Monday, July 16
Log In

Latest Updates

ఇంటర్ లో ఎక్కువ మార్కులనే లెక్కలోకి..

ఇంటర్ లో ఎక్కువ మార్కులనే లెక్కలోకి..

Latest Updates
ఇంటర్మీడియట్ ఇంప్రూవ్ మెంట్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే వాటినే లెక్కలోకి తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టత ఇచ్చింది.  ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాసినప్పటికీ... మార్చి 2018 పరీక్షల్లో వచ్చిన మార్కులు, మే 2018 పరీక్షల్లో వచ్చిన మార్కులను పోలుస్తారు. వీటిల్లో ఏ మార్కులు ఎక్కువ ఉంటే వాటినే పరిగణిస్తామని తెలిపింది.  ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాసైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశం కల్పించినప్పటికీ... తాజాగా వచ్చే మార్కులనే లెక్కలోకి తీసుకుంటారు
మే 14 నుంచి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ

మే 14 నుంచి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ

Latest Updates
ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 14 నుంచి 22 వరకూ జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల దాకా సెకండియర్ వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.  24వ తేదీ నుంచి 28 వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఫీజు ఆఖరు తేది: ఏప్రిల్ 20 వరకూ ఫీజుల వివరాలకు :http://www.tsbie.cgg.gov.in