Sunday, February 23

02 Daily Quiz – కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2019-20

1. 2019-20 రైల్వే బడ్జెట్ కి సంబంధించిన కేటాయింపుల్లో సరైనవి ఏవి

ఎ) రైల్వే బడ్జెట్ ఆదాయాన్ని రూ.2.16 లక్షల కోట్లు. వ్యయం రూ.2.70 లక్షల కోట్లు
బి) ఏడాదికి 10 వేల కిలోమీటర్ల కొత్త లైన్లు, గేజ్ మార్పిడి, విద్యుద్దీకరణ చేయాలనీ, డీజెల్ ఇంజన్లు కొనుగోలు చేయరాదని నిర్ణయించారు
సి) 2020 మార్చి నాటికి 7200 రైళ్ళల్లో సీసీ టీవీలు అమరుస్తారు

2. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ఎక్కడ ప్రారంభించారు

3. 2019-20 కేంద్ర బడ్జెట్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) జలభద్రత కోసం ... జలశక్తి శాఖకు 28 వేల 261 కోట్ల రూపాయలు కేటాయించారు.
బి) 2025 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందాలన్నది లక్ష్యం.
సి)దీన్నే హర్ ఘర్ జల్ పేరుతో వ్యవహరిస్తారు
డి) ఈ జల జీవన్ మిషన్ కోసం 10 వేల 1 కోట్లు కేటాయించారు

4. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జతపరచండి
1) ఆరోగ్య రంగం
2) గ్రామీణాభివృద్ధి
3) మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం
4) లోక్ పాల్ వ్యవస్థ

ఎ) 62 వేల 650 కోట్లు
బి) 1.17 లక్షల కోట్లు
సి) 1084 కోట్లు
డి) 101.29 కోట్లు

5. ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకం 2015 జనవరి 22న ఎక్కడ ప్రారంభించారు ?

6. 2019-20 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనల్లో సరైనవి ఏవి

ఎ) వ్యవసాయ రంగానికి రూ.1.39 లక్షల కోట్లు కేటాయించారు
బి) రైతులకు పెట్టుబడి సాయం కింద కొత్తగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ బడ్జెట్ కు కేటాయించిన మొత్తంలో ఎక్కువ భాగం ఈ స్కీమ్ కే వెళ్తుంది.
సి) పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి భారత దేశంలో మొత్తం 14 కోట్ల 50 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొదట 2 హెక్టార్లలోపు రైతులకు మాత్రమే ఏడాదికి 6 వేల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

7. రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.350 లక్షల కోట్లుగా రూపొందించాలన్నది తమ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అందుకు ఏ ఏడాదిని టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెప్పారు ?

8. కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి భారత దేశంలో మొత్తం 14 కోట్ల 50 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు.
2) సమ్మాన్ నిధి కింద మొదట 2 హెక్టార్లలోపు రైతులకు మాత్రమే ఏడాదికి 6 వేల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది
3) రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2 హెక్టార్ల నిబంధన తొలగించడంతో దాంతో లబ్దిదారుల సంఖ్య 12 కోట్ల 50 లక్షల మంది ఉంటే... ఇప్పుడు మరో 2 కోట్ల మంది యాడ్ అయ్యారు
4) తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది, ఏపీలో 60 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులు అవుతారు

9. గ్రామాల అభివృద్ధిలో భాగంగా సంప్రదాయ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించాలని కేంద్ర బడ్జెట్ లో నిర్ణయించారు. అందుకోసం కొత్తగా ప్రారంభించబోయే పథకం ఏది ?

10. ఏడాదికి కోటి రూపాయలకి పైగా నగదు విత్ డ్రా చేస్తే ఎంతశాతం ట్యాక్స్ విధించనున్నారు ?

11. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నరు 2019-20 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2019 జులై 5న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఎంతమొత్తంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ?

12. అంతర్జాతీయ రంగంలో సాధించిన ప్రగతిని ఆర్థికాభివృద్ధికి వాడుకోడానికి ప్రభుత్వం నిర్ణయించింది... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించేందుకు ఏర్పాటు చేసిన సంస్థకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) ‘‘న్యూ ఫేస్ ఇండియా లిమిటెడ్ - NSIL అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.
2) ఇది అంతరిక్ష శాఖకు వాణిజ్య విభాగంగా పనిచేస్తుంది. ఇస్రో ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతుంది
3) 2020 కల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఇస్రో లక్ష్యానికి NSIL కృషి చేస్తుంది.

13. ఈ కింది ప్రకటలను గమనించి సరైనవి గుర్తించండి
1) రూ 27 లక్షల 86 వేల 349 కోట్ల రూపాయలతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు
2) ఇందులో ద్రవ్య లోటు 7 లక్షల 3 వేల 760 కోట్లుగా ఉంది... ఇది స్థూల జాతీయోత్పత్తి అంటే GDP లో 3.3శాతం.
3) లోటు బడ్జెట్ ను పూడ్చడానికి విదేశీ మార్కెట్ నుంచి ఈ ఏడాది రూ.4.48 లక్షల కోట్లు రుణాలు సేకరిస్తారు.

14. పేద కుటుంబాల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్రమోడీ ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ప్రారంభించారు. దేశంలోని 115 వెనుకబడ్డ జిల్లాలకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పిస్తారు. అయితే ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఎంత మొత్తం ఆరోగ్య బీమా కల్పించనున్నారు ?

15. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు 60యేళ్లు దాటిన వారికి నెలకు రూ.3వేలు చొప్పు ఫించన్ అందించే కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం పేరేంటి ?

16. కేంద్ర బడ్జెట్ 2019-20 కేటాయింపులు జతపరచండి
1) రక్షణ రంగం
2) వ్యవసాయ రంగం
3) బేటీ బచావో, బేటీ పడావో
4) విద్యా రంగం

ఎ) 3.18 లక్షల కోట్లు
బి) 280 కోట్లు
సి) 94,853 కోట్లు
డి) 1.39 లక్షల కోట్లు

17. కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి చెందిన బడ్జెట్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1) 2019-20 రక్షణ రంగానికి రూ.3.18 లక్షల కోట్లు కేటాయించారు. జాతీయోత్పత్తి GDPలో 1.6శాతం మాత్రమే
2) ప్రపంచంలో రక్షణ రంగంపై ఎక్కువగా ఖర్చుపెడుతున్న దేశాల్లో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది... ఈ జాబితాలో అమెరికా, చైనా, సౌదీ అరేబియా, భారత్, ఫ్రాన్స్ ఉన్నాయి.
3) S-400 ఇవి రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు... వీటి విలువ 40వేల కోట్లు
4) రఫేల్... ఇవి ఫ్రాన్స్ నుంచి కొంటున్నారు... వీటి విలువ 58 వేల కోట్లు

18. ఉజ్వల యోజనకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది తప్పుగా చెప్పారు
1) 2025 నాటికి గ్రామాల్లోని ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్, వంట గ్యాస్ సౌకర్యం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
2) ఉజ్వల యోజన కింద దేశంలో ఇప్పటి వరకూ 7 కోట్లకి పైగా వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు.
3) సౌభాగ్య పథకం కింద 2 కోట్ల 63 లక్షల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ లభించింది.
4) ఛత్తీస్ గఢ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో 100శాతం విద్యుద్దీకరణ సాధ్యమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.
5) ఈ ఉజ్వల యోజన కింద 35 కోట్ల LED బల్బులను పంపిణీ చేశారు

19. ఖేలో ఇండియా లో భాగంగా ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు జాతీయ క్రీడా విద్యా బోర్డును ఏర్పాటు చేయనున్నారు. క్రీడలకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించారు ?