భారత రాజ్యాంగం కొత్త సవాళ్లు

1) భారత రాజ్యాంగాన్ని మొదటిసారి ఎప్పుడు సవరించారు ?
జ: 18 జూన్ 1951లో
2) 2000సం.లో వాజ్ పేయి ప్రధాని హయాంలో రాజ్యాంగ సవరణలను సూచించుటకు ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ సమీక్షా కమీషన్ ను ఏర్పాటు చేశారు ?
జ: జస్టిస్ M.N వెంకటాచలయ్య
3) దేశ ప్రజలందరికీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి హామీలు వేటి ద్వారా లభించాయి ?
జ: రాజ్యాంగ ప్రవేశిక ద్వారా
4) రాజ్యాంగంలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఏ నిబంధన కామన్ సివిల్ కోడ్ ను ఏర్పాటు చేయాలని పేర్కొంది ?
జ: 44వ నిబంధన
5) ఇంతవరకూ అమలు చేయని ఏకైక ఆదేశిక సూత్రంగా దేన్ని పేర్కొంటారు ?
జ: ఉమ్మడి పౌరస్మృతి
6) రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిద్యం లేదని రాష్ట్ర్ర ప్రభుత్వం భావిస్తే వారికి కొన్ని ఉద్యోగాలు రిజర్వు చేయవచ్చు ?
జ: 16(4) నిబంధన
7) మొదట రిజర్వేషన్లను ఎంత కాలపరిమితితో ఏర్పాటు చేశారు ?
జ: పది సంవత్సరాలు
8) ప్రస్తుతం రిజర్వేషన్లను ఏ సంవత్సరం వరకూ పొడిగించారు ?
జ: 2025 వరకూ.
9) క్రిమీలేయర్ వర్గం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందకుండా అడ్డుకోవాలని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ?
జ: ఇందిరా సహాని కేసు
(నోట్: OBCలకు 27శాతం రిజర్వేషన్లు సవాలు చేస్తూ వేసిన కేసు)
10) ఏ కేసులో సుప్రీంకోర్టు 1963లో రిజర్వేషన్లను 50 శాతానికి మించకూడదని పేర్కొంది ?
జ: బాలాజీ కేసులో
11) రాజ్యాంగానికి చేయబడిన ఏయే సవరణలు రాజ్యాంగ మౌళిక స్వరూపం మార్చుటకు ప్రయత్నించాయనే విమర్శ ఉంది ?
జ: 1,4,17,24,25,42
12) 1967లో సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రాధమిక హక్కులను మార్చే అధికారం పార్లమెంటుకు లేదని ప్రకటించింది ?
జ: గోలక్ నాధ్ కేసులో
13) గోలక్ నాధ్ కేసు తర్వాత పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలు ప్రాధమిక హక్కులకు విరుద్దం అని కోర్టులు ప్రకటించకూడదని తెలిపింది ?
జ: 24వ రాజ్యాంగ సవరణ 13(2)(1971)
14) ఏ కేసులో ప్రాధమిక హక్కులను సవరించే అదికారం పార్లమెంటుకు ఉందనీ... అయితే రాజ్యాంగం మౌళిక స్వరూపం మార్చే అధికారం ఎవ్వరికీ లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది ?
జ: 1973లో కేశవనంద భారతి కేసులో
15) ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లభించింది ?
జ: 42వ రాజ్యాంగ సవరణ
16) ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ అధికారంపై పరిమితులు విధించాయి ?
జ: 44వ రాజ్యాంగ సవరణ