Friday, May 25
Log In

కేంద్ర బడ్జెట్ – 2017-18 (Q&A)

1) బడ్జెట్ అనే పదం దేని నుంచి వచ్చింది ?
జ: బౌగొట్టె

2) బడ్జెట్ ను రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ఆర్థికమంత్రి లోక్ సభలో ప్రవేశపెడతారు ?
జ: 112వ ప్రకరణం

3) రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ ను ఏమని పిలుస్తారు ?
జ: వార్షిక నివేదిక లేదా వార్షిక ఆదాయ, వ్యయ పత్రం

4) ఆర్థిక సర్వేని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడు లోక్ సభలో ప్రవేశపెట్టారు ?
జ: జనవరి 31, 2017

5) కేంద్ర బడ్జెట్ ను ఎన్ని కోట్లతో ప్రవేశపెట్టారు ?
జ: రూ.21.47 లక్షల కోట్టతో

6) స్వాంతంత్ర్య భారతంలో 2017-18 కి ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నవది ?
జ: 87 వ వార్షిక బడ్జెట్

7) ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ ఎన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ?
జ: నాలుగు సార్లు

8) ప్రపంచ దేశాలతో పోలిస్తే నిధులపరంగా భారత్ బడ్జెట్ కు ఎన్నో స్థానం ఉంది ?
జ: 13 వ స్థానం

9) రైల్వే బడ్జెట్ ను ఎన్నేళ్ళ నుంచి విడిగా ప్రవేశపెడుతున్నారు ?
జ: 92 యేళ్ళుగా
(జ: 1924లో బ్రిటీష్ వాళ్ళు ప్రారంభించారు. ఈ బడ్జెట్ లో రైల్వే, సాధారణ బడ్జెట్ కలిపి ప్రవేశపెట్టారు )

10) 2017-18 కేంద్ర బడ్జెట్ లో ఇంకో ప్రత్యేకత ఏంటి ?
జ: ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ కు స్వస్తి చెప్పారు

11) బ్రిటీష్ హయాంలో 1860, ఫిబ్రవరి 18న ఎవరు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ?
జ: జేమ్స్ విల్సన్
(అప్పట్లో ఆయన కలకత్తా వైశ్రాయ్ కౌన్సిల్ లో ఆర్థిక సబ్యుడు)

12) స్వాతంత్ర్యం వచ్చాక 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టారు ?
జ: షణ్మగం శెట్టి

13) భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత 1950 ఫిబ్రవరి 28న బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టారు ?
జ: జాన్ మథాయ్

14) రాజకీయ పార్టీలు ఒక్కో వ్యక్తి ఎంతకు మించి విరాళాలు స్వీకరించకుండా బడ్జెట్ లో ఆంక్షలు పెట్టారు ?
జ: రూ. 2వేలు

15) 2017-18 బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయింపులు ఎంత ?
జ: 2.74 లక్షల కోట్లు
( ఇందులో ఆధునీకరణ, కొత్త ఆయుధాల కొనుగోలుకు రూ.86,488 కోట్లు)

16) ఎప్పటి లోగా కోటి ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 2019 నాటికి

17) ముద్ర రుణాల కోసం ఈసారి బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించారు ?
జ: రూ.2.44 లక్షల కోట్లు

18) దేశం నుంచి క్షయ వ్యాధిని ఎప్పటి లోగా  పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 2025 లోగా

19) 2017-18 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ కింద ఎంత కేటాయింపులు చేశారు ?
జ: రూ.1.31 లక్షల కోట్లు

20) 2017-18 లో కొత్తగా ఎన్ని కిలోమీటర్ల మేర రైళ్ళ సర్వీసులు పొడిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 3,500 కిలోమీటర్లు

21) 2017-18 బడ్జెట్ లో ఎన్డీఏ సర్కార్ టెక్ ఇండియాకి ఎన్ని సూత్రాలు ప్రతిపాదించింది ?
జ: 10 సూత్రాలు

22) పారిశ్రామిక రంగంలో 2016-17 సంవత్సరానికి ఎంత శాతం వృద్ధిరేటు నమోదైంది ?
జ: 5.2 శాతం
(అంతకుముందు 2015-16 లో 7.4 శాతం )

23) 2017-18 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు ?
జ: రూ.58,663 కోట్లు

24) బేటీ బచావో పథకానికి ఎంత ?
జ: రూ.200 కోట్లు

25) ప్రధానమంత్రి ఆవాస్ యోజన - రూ. 23 వేల కోట్లు
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - రూ.19 వేల కోట్లు
అమృత్, స్మార్ట్ సిటీలు రూ.7,770 కోట్లు
దీన్ దయాళ్ ఉపాధ్యా గ్రామ్ యోజన : రూ.10,635 కోట్లు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నకు 2017-18 బడ్జెట్ లో ఎంత కేటాయించారు ?
- రూ.48 వేల కోట్లు
ప్రధాని పంటల బీమా పథకం రూ.9 వేలకోట్లు

26) 2017-18 బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) లను 250 నుంచి ఎంతకు విస్తరించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 585 మార్కెట్లు

27) రక్షణ రంగ కేటాయింపుల్లో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
జ: నాలుగు
( అమెరికా, చైనా, బ్రిటన్ తర్వాత భారత్ )

28) 2016 జూన్ నాటికి దేశంలో జాతీయ రహదారులు ఎన్ని కిలోమీటర్లు ?
జ: 1,00,087.08 కి.మీ.

