Friday, February 26
Shadow

Telangana Special

తెలంగాణ ప్రాజెక్టులు – QUICK REVISION

Latest News, Telangana Special
1) నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ : ఈ ప్రాజెక్టుని నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం దగ్గర నిర్మించారు. 1955, డిసెంబర్ 10న ప్రారంభమైంది. నాగార్జున సాగర్ డ్యామ్ పొడవు 1500 మీ ఉండగా ఎత్తు 124 మీ. ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం 2.15 లక్షల చదరపు కిలోమీటర్లు దీనికి కింద 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుంది. 2) శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు దీన్ని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు దగ్గర గోదావరి నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టుకి 1963లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1978లో నిర్మాణం పూర్తయింది. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద 16.5 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. 3) ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఇది జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రావులపల్లి దగ్గర నిర్మించారు. 11 టీఎంసీల సామర్థ్యంతో 1984లో ప్రాజెక్ట్ నిర్మాణం...

తెలంగాణా పదకోశం

Telangana Special
తూటు : రంధ్రం ఏతులు : గొప్పలు మలుపు : మూల తాపతాపకు : మాటిమాటికి జల్ది : త్వరగా కొత్తలు : డబ్బులు ఏంచు : లెక్కించు నాదాన : బలహీనం నప్పతట్లోడు: పనికి మాలినవాడు ల్యాగ : ఆవు దూడ గుపాయించు: జొరబడు కూకొ : కూర్చో కూనం : గుర్తు మడిగ : దుకాణం పొట్లం : ప్యాకింగ్ బత్తీసలు : అప్పడాలు పతంగి : గాలిపటం సోంచాయించు: ఆలోచించు పయఖాన : టాయిలెట్ మోసంబి : బత్తాయి అంగూర్ : ద్రాక్ష కష్‌కష్ : గసాలు కైంచిపలంగ్ : మడత మంచం చెత్రి : గొడుగు కల్యామాకు : కరివేపాకు మచ్చర్‌దాన్ : దోమతెర మడుగుబూలు: మురుకులు జమీర్‌ఖాన్ : భూస్వామి జాగా : స్థలం తండా : చల్లని గర్మి : వేడి వూకె : ఉట్టిగా సిలుం : తుప్పు నియ్యత్ : నిజాయితీ తపాలు : గిన్నె తైదలు : రాగులు పలంగి : మంచము బలంగ్రి : డ్రాయింగ్ రూం సల్ప : నున్నని రాయి దప్పడం...

పిిండివంటలు

Telangana Special
1) బూరెలకు గల ఇంకొక పేరు ఏమిటి ? జ: పోలెలు 2) జోన్న గటుకకు గల ఇంకొక పేరు ఏమిటి ? జ: సంకటి 3) గూగిళ్లను తెలంగాణాలో ఏ పేరుతో పిలుస్తారు ? జ: గుడాలు 4) మల్లీద ముద్దలకు గల ఇంకొక పేరు ఏది ? జ: సజ్జముద్దలు 5) సజ్జముద్దలను తెలంగాణాలో ఏ పండుగనాడు చేస్తారు ? జ: బతుకమ్మ పండుగ 6) అంబలి వేటితో తయారు చేస్తారు ? జ: జొన్నలు, రాగులు, సజ్జలపిండి, రవ్వ 7) తెలంగాణాలో ప్రసిద్ధి పొందిన బిర్యాని ఏది ? జ: హైదరాబాద్ బిర్యాని 8) జొన్నరొట్టె వేటితో తయారు చేస్తారు ? జ: ఎర్రజొన్నలు, తెల్లజొన్నలు, పచ్చిజొన్నలు 9) శకినాలు ఎప్పుడు తయారు చేస్తారు ? జ: సంక్రాంతి 10) తెలంగాణాలో బియ్యం పిండిని ఏ పేరుతో పిలుస్తారు ? జ: సర్వపిండి 11) మడుగులు ఏ పండుగనాడు తయారుచేస్తారు ? జ: వినాయకచవితి 12) తెలంగాణాలో బొంగులను ఏ పేరుతో పిలుస్తారు ? జ: మరమరాలు 13) అరిసెలు గల మరొక పేరు ఏమిటి ? జ: అత్రసలు 14) తెలంగాణాలో కజ...

మండలికాలు

Telangana Special
1) గట్క - జొన్న అన్నం 2) సందూక్ - పెట్టె 3) జిమ్మెదారి - బాధ్యత 4) గోలెం - గాబు 5) పటువ - మట్టికుండ 6) పబ్బతి - దండం 7) ఇనాం - లంచం 8) అంగి - చొక్క 9) శెత్తిరి - గొడుగు 10) రువ్విడి - సాక్ష్యం 11) ముత్తెంత - కొంచం 12) గమ్మతి - వింత 13) ఎటమటం - సక్రమంగ లేకపోవుట 14) పుంటికూర - గొంగూర 15) గోస - కష్టం 16) తోఫా - కానుక 17) గెంటీలు - కర్ణాభరణాలు 18) జిమ్మలు - చేపలు 19) ఎవుసం - వ్యవసాయం 20) జల్ది - తొందరగా 21) కందీలా - లాంతరు 22) పతార - పలుకుబడి 23) ఇలాక - ప్రాంతం 24) పేచి - కొట్లాట 25) పికరు - విచారం 26) ఉసికె - ఇసుక 27) బందూక్ - తుపాకి 28) తొవ్వ - దారి 29) తైదలు - రాగులు 30) దబ్బున - వెంటనే 31) సోయి - తెలివి 32) అరిగోస - పెద్దకష్టం 33) సాకుత - పోషించుట 34) ఇగురం - నైపుణ్యం 35) గడ్డపార - గునపం 36) పిరం - ఎక్కువధర 37) సమ్మతి - ఇష్టం 38) ఇజ్జతి - గౌరవం 39) భవం...

కాకతీయులు

Telangana Special
1) కాకతీయుల కాలంలో న్యాయ విషయాల్లో రాజుకు సలహాలు ఇవ్వడానికి నియమించుకున్న అధికారి ఎవరు ? ఎ) ప్రాడ్విచాకులు బి) రుత్వికులు సి) తాత్వికులు డి) యాత్రికులు 2) రెండో ప్రతాపరుద్రుడిని మాలిక్ కాసర్ ఓడించిన సంవత్సరం ? ఎ) క్రీ.శ.1323 బి) క్రీ.శ.1318 సి) క్రీ.శ.1303 డి) క్రీ.శ.1310 3) కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు ? ఎ) పెరికె ఎండ్ల సుంకం బి) అమ్మబడి సుంకం సి) అరి డి) పెమ్ట సుంకం 4) కాకతీయుల కాలంనాటి ఏ గ్రంధం అప్పటి శిక్షల గురించి వివరిస్తుంది ? ఎ) ప్రతాప చరిత్ర బి) విజ్నానేశ్వరీయం సి) క్రీడాభిరామం డి) పండితారాధ్య చరిత్ర 5) ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండిస్తున్నట్లు వివరించినవారు ఎవరు ? ఎ) మహదేవుడు బి) రుద్రదేవుడు సి) మార్క్ పోలో డి) బేతన 6) కాకతీయుల కాలంలో రూకలు అంటే ఏమిటి ? ఎ) రూపాయి బి) వెండినాణేలు సి) గద్వాణం డి) పైవేవి కావు ...

ముల్కీ రూల్స్, ముల్కీ ఉద్యమం

Telangana Special
1) ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంచ సూత్ర పథకాన్ని ఏ రోజున ప్రకటించింది ? ఎ) 1972 నవంబర్ 28 బి) 1972 నవంబర్ 26 సి) 1972 నవంబర్ 27 డి) 1972 నవంబర్ 29 2) ఏ ఉద్యమాన్ని అణచివేయుటకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టింది ? ఎ) సాయుధ పోరాటం బి) జై ఆంధ్ర ఉద్యమం సి) నక్సలైట్ ఉద్యమం డి) పైవేవి కావు 3) ముల్కీ బదులుగా జోన్లను ప్రవేశపెడుతూ సీమాంధ్ర ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్రపతికి అధికారం ఇస్తున్న ఆర్టికల్ ఏది ? ఎ) 371(బి) బి) 371(సి) సి) 371(ఎ) డి) 371(డి) 4) 1952 ముల్కీ ఉద్యమ సమయంలో ఉథావ్ రావు సంపాదకత్వంలో వచ్చిన పత్రిక ఏది ? ఎ) పాయం బి) ప్రజాతంత్ర సి) గోలకొండ డి) మాభూమి 5) ముల్కీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ లో పి.డి. యాక్ట్ క్రింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు ? ఎ) పూల్ చంద్ గాంధీ బి) జి.ఎస్. మేల్కొటె సి) సయ్యద్ అక్తర్ హుస...

రచయితలు గ్రంథాలు

Telangana Special
1) తెలంగాణా వైతాళికుల గ్రంథమును ఎవరు రచించారు ? ఎ) బిరుదురాజు బి) పేర్వారం జగన్నాథం సి) నెల్లుట్ల రమణరావు డి) కాళోజీ నారాయణరావు 2) కళ్యాణ కారక అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని ఎవరు రాశారు ? ఎ) చండ్ర రాజేశ్వరరావు బి) ఉగ్రాదిత్యుడు సి) గుర్రం జషువా డి) ములుగు వీరభద్రకవి 3) నాగార్జున సాగరము అను గ్రంథమును రచించినది ఎవరు ? ఎ) దాశరథి బి) రావూరి భరద్వాజ సి) అందెశ్రీ డి) ఆచార్య సి. నారాయణరెడ్డి 4) విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథం పేరు ఏమిటి ? ఎ) కర్పూర వసంతరాయలు బి) తెలంగాణా వైతాళికులు సి) నాగార్జున సాగరము డి) పైవేవి కావు 5) జానపద చారిత్రక గేయగాథలు గ్రంథ రచయిత ఎవరు ? ఎ) గంగాధరం బి) నాయని కృష్ణకుమారి సి) జయధీర్ తిరుమలరావు డి) బిరుదు రామరాజు 6) సాహిత్య సోపానాలు అనే సాహిత్య విమర్శ గ్రంథాన్ని ఎవరు రచించారు ? ఎ) పేర్వారం జగన్నాథం బి) దివాకర్ల వేంకటావధాని సి) పింగళి లక...

ఉద్యమపాటలు

Telangana Special
1) ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ అనే పాట ఎవరు పాడారు ? ఎ) గద్దర్ బి) జయరాజు సి) రచ్చ భారతి డి) అందెశ్రీ 2) పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల పాట ఎవరు రాశారు ? ఎ)  కోదటి శ్రీను బి) గోరటి వెంకన్న సి) గూడ అంజన్న డి) గద్దర్ 3) అమ్మా తెలంగాణమా-ఆకలి కేకల రాజ్యమా పాటకు రచయిత ఎవరు ? ఎ) అందెశ్రీ బి) అంబటి వెంకన్న సి) గద్దర్ డి) వరంగల్ శ్రీను 4) తెలంగాణ నెత్తుటి మట్టివాసనలో.. ఒరిగిన అమరుల వీరగంథాలు అనే పాటకు రచయిత ఎవరు ? ఎ) కొదాటి శ్రీను బి) అందెశ్రీ సి) రచ్చ భారతి డి) వరంగల్ శ్రీను 5) గద్దర్ భువనగిరి సభలో పాడిన పాట ఏది ? ఎ) అమ్మా పైలంగా ఉండు అమ్మమాయమ్మ బి) నాతల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ సి) ఉస్మానియా క్యాంపస్ లో డి) అయ్యోనివా నువ్వు అవ్వొనివా 6) ఊరు మనదిరా... వాడా మనదిరా... అనే గేయ రచయిత ఎవరు ? ఎ) గూడ అంజన్న బి) వరంగల్ శ్రీను సి) అంబటి వెంకన్న డి) గోరటి...

