Friday, November 16
Log In

Uncategorized

ట్రాన్స్‌కోలో 106 పోస్టులు

ట్రాన్స్‌కోలో 106 పోస్టులు

Latest News, Latest Notifications, Uncategorized
తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ ( ట్రాన్స్‌కో) లో 106 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టుల వివరాలు: జూనియర్ పర్సనల్ ఆఫీసర్ : 62 పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్: 44 పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్: అర్హతలు: బీకాం ఫస్ట్ క్లాస్ / ఎంకామ్ ఫస్ట్ క్లాస్ / CA-ICWA- INTER పాసైన అభ్యర్థులు JAO పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11 లోగా ఆన్ లైన్ లో పంపాలి. జూనియర్ పర్సనల్ ఆఫీసర్: అర్హతలు: ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ లేదా ఈక్వెలెంట్ డిగ్రీ పాసైన వారు అర్హులు. ఈ పోస్టుకోసం అప్లయ్ చేసేవారు: సెప్టెంబర్ 11 నుంచి 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలకు: https://tstransco.cgg.gov.in
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు

Latest News, Latest Updates, Uncategorized
2018-19 సం.నికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల ప్రవేశానికి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు కోరుతున్నారు. UG కోర్సులు: B.A., B.Com., B.Sc.,B.Lic., PG కోర్సులు: M.A, M.Com., M.Sc., M.Lisc., Pg Diploma, Certificatee Programs 1) MA - తెలుగు మీడియం (2సంవత్సరాలు) అర్థశాస్త్రం చరిత్ర రాజనీతి శాస్త్రం ప్రభుత్వ పాలనాశాస్త్రం సమాజ శాస్త్రం ఇంగ్లీష్ హిందీ, ఉర్దూ 2) ఎంకామ్: రెండేళ్ళు 3) ఎంఎస్సీ : రెండేళ్ళు (ఇంగ్లీష్ మీడియం) మ్యాథమెటిక్స్ /అప్లయిడ్ మ్యాథమెటిక్స్ సైకాలజీ బాటనీ కెమిస్ట్రీ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ ఫిజిక్స్ జువాలజీ 4) M.Lic. - మాస్టర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ - ఏడాది 5) B.Lic - బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ - ఏడాది 6) PG Diplome in Marketing Management 7) PG Diplome in Business Fina

CURRENT AFFAIRS – JULY 3 &4

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, July Current Affairs, Uncategorized
రాష్ట్రీయం 01) గోదావరి నదిపై మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం చేపడుతోంది ? జ: ఒడిశా 02) ఇండియా టుడే మేగజైన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన 38 బెస్ట్ యూనివర్సిటీల సర్వేలో మన రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎన్నో స్థానం దక్కింది ? జ: 3 వ స్థానం (నోట్: ఉస్మానియాకి నాలుగో స్థానం) 03) బయోపోర్టిఫికేషన్ పద్దతిలో దేశంలోనే మొదటిసారిగా అధిక దిగుబడి ఇచ్చే జొన్న వంగడాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది ? జ: ఇక్రిశాట్ జాతీయం 04) ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ రూపొందించిన యాప్ ఏది ? జ: సీవిజిల్ ( సిటిజన్స్ విజిల్ ) 05) జీడీపీ గణాంకాలను లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ (ఆధార సంవత్సరం) 2011-12. దీన్ని ఏ ఏడాదికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 2017-18 06) రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్ ప్రస్తుతం 2012. దీన్ని ఏ ఏడాదికి మార్చా
TSPSC అధికారిక ప్రకటన రిలీజ్

TSPSC అధికారిక ప్రకటన రిలీజ్

Latest News, Latest Notifications, Uncategorized
నిన్న ప్రకటించిన 2,786 ఉద్యోగాల కోసం TSPSC నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు, ఎగ్జామ్ డేట్స్ ప్రకటించింది. గ్రూప్ -IV : 1521 పోస్టులు (10/2018) ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 7, 2018 నుంచి 6 జులై 2018 వరకూ ఎగ్జామ్ (దాదాపుగా ) : 7 అక్టోబర్ 2018 నాడు జూనియర్ అసిస్టెంట్స్ (ఆర్టీసీ ): 33 పోస్టులు+39 (11/2018) ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 7, 2018 నుంచి 6 జులై 2018 వరకూ ఎగ్జామ్ (దాదాపుగా ) : 7 అక్టోబర్ 2018 నాడు మండల స్టాటిస్టికల్ ఆఫీర్స్ /అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్: 474 పోస్టులు (12/2018) ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 8, 2018 నుంచి 2 జులై 2018 వరకూ ఎగ్జామ్ (దాదాపుగా ) : 7 సెప్టెంబర్ 2018 నాడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్: 700 పోస్టులు (13/2018) ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 8, 2018 నుంచి 2 జులై 2018 వరకూ ఎగ్జామ్ (దాదాపుగా ) : 16

పోలీస్ అభ్యర్థులకు వయో పరిమితి పెంచే అవకాశం

Uncategorized
రాష్ట్రంలో భర్తీ చేయబోయే 18 వేల పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరేళ్ళ పాటు వయో పరిమితి పెంచాలని నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులు హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ధర్నాచేశారు. మానవతారాయ్ తో పాటు నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత డీజీపీ మహేందర్ రెడ్డి కార్యాలయంలో చర్చలు జరిగాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ లో 6 యేళ్ళ వయో పరిమితి పెంచాలని డిజీపీని కోరారు నిరుద్యోగులు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి వయో పరిమితి పెంచే విధంగా చూస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు డిజీపీ. గత ఏడాది లాగే 4యేళ్ళు పెంచే విధంగా ఈసారి కూడా అదే తరహాలో పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు డీజీపీ. ప్రభుత్వం అంగీకరిస్తే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన చేసే అకాశాలున్నాయి.

పదో తరగతి ఫలితాలు విడుదల

Uncategorized
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. 5,34,726 మంది పరీక్షలు రాశారు. 83.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలదే హవా. జూన్ 4 నుంచి 19 వరకూ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అందుకోసం మే 21 లోపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని కడియం శ్రీహరి ప్రకటించారు. For Results : http://bse.telangana.gov.in/ http://results.cgg.gov.in/