Tuesday, November 13
Log In

Latest Trends

దీపావళి టపాసులు 2 గంటలే !

దీపావళి టపాసులు 2 గంటలే !

Latest Trends
దీపావళి పటాకుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర కాలుష్య మండలి నిర్దేశించిన పొగ, శబ్ద పరిమితులను కూడా పాటించాల్సిందే అంటున్నారు అధికారు. అటు పోలీసులు కూడా ఈ విషయంలో అలెర్ట్ అవుతున్నారు. దీపావళి రోజును నిర్ణీత టైమ్ కంటే మించి పటాకులు కాలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అగ్నిమాపకశాఖ అధికారులు కూడా క్రాకర్స్ షాపుల యజమానులకు కూడా సూచనలు చేశారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు తలెత్తినా వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రిపేర్ చేసుకున్నారు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు. సో... సుప్రీంకోర్టు రూల్స్ బ్రేక్ చేసి అనవసర చిక్కుల్లో పడకుండా ... పటాకుల మోతను రెండు గంటలు అంటే... రాత్రి 8 నుంచి 10 గంటలకే పరిమితం చేయడం బెటర్.
రేపట్నుంచి రోజుకి రూ.20 వేలే

రేపట్నుంచి రోజుకి రూ.20 వేలే

Latest Trends
రోజువారీ నగదు విత్ డ్రాపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI) పరిమితిని మళ్ళీ తగ్గించింది. ఈనెల 31 నుంచి రూ.20వేలకు మించి ATM ల నుంచి విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉండదు. మ్యాస్ట్రో, క్లాసిక్ కార్డు వినియోగదారులకు ఇప్పటిదాకా రూ.40వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఈ కార్డు వినియోగదారులు ఇకపై రోజుకి రూ.20వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మిగతా SBI కార్డుల వారికి 40వేల పరిమితి కొనసాగుతుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. డిజిటల్ లావాదేవీలు పెంచడం, మోసాలపై నిఘా పెట్టడానికి ఈ పరిమితి విధించామని చెబుతున్నారు. రోజువారి పరిమితి పెంచుకోవాలని ఎవరైనా భావిస్తే... హయ్యర్ వేరియంట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని SBI వర్గాలు సలహా ఇచ్చాయి. రూ.20వేల పరిమితి కొన్ని లక్షల మంది SBI కార్డుదారులపై ప్రభావం చూపించనుంది.
మహా ఉద్యోగ్ మేళా నిలిపివేత, శని, ఆదివారాలు రావొద్దని పోలీసుల సూచన

మహా ఉద్యోగ్ మేళా నిలిపివేత, శని, ఆదివారాలు రావొద్దని పోలీసుల సూచన

Latest News, Latest Trends
ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన జాబ్ మేళాలో గందరగోళం తలెత్తింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మహా ఉద్యోగ్ మేళా జరుగుతుందని నిర్వాహకులు ప్రచారం చేశారు.  టీవీలు, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు.  360కి పైగా MNC కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్టు నిర్వాహకులు చెప్పారు. 35 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. భారీ స్థాయిలో ఉద్యోగాలు ప్రకటించడంతో... దాంతో వేలమంది నిరుద్యోగులు ఆశతో ఉదయం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు. ఒక్కసారిగా వేలమంది నిరుద్యోగులు తరలిరావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఉదయం తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇంటర్వ్యూలు మొదలు పెట్టిన తర్వాత నిర్వాహకుల అసలు మోసం బయటపడిందన్నారు నిరుద్యోగులు.  120క
ఆ సీట్లో కూర్చుంటే జరిమానా!

ఆ సీట్లో కూర్చుంటే జరిమానా!

Latest Trends
మీరు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా... అయితే జాగ్రత్త. మెట్రోలో మహిళల కోసం కేటాయించిన సీట్లలో కూర్చున్న మగవాళ్ళకు భారీ జరిమానా తప్పదు. రూ.500 ఫైన్ వసూలు చేయడానికి మెట్రో అధికారులు ప్రత్యేక టీమ్ ఎప్పుడైనా దాడి చేయొచ్చు. మెట్రో రైల్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన సీట్లల్లో ఇతరులు ఎవరూ కూర్చోడానికి వీల్లేదంటున్నారు మెట్రో MD ఎన్వీఎస్ రెడ్డి. ప్రతి మెట్రో బోగీలో L & T సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసుల నిఘా కూడా పెడుతున్నారు. మహిళలు తమకు కలుగుతున్న అసౌకర్యాన్ని వివరించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ కూడా కేటాయించబోతున్నారు. సో... మెట్రో లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీ సంస్థకి ఉద్యోగి కావాలా ?

మీ సంస్థకి ఉద్యోగి కావాలా ?

