.  టెన్త్ మరియు ఇంటర్  స్థాయిలో ఉంటాయని మాత్రమే పేర్కొన్నారు.

అయితే... గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను బేరీజు వేసిన తర్వాత నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని టాపిక్స్ ను మీకు సజెస్ట్ చేస్తున్నాను.  ఇవే టాపిక్స్ ఉంటాయని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వడం లేదు.  కానీ ఇవి కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పగలను.

ముందుగా జనరల్ నాలెడ్జ్ సిలబస్ చూద్దాం

  • జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు (National & International Current affairs)
  • భారత దేశ చరిత్ర
  • భారత దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర
  • ప్రముఖ పుస్తకాలు – వాటి రచయితలు
  • అవార్డులు, ఇతర గౌరవాలు
  • భారతదేశం – రాష్ట్రాలు – రాజధానులు
  • భారత దేశ ఆర్థిక వ్యవస్థ
  • కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లు, పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్
  • కేంద్ర ప్రభుత్వ పథకాలు
  • క్రీడలు
  • ముఖ్యమైన తేదీలు
  • అబ్రివేషన్స్
  • ప్రపంచ దేశాలు – రాజధానులు
  • జాతీయ, అంతర్జాతీయ సంస్థలు
  • సైన్స్ అండ్ టెక్నాలజీ
  • సైన్స్ – పరిశోధనలు, ఆవిష్కరణలు

ఇక కోర్టు ఉద్యోగాల్లో జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించిన సిలబస్ చూస్తే...

  • Synonyms
  • Antonyms
  • Active and Passive voice
  • Prepositions
  • Substitution
  • Sentence improvement
  • Sentences completion
  • Sentence Arrangements
  • Spelling Test
  • Fill in the blanks
  • Passage/para completion
  • Idioms and Phrases
  • Error correction (Underlined)
  • Spotting Errors
  • Transformation

కోర్టు ఉద్యోగాల్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్, కాపీయిస్టులు, రికార్డు అసిస్టెంట్స్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు దాదాపుగా ఇదే సిలబస్ ఉండొచ్చు.  ఆఫీస్ సబార్డినేట్స్ కి మాత్రం ఈ స్టాండర్డ్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన టాపిక్స్ లో చాలా వరకూ మీరు గతంలో పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినవి కవర్ అవుతాయి.  అందువల్ల మీరు టెన్షన్ పడాల్సిన పనిలేదు.  గతంలో మా మాక్ టెస్టులు రాసిన వారికి చాలామటుకు ఈ జీకే టెస్టులు కవర్ అయ్యాయి.

అంటే మీరు భారత దేశ చరిత్ర, స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, కరెంట్ ఎఫైర్స్, భారత ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్, ప్రణాళికలు, నీతి ఆయోగ్, ప్రభుత్వ పథకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలు ప్రిపేర్ అయినవే. మళ్లోసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది.

ఇందులో మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సింది...

ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు, రచయితలు, అవార్డులు, రాష్ట్రాలు, రాజధానులు, క్రీడలు, అబ్రివేషన్స్, దేశాలు, రాజధానులు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, సైన్స్ పరిశోధనలు, ఆవిష్కర్తలకు సంబంధించిన అంశాలపై ప్రిపరేషన్ అవ్వాలి...

 

కోర్టు ఉద్యోగాలకు 20 గ్రాండ్ టెస్టులు (మొత్తం 1600 ప్రశ్నలు) AUGUST 15 నుంచి ప్రారంభం

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి