రాజ్యాంగంపై వివిధ సవాళ్ళు

పత్రికలు - సోషల్ మీడియా స్వేచ్చ కొత్త సవాళ్ళు

1) భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కులలోని ఏ నిబంధన ఆరు రకాల స్వేఛ్చలను భారత పౌరులకు కల్పిస్తోంది ?
జ: 19వ నిబంధన
2) 19(1) (ఎ) ప్రకరణం వాక్ స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ కింద ఏ ఇతర స్వేచ్ఛలు అంతర్భాగంగా ఉన్నాయి ?
జ: పత్రికా స్వేచ్చ, మీడియా స్వేచ్చ

ఎన్నికల్లో అక్రమాల నివారణ - కొత్త సవాళ్ళు

3) ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే ఎన్నికల ప్రవర్తనావళి ఏ పేరుతో అమలు చేయబడుతుంది ?
జ: కోడ్ ఆఫ్ కండక్ట్
4) రాజకీయాల్లో, ఎన్నికల్లో నేరస్థులు పోటీ చేయడం, ప్రమేయం చూపడాన్ని ఏ కమిటీ తెలిపింది ?
జ: 1993లో N.N.వోహ్ర కమిటీ
5) 2014 లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులపై ఎక్కువగా నేరారోపణలు ఉన్నాయి ?
జ: కాంగ్రెస్ - 57 శాతం
6) ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది నేరస్థులు ఎన్నికల బరిలో నిల్చున్నారు ?
జ: ఉత్తర ప్రదేశ్ (30శాతం మంది )

పార్టీ ఫిరాయింపులు

7) 1985లో ఎవరి హయాంలో పార్టీ ఫిరాయింపుల చట్టం చేశారు ?
జ: రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు
8) పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ లో చేర్చారు ?
జ: 52వ రాజ్యాంగ సవరణ
9) ఫిరాయింపులకు రాజకీయ పార్టీలు పెట్టుకున్న గౌరవప్రదమైన పదం ఏది ?
జ: పొలిటికల్ ఎడ్జెస్ట్ మెంట్

ఆస్థి హక్కు అమలు

10) మొదట్లో ఆస్థి హక్కు ఏ హక్కుగా ఉండేది ?
జ: ప్రాధమిక హక్కుగా
11) ఆస్థి హక్కుకి పార్లమెంట్ ఎన్నిసార్లు సవరణ చేసింది ?
జ: 1964లో 17వ రాజ్యాంగ సవరణ,
1971లో 24న రాజ్యాంగ సవరణ
12) 1978లో చేయబడిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆస్థి హక్కును ప్రాధమిక హక్కుల జాబితాల నుంచి తొలగించి ఎక్కడ చేర్చారు ?
జ: 12వ భాగంలోని 300A లో నిబంధన
13) ఆస్థి హక్కును ప్రస్తుతం ఏవిధంగా మార్చారు ?
జ: రాజ్యాంగపరమైన హక్కుగా
14) ఆస్థి హక్కు... రాజ్యాంగపరమైన హక్కుగా చేసిన సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: ఈ సవరణ 1979 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది
15) ఆస్థి హక్కుకి సంబంధించి 31(ఎ) నిబంధన ఏం చెబుతుంది ?
జ: ఆస్థిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కోర్టుల్లో ప్రశ్నించరాదు
16) ప్రాధమిక హక్కులకు భిన్నంగా ఉన్నాయని 9వ షెడ్యూల్ లోని చట్టాలను ప్రశ్నించరాదని చెప్పే నిబంధన ఏది ?
జ: 31(బి)
17) 2008లో సుప్రీంకోర్టు ఏ కేసులో 9వ షెడ్యూల్ లోని చట్టాలు కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదని ప్రకటించింది ?
జ: ఐఆర్ కోహెల్లా (తమిళనాడు) కేసులో
18) ఆదేశిక సూత్రాల అమలులో ఆస్దిహక్కుపై ఆంక్షలు విధించవచ్చని చెప్పే నిబంధన ఏది ?
జ: 31(సి)
19) భారత రాజ్యాంగంలోని అత్యంత వివాదస్పదమైన హక్కు ఏది ?
జ: ఆస్థి హక్కు
20) ఆస్థిహక్కుకి సంబంధించిన 31వ ప్రకరణపై సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చింది ?
జ: 275 తీర్పులు
21) రాజ్యాంగంలోని ఎక్కువ సవరణలు దేనికి సంబంధించినవి ?
జ: ఆస్థిహక్కుకు