Job Mela, Latest News, Latest Trends
సరైన ఉద్యోగి కోసం వెతుకుతున్నారా ? అయితే మాతో జతకట్టండి !! మా www.telanganaexams.com యాప్ ను ఇప్పటి దాకా లక్ష మందికి పైగా download చేసుకున్నారు. ప్రతి రోజూ 20 వేలమందికి పైగా సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళంతా Youngesters... ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులే. వీళ్ళల్లో మీకు talented persons చాలా మంది ఉంటారు. మీకు అవసరమయ్యే ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు www.telanganaexams.com www.tsexams.com www.andhraexams.com వెబ్ సైట్స్ ద్వారా మీ ప్రకటనలను ఉచితంగా మేం ప్రచురిస్తాం. మా youngstersతో మిమ్మల్ని కలిపేందుకు సాయం చేస్తాం. 10 వ తరగతి లేదా అంతకంటే తక్కువ అర్హత నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్.... ఇలా ఏ విద్యార్హత కలిగిన ఉద్యోగానికి అయినా మీకు కావాల్సిన అభ్యర్థిని వెతికి ఇస్తాం. అందుకోసం మీ సంస్థ/కంపెనీలో అవసరమైన ఉద్యోగులు, వారి అర్హతలు
నాజూగ్గా ఉండాలా ? ఈ చిట్కా పాటించండి !

నాజూగ్గా ఉండాలా ? ఈ చిట్కా పాటించండి !

Latest Trends
ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం ఒత్తిడికి గురవకుండా ఈ జాగింగ్ తో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. జాగింగ్ చేయడం చాలా ఈజీ.. సింపుల్ కూడా... జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా జాగింగ్ చేసే వారిలో దీర్ఘాయుష్యు కూడా పెరుగుతుంది. శరీరకంగా ఫిట్ గా ఉండటంతో పాటు.. క్యాలరీలు కరిగించుకొని బాడీ ఫ్రెష్ గా కనబడాలంటే జాగింగ్ అవసరం. జాగింగ్ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. 1. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెగ్యులర్ జాగింగ్ అనేది గ్రేట్ కార్డియో వర్కౌట్. ఇది హార్ట్ మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. జాగింగ్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జాగింగ్ వ
మీ మొబైల్ నెంబర్ ఎక్కడికీ పోదు !

మీ మొబైల్ నెంబర్ ఎక్కడికీ పోదు !

Latest Trends
ఆధార్ తో మొబైల్ KYC లింక్ తొలగించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. దాంతో మొబైల్ నెంబర్ నిలిపివేస్తారంటూ ఇటీవల వాట్సాప్, ఫేస్ బుక్స్ లో మెస్సేజ్ లు హల్చల్ చేస్తున్నాయి. కానీ వీటిల్లో నిజం లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ ధృవీకరణ ఆధారంగా దేశంలో 50 కోట్లమంది మొబైల్ కనెక్షన్ పొందారు. ఈ పరిస్థితుల్లో ఒకేసారి 50 కోట్ల మంది నెంబర్లు నిలిపివేస్తే దేశంలో దాదాపు ఎవరి దగ్గరా ఫోన్ నెంబర్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వదంతులు నమ్మొద్దని కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ, UIDAI తెలిపాయి. ఇప్పటికే ఆధార్ తో సిమ్ తీసుకున్న వారు మరో గుర్తింపు కార్డుని టెలికాం ఆపరేటర్లకి సమర్పించే అవకాశాన్ని వినియోగదారులకు ఇస్తారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కొత్తగా సిమ్ కార్డు తీసుకునే వినియోగదారుల నుంచి ఆధార్ ను KYC గా తీసుకోడాన్ని నిలిపివేయాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే త
జియో దీపావళి ఆఫర్: 100శాతం క్యాష్ బ్యాక్

జియో దీపావళి ఆఫర్: 100శాతం క్యాష్ బ్యాక్

Latest Trends
దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో మరో బంపరాఫర్ ప్రకటించింది. కొత్తగా రీఛార్జ్ టాప్ అప్ చేయించుకుంటే 100శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.1699తో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు ప్లాన్ అమల్లో ఉంటుంది. దీంతో ప్రతి రోజూ 1.5GB డేటా, 100SMSలు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ని ఏడాది పాటు పొందవచ్చు. ఇక మై జియో యాప్ నుంచి రూ.149 లేదా ఆపైన ఎక్కువ ప్లాన్ష్ తో రీఛార్జ్ చేసుకుంటే వంద శాతం క్యాష్ బ్యాక్ ను కూపన్ల రూపంలో అందించనుంది. ఈ కూపన్లను Reliance Digital, Digital Express, Digital Express Mini stores లో రీడీమ్ చేసుకునే అవకాశముంది. అయితే ఐదు వేల రూపాయలకు పైగా కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 31లోపు కూపన్లను రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫర్ మాత్రం నవంబర్ 30 వరకే అందుబాటులో ఉంది.