Friday, May 24

Latest News

ఐసెట్ 2019 షెడ్యూల్ రిలీజ్

ఐసెట్ 2019 షెడ్యూల్ రిలీజ్

Latest News, Latest Updates
కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే... TS ఐసెట్ 2019 షెడ్యూల్ ను విడుదల చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి,ఐసెట్ చైర్మన్, విసి ప్రో. సాయన్న. 2019లో MBA, MCA ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. ఈనెల 21న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది మే 23, 24 తేదీల్లో ICET నిర్వహిస్తారు మార్చి 7 నుంచి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ ఫీజులు: SC/ST లకు రూ.450 ఇతరులు రూ.650 500 రూపాయల అపరాధ రుసుము మే 6నుంచి 10 వరకు 2000 రూపాయలతో మే11 నుంచి 14 వరకు 5000 రూపాయలతో మే15 నుంచి 17వరకు 10,000 అపరాధ రుసుము మే 18 చివరి తేదీ వరకు .. 19మే నుంచి హాల్ టిక్కెట్స్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు ప్రిలిమినరీ కీని మే 29న విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణకు జూన్ 1 వ తేదీ వరకూ టైమ్ ఇస్తారు 3 జూన్ 2019న పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయి మన రాష్ట్రంలో 10 సెంటర్లలో, ఏప
మార్చికల్లా పోలీస్ నియామకాలు : వచ్చే నెలలోనే మెయిన్స్ ఎగ్జామ్ ?

మార్చికల్లా పోలీస్ నియామకాలు : వచ్చే నెలలోనే మెయిన్స్ ఎగ్జామ్ ?

Latest News, Latest Notifications
రాష్ట్రంలో పోలీస్ నియామకాల ప్రక్రియను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే లోపే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలోపే ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేసి ఆ తర్వాత నెలాఖరులోగా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం అవసరమైతే అదనపు సిబ్బందిని ఉపయోగించుకోవాలని ప్లాన్ లో ఉంది బోర్డు. రాష్ట్రంలో మొత్తం 18 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి 2018 మే నెలలో రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమిక పరీక్షలో 3.77 లక్షల మంది అర్హత సాధించారు. ఎస్సై ఎగ్జామ్ లో 6 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారంటూ కోర్టులో కేసు నడిచింది. నియామకాలపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే ఇవ్వడంతో డిసెంబర్ 17 నుంచి మొదలు కావాల్సిన ఫిట్నెస్ టెస్టుల ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వ
తెలంగాణ స్పెషల్ లింక్స్

తెలంగాణ స్పెషల్ లింక్స్

dailytest, Latest News
ఫ్రెండ్స్ www.telanganaexams.com లో తెలంగాణ స్పెషల్ బిట్స్ కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి. ( మీ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఫేస్ బుక్ ద్వారా అందరికీ చేరేలా ఫార్వార్డ్ చేయండి ) 1) తెలంగాణ ప్రాజెక్టులు https://telanganaexams.com/ts-projects/ 2) తెలంగాణ పదకోశం https://telanganaexams.com/telangana-padakosham/ 3) తెలంగాణ పిండివంటలు https://telanganaexams.com/dpt-16-flour-cuisine/ 4) తెలంగాణ మాండలికాలు https://telanganaexams.com/tsspl-mandalikalu/ 5) కాకతీయులు https://telanganaexams.com/ts-spl-14-kakatiyulu-ans/ 6) ముల్కీ రూల్స్, ముల్కీ ఉద్యమం https://telanganaexams.com/ts-spl-13-mulkirules-ans/ 7) తెలంగాణ రచయితలు - గ్రంథాలు https://telanganaexams.com/tsspl-12-writers-ans/ 8) తెలంగాణ - ఉద్యమ పాటలు https://telanganaexams.com/tsspl-10-ts-songs/ 9) తెలంగాణ - దేవాలయాలు ht
కేంద్ర బడ్జెట్ 2019-20 (With Pics)

కేంద్ర బడ్జెట్ 2019-20 (With Pics)

Latest News
 ః         ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ కింద 5 ఏకరాల లోపు రైతులకు ఏటా రూ.6,000 చెల్లింపు. రూ2,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. మొత్తం 12 కోట్ల మంది చిన్న రైతులకు లబ్ది చేకూరుతుంది. బడ్జెట్ లో మొత్తం రూ.75,000 కోట్లను కేటాయింపు. ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్ళు..PF తో పాటు ఇతర పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడితే ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.2లక్షల వరకు హోం లోన్స్,  ఆరోగ్య బీమా, జాతీయ పింఛను పథకానికి చెల్లించే వారికి మినహాయింపు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంపు పోస్టాఫీస్‌ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్‌ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంపు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధిని రూ.62,574 కోట్ల నుం
గ్రూప్ 2పై హైకోర్టులో వాదనలు : ఈనెల 5కి వాయిదా

