స్వయం ఉపాధి

          ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు కొందరైతే… స్వయం ఉపాధితో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారు మరికొందరు. అందుకే ఉద్యోగాలే కాదు సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనుకునే వారికి కూడా గైడెన్స్ ఇస్తుంది www.telanganaexams.com వెబ్ సైట్ cum యాప్.

          ఇందులోనే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల సమాచారాన్ని కూడా అందిస్తాం. అలాగే రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రుణ సదుపాయం కల్పిస్తున్న సంస్థల సమాచారం ఇస్తాం. SC/ST/OBC లతో పాటు OC లకు కూడా స్వయం ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న రుణ సౌకర్యాల సమాచారం ఉంటుంది.

           బిజినెస్ లో ఆయా రంగాల్లో విజేతలుగా నిలిచి, ఇప్పటికే స్థిరపడిన ప్రముఖుల సలహాలు, సూచనలు ఇంటర్వ్యూలను text informationతో పాటు వీడియోలను కూడా అందిస్తాం. అలాగే ప్రైవేటు రంగంలో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు సాయం చేయడానికి వివిధ కంపెనీలు అందిస్తున్న ఆర్థిక సాయం (ఫండింగ్ ఏజెన్సీలు) వివరాలు మీకు తెలియజేస్తాం. మీ ఆలోచనలను మాతో పంచుకుంటే… ఆయా రంగాల్లో నిష్ణాతుల దృష్టికి తెచ్చి… ఎలా ముందుకెళ్లాలో మేం గైడెన్స్ అందిస్తాం.

           ఈమధ్య కాలంలో START UPSకి కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. దాంతో యువకుల్లో చాలామంది చదువుకుంటూనే స్టార్టప్స్ కంపెనీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందువల్ల వీటి సమాచారాన్ని కూడా ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నాం. ఇప్పటికే STARTUPS స్థాపించి, విజయాన్ని అందున్న వారి సక్సెస్ స్టోరీలను TEXT + వీడియోల రూపంలో అందిస్తాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం SKILL DEVELOPMENT పేరిట యువతలో నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. వీటి సమాచారం కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. అధికారుల నుంచి గైడెన్స్ కూడా ఇస్తాం. మొత్తమ్మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడే సామర్థ్యాన్ని, స్థైర్యాన్ని మీకు అందించడమే మా వెబ్ సైట్ లక్ష్యం.

       ఇప్పటివరకూ ఇలా విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించి.. అంతా ఒకే చోట యువతకు సమాచారాన్ని అందించే వెబ్ సైట్ ఏదీ తెలుగులో లేదు. టెన్త్ క్లాస్ నుంచి ఉద్యోగం లేదా ఉపాధితో స్థిరపడే వరకూ మీ వెన్నంటి ఉండాలన్న లక్ష్యంతోనే www.telanganaexams.com వెబ్ సైట్ cum యాప్ ను రూపొందించాం.

Enter to Learn… Leave to Achieve