29) దేశంలో జాతీయ రహదారులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
జ: ఉత్తరప్రదేశ్ (8,483 కిమీ)

30) తెలంగాణలో జాతీయ రహదారులు ఎన్ని కిలోమీటర్లు ?
జ: 5,303 కిమీ

31) 2014లో ప్రతి వెయ్యి మంది జననాలకు 39గా ఉన్న శిశుమరణాల రేటును 2019 నాటికి ఎంతకు తగ్గించాలన్నది లక్ష్యం ?
జ: 28 కి

32) గత దశాబ్దంలో భారత్ లో సగటు ఆయుర్ధాయం ఎంతకు పెరిగింది ?
జ: ఏడేళ్ళకి

33) మాతృత్వ మరణాల రేటు గడచిన దశాబ్దంలో ఎంతకు తగ్గింది ?
జ: 60శాతానికి

34) 2014 లో కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకంలో భాగంగా ఎన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించనున్నారు ?
జ: 25 విభాగాల్లో

35) 2012-14 ల మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ.3.3 లక్షల కోట్లు నుంచి మేకిన్ ఇండియా ప్రకటించాక 62శాతం వృద్ధితో ఎంతకు చేరాయి ?
జ: రూ.5.3 లక్షల కోట్లు

36) మేకిన్ ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధికంగా సేవారంగానికి ఎన్ని కోట్లు వచ్చాయి ?
జ: రూ.46,969 కోట్లు

37) స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుకు 2017-18 వార్షిక బడ్జెట్ లో ఎంత కేటాయించారు ?
జ: రూ.3,989.50 కోట్లు

38) దేశవ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు స్మార్ట్ సిటీ మిషన్ ను ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2015 జూన్ 25న

39) దేశంలో ఎన్ని నగరాలు, పట్టణాలు ఉన్నాయి ?
జ: 7,935
40)  2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా దేశంలో ఎంత శాతంగా ఉంది ?
జ: 31.16 శాతం

41) దేశంలో అత్యధికంగా వేటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది ?
జ: బొగ్గు ఆధారితం - 61 శాతం
భారీ జలవిద్యుత్ - 13.9శాతం
అణు విద్యుత్ 1.9 శాతం మాత్రమే

42) 2014 ఐరాస లెక్కల ప్రకారం దేశంలో 10-24 యేండ్ల మధ్య 35.6 కోట్ల మంది ఉన్నారు. వీరి శక్తి సామర్థ్యాలను వినియోగించుకోడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ?
జ: సంకల్ప్
( స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్ నెస్ ఫర్ లైవ్లీ హుడ్ ప్రమోఝన్ ప్రోగ్రామ్ )

43) పరిశ్రమల కోసం నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన పథకం ఏది ?
జ: స్కిల్ స్ట్రెంత్ నింగ్ ఎన్ హాన్స్ మెంట్ (స్టయివ్ )

44) ఆర్థికమంత్రిగా ఉండి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రులు ఎవరు ?
జ: జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ
45) తొలి మహిళా ఆర్థికమంత్రి ఎవరు ?
జ: ఇందిరా గాంధీ

46) ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఎవరు ?
జ: సీడీ దేశ్ ముఖ్ (1951-52), మన్మోహన్ సింగ్

47) ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన వారు ఎవరు ?
జ: మన్మోహన్ సింగ్, వీపీ సింగ్ , మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్

48) 1991లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతుల పరంగా అది పెద్దది. అందులో ఎన్ని పదాలు ఉన్నాయి ?
జ: 18,520 పదాలు

49) 1952 లో అతి తక్కువ ప్రతులతో 4,454 పదాలతో బడ్జెట్ ను తయారు చేసిన వారు ఎవరు ?
జ: సీడీ దేశ్ ముఖ్

50) ఆర్థికమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎవరు ?
జ: ఆర్ .వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జీ

51) అత్యధికంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారు ఎవరు ?
జ: మొరార్జీ దేశాయ్ ( 10 సార్లు )
చిదంబరం (9 సార్లు )
ప్రణబ్ ( 8 సార్లు )

52) పార్లమెంటలో సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థికమంత్రి ఎవరు ?
జ: మధు దండావతే ( 133 నిమిషాలు )

53) ఆర్థికమంత్రిగా పనిచేసి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రానివారుఎవరు ?
జ: బహుగుణ, జశ్వంత్ సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *