Saturday, March 23

Latest News

REVISED SCHEDULE FOR MOCK TESTS

REVISED SCHEDULE FOR MOCK TESTS

Latest News, Viewers
పటి నుంచి జరిగే మాక్ టెస్టుల కోసం షెడ్యూల్ ను రివైజ్డ్ చేయడమైనది.  ఇంకా 53 రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 16 వరకూ జరుగుతాయి.  ఈ వారం నుంచి అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులు మొదలవుతాయి.  రివైజ్డ్ షెడ్యూల్ కోసం ఈ కింది క్లిక్ చేసి డౌన్లోడ్చే చేసుకోండి. అలాగే అవసరమైతే అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులను మరికొన్ని యాడ్ చేస్తాం.  అదనపు టెస్టుల వివరాలు NEXT WEEK లో చెబుతాను.  (గత రెండు వారాల్లో మిస్ అయిన టెస్టులను ఈ వారంలో కవర్ చేస్తున్నాం ) REVISED 53 DAYS PLAN pdf ఇంకా మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించవారు వెంటనే జాయిన్ అవ్వగలరు.  రోజువారీ షెడ్యూల్ ప్రకారం మాక్ ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. స్టేట్ మెంట్స్, జతపరచడం, కాలక్రమం కి సంబంధించి ప్రశ్నలు ఉంటున్నాయి. దాంతో ఒక్క ప్రశ్న చదివితే నాలుగు ప్రశ్నలు చదివిన ప్రయోజనం ఉంటుంది. మాక్ టెస్టుల వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి https
ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

Latest News, Latest Trends
30శాతం తగ్గింపు ! బిగ్ డే సేల్ !! దినపత్రికల్లో, టీవీల్లో ఇలాంటి ప్రకటనలు ఇకముందు ఉండకపోవచ్చు. ఆఫ్ లైన్ కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చే రోజులు పోతున్నాయి. కొత్త ఇ-కామర్స్ పాలసీ 2019 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది. దాంతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న మొన్నటిదాకా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పోటా పోటీగా డిస్కౌంట్స్ ప్రకటించాయి. దాంతో చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్‌ లోనే తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. అంతేకాదు కొన్ని సంస్థలైతే బయటి మార్కెట్ కి తమ వస్తువులను రిలీజ్ చేయకుండా కేవలం ఆన్‌లైన్‌ లో ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమ్ముకొని భారీగా లాభపడ్డాయి. ఇటు వినియోగదారులకు కూడా డిస్కౌంట్స్ బాగానే అందాయి. అయితే కొత్త ఈ-కామర్స్ పాలసీతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిజినెస్ భారీగా తగ్గే అవకాశముంది. అదే టైమ్ లో స్థానిక వ్యాపారులకు వ్యాపారం పెరి
పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో తప్పులు దొర్లడంపై హైకోర్టు సీరియస్ అయింది. స్పోర్ట్స్, వికలాంగుల కోటాని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్, వికలాంగుల వాటా సరిచేసిన తర్వాత మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ సెక్రటరీ రిక్రూట్ మెంట్ పై ఉన్న స్టేని ఎత్తివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులతో పాటు 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో ఇవ్వడంపైనా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తప్పులు జరిగినప్పుడు ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేయాలని చూస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
పంచాయతీ కార్యదర్శుల ఫలితాలపై అధికారుల వివరణ

పంచాయతీ కార్యదర్శుల ఫలితాలపై అధికారుల వివరణ

Latest News, Latest Trends
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు, ఫలితాలపై వస్తున్న ఆరోపణలకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు 50 శాతం దాటలేదని వివరించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామని చెప్పారు. ప్రాథమిక కీ విడుదల చేసి... అభ్యంతరాలు తీసుకున్నామనీ... ఆ తర్వాత సబ్జెక్ట్ నిపుణులతో ఫైనల్ కీ తయారు చేయించామని చెప్పారు.  ఆ ఫైనల్ కీ ప్రకారమే పేపర్ కరెక్షన్ చేశామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సెలెక్ట్ లిస్ట్ ప్రకటించామనీ... మార్క్ లిస్టులు, మెరిట్ లిస్టులు కూడా జిల్లాల వారీగా విడుదల చేశామన్నారు పంచాయతీ అధికారులు. అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ఇచ్చామన్నారు. అభ్యర్థులు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారో, ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానం ఇచ్చారో వారి ర్యాంక్ కార్డుల్లో పొందుపరిచామని తెలిపారు. గురువారం నుంచి అభ్యర్థులకు Omr sheets కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. జూనియర్ పంచ
ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

Latest News, Latest Trends, Viewers
మేం FBO ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర నుంచి దాదాపు ఏడాదిన్నరగా తెలంగాణలో విజయవంతంగా మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వేల మంది మా ఎగ్జామ్స్ రాశారు. FRO/FSO దగ్గర నుంచి మొన్నటి జూనియర్ పంచాయతీ కార్యదర్శి దాకా చాలామంది ఉద్యోగాలు పొందారు. నిన్న కూడా చాలామంది మెస్సేజెస్ పెట్టారు. అయితే ఇంకా కొందరికి మా ONLINE టెస్టుల మీద అవగాహన రావడం లేదు. ప్రస్తుతం TSPSC, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర సంస్థలు ఆఫ్ లైన్ లో ( ఎగ్జామినేషన్ కేంద్రాల్లో ) పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఆన్ లైన్ లో టెస్టులు రాస్తే ఉపయోగం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మా టెస్టులు రాసిన వారికి దీనిపై అవగాహన ఉంది. అయినప్పటికీ ఇంకా ఐడియా రానివాళ్ళకి దీనిపై క్లారిటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ టెస్టులతో మీరు మీ నైపుణ్యానికి ఇంకా ఎలా పదును పెట్టొచ్చో కూడా వివరిస్తాను. దాంతో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ONLIN
తప్పుల తడకగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి రిజల్ట్స్

తప్పుల తడకగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి రిజల్ట్స్

Latest News, Videos
జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఫలితాల వెల్లడి తప్పుల తడకగా కొనసాగింది. రాష్ట్రం మొత్తమ్మీద 9355 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఆయా కలెక్టర్లు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. కొన్ని చోట్ల దినపత్రికల్లో కూడా వీటిని అచ్చు వేశారు. అయితే జిల్లా కలెక్టర్లు ప్రకటించిన నెంబర్లలో కొన్ని రిపీట్ అయ్యాయి. అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీల మధ్య కూడా కొన్ని నెంబర్లు తేడాలు ఉన్నట్టు స్వయంగా జిల్లా కలెర్టర్లే చెప్పారని అభ్యర్థులు చెబుతున్నారు. ఈనెల 25 లోగా రిక్రూట్ మెంట్ చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దాంతో హడావిడిగా లిస్టులు ప్రకటించి తప్పుల తడకగా మార్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.  ఈ తప్పులను చూపిస్తున్న ఫోటోలు  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్స్ లో నిరు
గ్రూప్-3 లో ఏమేమి పోస్టులు ఉంటాయి ? ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు

గ్రూప్-3 లో ఏమేమి పోస్టులు ఉంటాయి ? ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు

Latest News, Syllabus
రాష్ట్రంలో గ్రూప్ - 3 కేటగిరీలో 800 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెల్లడి కానుంది. జోనల్స్ పై తుది నిర్ణయం వచ్చాక... ఈ నోటిఫికేషన్ విడుదలకు TSPSC సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల అధిపతుల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. గ్రూప్ - 3 నోటిఫికేషన్ అనగానే చాలామంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఈ నోటిఫికేషన్ లో ఏమేమి పోస్టులు ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్స్ ఎలా ఉంటుంది... గ్రూప్ 3 సిలబస్ విధానం ఏంటి అన్న విషయాలు చాలామంది తెలియదు.  ఆ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నాం. గ్రూప్ 3 లో పోస్టులు 1) సీనియర్ అకౌంటెంట్స్ 2) ఆడిటర్స్ ( పే అండ్ అకౌంట్స్) 3) సీనియర్ అకౌంటెంట్ ( ట్రెజరీ) 4) సీనియర్ ఆడిటర్ (లోకల్ ఫండ్స్, ఆడిట్ సర్వీసెస్) 5) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్ సబ్ సర్వీస్ ) 6) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సె
గ్రూప్ – 1, గ్రూప్ 3 ప్రకటనలకు సిద్ధం !

గ్రూప్ – 1, గ్రూప్ 3 ప్రకటనలకు సిద్ధం !

Latest News, Latest Notifications
రెండోసారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా గ్రూప్ -1 ఉద్యోగ ప్రకటన అతి త్వరలోనే వెల్లడి కానుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 150 పోస్టులతో నోటిఫికేషన్ వేసేందుకు tspsc రంగం సిద్దం చేసింది. ప్రభుత్వం నుంచి కొన్ని సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. వాటిని ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన విడుదల చేయాలని tspsc అధికారులు భావిస్తున్నారు. గతంలోనే tspsc గ్రూప్ - 1 నోటిఫికేషన్ వెల్లడించాలని అనుకుంది. అయితే అప్పట్లో కొత్త జోన్స్ ప్రకటించడంతో తాత్కాలికంగా నోటిఫికేషన్ విడుదలను పక్కనబెట్టారు. గ్రూప్ 1 పోస్టులను కొత్త జోన్ల వారీగా విభజించే ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. దాంతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. గ్రూప్ -1 నోటిఫికేషన్ లో ఏ పోస్టులు ఉన్నాయి ? DSP - 42 డిప్యూటీ కలెక్టర్లు - 15 ఇవి కాకుండ
RRB ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ వచ్చిందా ? రిఫండ్ రావాలంటే ఏం చేయాలి ?

RRB ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ వచ్చిందా ? రిఫండ్ రావాలంటే ఏం చేయాలి ?

Latest News, Latest Trends
అసిస్టెంట్ లోకో పైలట్/టెక్నీషియన్ పోస్టుల కోసం RRB నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి హాజరైన వారికి ఫీజు తిరిగి చెల్లిస్తున్నారు. మీకు ఫీజు రిఫండ్ కావాలంటే ఏం చేయాలి ఓసారి ఈ ఆర్టికల్ చదవండి. RRB ALP/ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ 2018 కు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు హాజరైన అభ్యర్థుల ఫీజులను RRB రిఫండ్ చేస్తోంది. ఇందులో రిజర్వుడ్ అభ్యర్థులకు మొత్తం ఫీజును రిటర్న్ చేస్తోంది. అలాగే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించిన ఫీజును 50శాతం మినహాయించుకొని మిగతావి చెల్లిస్తోంది. అయితే మొదటి దశకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి హాజరైన వారికి మాత్రమే ఈ ఫీజును తిరిగి చెల్లిస్తారు. CBT ఎగ్జామ్ కి హాజరు కానివారికి ఎలాంటి ఫీజ్ రిఫండ్ ఉండదు. ఇప్పటిదాకా ఫీజు రిఫండ్ కాని వారికి SMS ద్వారా ఈనెల 17న అభ్యర్థులకు సమాచారం ఇవ్వనుంది. అభ్యర్థులు RRB నోటిఫికేషన్ ప్రకారం అప్లయ్ చేసినప్పుడు చాలామంది త
ప్రధాని మోడీ ఫారెన్ టూర్స్ ఖర్చెంతో తెలుసా ?

ప్రధాని మోడీ ఫారెన్ టూర్స్ ఖర్చెంతో తెలుసా ?

Latest News, Latest Trends
ప్రధాని నరేంద్రమోడీ నాలుగున్నరేళ్ళ కాలంలో విదేశీ టూర్లకి, ప్రభుత్వ పథకాల ప్రచారానికి పెట్టిన ఖర్చులు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. ఈ రెండు కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 920 మిలియన్ డాలర్లు... అంటే దాదాపు 7వేల కోట్ల రూపాయలు... ఇంకా వివరంగా చెప్పాలంటే రూ. 6,620,32,00,000.00 ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి 2018వరకూ మొత్తం 84 విదేశీ ట్రిప్పులకు వెళ్ళారు. అందుకోసం భారత ప్రభుత్వం రూ.2వేల15 కోట్లు ఖర్చుపెట్టింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వ విజయాలను దేశమంతా ప్రచారం చేయడానికి రూ.4వేల604 కోట్లు ఖర్చయ్యాయి. ఇక ప్రతి విదేశీ ప్రయాణానికి ఎయిర్ ఇండియా వన్ విమానం, అందులో సెక్యూర్ హాట్ లైన్ సెటప్ చేసేవారు. ఇవి ప్రతిపక్షాలు ఆరోపించినవి కావు. పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు వీకే సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పిన సమాధానాలు ఇవి.