
నిరుద్యోగ భృతి రూ.3016/- :: బడ్జెట్ కేటాయింపులు రూ.1810 కోట్లు
రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని నెలకు రూ.3016లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అందుకనుగుణంగా 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.1810 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు బడ్జెట్ మీటింగ్ లో సీఎం వెల్లడించారు. దాంతో అధికారులు విధి విధానాలను తయారు చేసే పనిలో ఉన్నారు.
1) నిరుద్యోగ భృతి అమలు చేయాలంటే ఎవర్ని నిరుద్యోగులుగా గుర్తించాలి ?
2) ఎంత వరకు చదివిన వాళ్ళని గుర్తించాలి ?
3) ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలి ?
ఈ అంశాలను పరిశీలించి అధికారులు నిబంధనలను తయారు చేయబోతున్నారు. వీటిని లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వొచ్చు అన్న దానిపైనా నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా... వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిని ఎలా అమలు చేస్తున్నారన్న దానిపైనా స్టడీ చేయాలని నిర్ణయిం