దేవాలయాలు

Telangana Special
1) తెలంగాణలో ఏకైక చాముండేశ్వరీ దేవి ఆలయం ఎక్కడ ఉంది ? ఎ) నల్గొండ జిల్లా బి) మెదక్ జిల్లా సి) కామారెడ్డి జిల్లా డి) సంగారెడ్డి జిల్లా 2) కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో అతిపెద్ద ఆలయం ఏది ? ఎ) నాగోబా దేవాలయం బి) కూసుమంచి శివాలయం సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం డి) శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం 3) రామునిచే ప్రతిష్టించబడిన శివలింగమున్న దేవాలయం ఏది ? ఎ) కొమురవెల్లి మల్లన్న దేవాలయం బి) కూసుమంచి శివాలయం సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం డి) కీసర రామలింగేశ్వరాలయం 4) చిలుకూరు బాలాజీకి గల మరోక పేరు ఏమిటి ? ఎ) పాస్ పార్ట్ బాలాజీ బి) ఫారెన్ బాలాజీ సి)  వీసా బాలాజీ డి) ఏదీ కాదు 5) రెండవ శాతకర్ణి నిర్మించిన జైన ఆలయం ఏది ? ఎ) నీలకంఠేశ్వరాలయం బి) నవనాథ సిద్ధేశ్వరాలయం సి) రామప్ప దేవాలయం డి) కాళేశ్వరం ఆలయం 6) ఒకే పీఠంపై రెండు శివలింగాలున్న దేవాలయం ఎక్కడ ఉంది ? ఎ) రామప్ప దేవాలయం బ...

సంస్కృతి, జాతరలు

Telangana Special
1) ఆదిలాబాద్ కేస్లాపూర్ లో గోండులు జరుపుకునే జాతర ఏది  ? ఎ) గొల్లగట్టు జాతర బి) ఏడుపాయల జాతర సి) నాగోబా జాతర డి) తేగడ జాతర 2)సమక్క సారక్క జాతరలో ప్రదర్శించే నృత్యం ఏది ? ఎ) కుర్రు నృత్యం బి) గుస్సాడి నృత్యం సి) థింసా నృత్యం డి) కోయ నృత్యం 3) బతుకమ్మ ఉత్సవాల మొదటి రోజును ఏమని వ్యవహరిస్తారు ? ఎ) సద్దుల బతుకమ్మ బి) ఎంగిలి పూల బతుకమ్మ సి) బతుకమ్మ తొలి ఉత్సవం డి) అటుకుల బతుకమ్మ 4) కుతుబ్ షాహీల కాలం నుండి జరుపుకునే జాతర ఏది ? ఎ) కురుమూర్తి జాతర బి) పెద్దమ్మ జాతర సి) కొండగట్టు జాతర డి) బెజ్జంకి జాతర 5) సమక్క సారక్క జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ? ఎ) మెదక్ బి) ఖమ్మం సి) జయశంకర్ భూపాలపల్లి డి) ఆదిలాబాద్ 6) కాకతీయుల కాలంలో గొప్ప ఆదరణ కలిగిన నృత్యం ఏది ? ఎ) పేరిణి నృత్యం బి) గుస్సాడి నృత్యం సి) గరగ నృత్యం డి) సిద్ధీ నృత్యం 7) ఆదిలాబాద్ లోని రాజగోండులు దీపావళినాడు ఏ నృత్యాన్...