గ్రూప్ 2పై హైకోర్టులో వాదనలు : ఈనెల 5కి వాయిదా

Latest News, Latest Notifications
TSPSC గ్రూప్ - 2 ఎగ్జామ్స్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. రాత పరీక్షలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడం వల్లే తప్పులు చేశారని అభ్యర్థులు హైకోర్టుకి విన్నవించారు. డబుల్ బబ్లింగ్ చేసిన వారిని అనుమతించరాదంటూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. గ్రూప్ - 2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్, వైట్ నర్ ఉపయోగించిన అభ్యర్థులను ఎంపిక జాబితా నుంచి తొలగించాలని 2018 అక్టోబర్ 12న సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు చెప్పారు. అభ్యర్థుల తరపున నలుగురు సీనియర్ న్యాయవాదులు తమ వాదన వినిపించారు. పార్ట్ - ఎలో వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమే అభ్యర్థులు పొరపాట్లు చేశారని అన్నారు. అలాగే పార్ట్ -బిలో ఆన్సర్లు దిద్దినా వైట్ నర్ ఉపయోగించిన జవాబు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. ఇన్విజిలేటర్లకు TSPSC సరైన అవగాహన కల్పించలేకపోవడంతోనే ఈ తప్పులు దొర్లాయని అ
ఫిబ్రవరి 11 నుంచి పోలీస్ ఈవెంట్స్

ఫిబ్రవరి 11 నుంచి పోలీస్ ఈవెంట్స్

Latest News, Latest Notifications
పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి. ఫిబ్రవరి 11 నుంచి PMT/PET నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. టెస్టులు నిర్వహించేందుకు గతంలో ప్రకటించిన వేదికల్లో రెండింటిని రద్దు చేశారు. హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంతో పాటు KU గ్రౌండ్స్, వరంగల్ లో ఈసారి ఈవెంట్స్ నిర్వహించడం లేదు. మారిన షెడ్యూల్ తో రివైజ్డ్ అడ్మిట్ కార్డులు, ఇంటిమేషన్ లెటర్లను తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలని TSLPRB అధికారులు అభ్యర్థులకు సూచించారు. హైదరాబాద్ లో పోలీస్ ఈవెంట్స్ ను మూడు మైదానాల్లో నిర్వహిస్తారు. ఇక పాత జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున గ్రౌండ్స్ ని ఎంపిక చేశారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ల్లో వీటిని నిర్వహిస్తారు. శారీరక దారుఢ్య పరీక్షలు 35 నుంచి 40 రోజుల్లోపు అంటే... మార్
త్వరలోనే గ్రూప్.1, 3 నోటిఫికేషన్లు

త్వరలోనే గ్రూప్.1, 3 నోటిఫికేషన్లు

Latest News, Latest Updates
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్.1, గ్రూప్.3 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. మారిన జోనల్ సిస్టమ్ తో పాటు, విధి విధానాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లెటర్ రాశామని తెలిపారు. అలాగే గ్రూప్3 కి సంభందించి కూడా స్టేట్ లెవల్, HOD లెవల్ పోస్టుల వివరణతో పాటు రోస్టర్ వివరాలు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. మొత్తం 1800 పోస్టులకు వివరణ రావాల్సి ఉందన్నారు. ఆ వివరాలు రాగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి వివరించారు. జనవరి 26 వరకు ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు ఏవీ తమ దగ్గర పెండింగ్ లేవన్నారు. (ఫిబ్రవరి 1st నుంచి గ్రూప్.1 మరియు గ్రూప్.3 కి సంభందించిన guidance మేము ఇస్తాం)
అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

Latest News, Latest Trends
అగ్రవర్ణాలు (ఓసీలు) ల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ 10శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో రిజర్వేషన్ల కోటా 50 నుంచి 60శాతానికి చేరే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం కోసమే శీతాకాల సమావేశాలను మరో 2 రోజుల పాటు పొడిగ
తెలంగాణలో సెట్స్ డేట్స్ ఖరారు

తెలంగాణలో సెట్స్ డేట్స్ ఖరారు

Latest News, Latest Updates
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలతో పాటు మిగతా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ షెడ్యూల్ వివరాలు: ఎంసెట్ (ఇంజనీరింగ్ ): 2019 మే 3,4,6 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్ ) : 2019 మే 8, 9 తేదీల్లో మార్నింగ్ సెషన్  : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మధ్యాహ్నం సెషన్: మ. 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మిగతా సెట్స్ వివరాలు మే 11 నాడు - ఈసెట్ మే 20 నాడు -పీఈసెట్ 23, 24 ల్లో - ఐసెట్ 26 నాడు - లాసెట్, పీజీ లాసెట్ 27 నుంచి 29 వవరకూ: పీజీ ఈసెట్ మే 30, 31ల్లో - ఎడ్ సెట్ పరీక్షలు జరుగుతాయి.