Saturday, May 26
Log In

కేంద్ర బడ్జెట్ – 2018-19 (రెండో భాగం)

31) నాలుగు కోట్ల గ్రామీణ, పట్టణ పేదల ఇళ్ళకు ఉచిత విద్యుత్ పంపిణీయే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి రూ.16 వేల కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించారు. ఆ పథకం పేరేంటి
జ: సౌభాగ్య యోజన
32) గ్రామీణ విద్యుదీకరణకు కేంద్రం అమలు చేస్తున్న పథకానికి రూ.3,800 కోట్లు ప్రకటించారు. ఆ పథకం ఏది
జ: దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామజ్యోతి యోజన
33) దేశంలో 60యేళ్ళు పైబడిన వృద్ధులకు సామాజిక భద్రత కల్పనలో భాగంగా అమలు చేస్తున్న పథకం ఏది
జ: వరిష్ట పింఛను బీమా యోజన
34) వరిష్ట పింఛను బీమా యోజన కింద కేంద్రం చెల్లించే ఏక ప్రీమియం ఎంత
జ: రూ.7,50,000
35) 60 యేళ్ళు పైబడిన వృద్దుల కోసం కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న తెచ్చిన పథకం ఏది
జ: అటల్ ఫించను యోజన
36) 2017 మార్చి నాటికి దేశంలో ఎస్టీల జనాభా ఉన్న జిల్లాలను ఎన్ని ఉన్నాయని కేంద్రం గుర్తించింది
జ: 163 జిల్లాలు
37) 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు ఎంత వాటా ఇస్తున్నారు ?
జ: 42శాతం
38) 15వ ఆర్థిక సంఘం ప్రస్తుత ఛైర్మన్ ఎవరు... ఈ సంఘం ఎప్పటి వరకూ నివేదిక సమర్పించనుంది
జ: ఛైర్మన్ : ఎన్ కే సింగ్, 2019 అక్టోబర్ నాటికి
(నోట్: 15 వ ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులను 2020-2025) వరకూ అమలు చేస్తారు
39) 2019 అక్టోబర్ 2 నుంచి 2020 అక్టోబర్ 2 వరకూ మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను జరపడానికి కేంద్రం బడ్జెట్ లో ఎంత కేటాయించింది
జ: రూ.150 కోట్లు
40) పరిసరాల పరిశుభ్రతపై జనాన్ని చైతన్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రవేశపెట్టింది. అయితే పరిశుభ్ర భారత్ కు టార్గెట్ ఎప్పటి వరకూ ఉంది
జ: 2019 అక్టోబర్ 2 నాటికి ( గాంధీ జయంతి)
41) స్వచ్ఛ్ భారత్ పథకానికి 2017-18 బడ్జెట్ లో ఎంత మొత్తాన్ని కేటాయించారు ?
జ: రూ.19,248 కోట్లు ( వచ్చే ఏడాదిలో 2 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తారు )
42) వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నుపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎంత శాతం ఆరోగ్య, విద్యా సెస్ విధించనున్నట్టు ప్రకటించింది
జ: 4శాతం
43) దిగుమతి చేసుకున్న వస్తువులపై సాంఘీక సంక్షేమ సర్ ఛార్జిని ఎంత విధించనున్నారు
జ: 10శాతం సర్ ఛార్జి
44) స్మార్ట్ సిటీస్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడు ప్రవేశపెట్టింది
జ: 2015 జూన్ 25న
45) 2018 జనవరి నాటికి దేశంలో ఎన్ని ఆకర్షణీయ నగరాల( స్మార్ట్ సిటీస్ ) కింద ఎంపికయ్యాయి
జ: 99 నగరాలు
46) ఏడాదికి ఎన్ని లక్షలు దాటిన వార్షిక ఆర్థిక లావాదేవీలకు ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు తప్పనిసరి చేయనున్నారు ?
జ: రూ.2.5 లక్షలు
47) నల్లధనం బయటపెట్టడంలో భాగంగా స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరే ఏంటి
జ: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన
48) లక్ష రూపాయలకు పైబడిన ఈక్విటీ లాభాలపై ఎంత శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం విధించింది ?
జ: 10శాతం
49) దేశంలో విమాన ప్రయాణాలను చౌక చేసేందుకు ప్రాంతీయ విమానయాన పథకం (ఉడాన్) కింద 56 విమానాశ్రయాలను నిర్మించనున్నారు. కొత్తగా ఎన్ని విమానాలను ప్రవేశపెట్టనున్నారు ?
జ: 900 విమానాలు
50) 2018-19 ఆర్థిక సంవత్సరంలో ముద్రా యోజన కింద ఎన్ని కోట్ల రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: రూ.3 లక్షల కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *