Saturday, May 26
Log In

Latest News

109 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

109 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Latest News, Latest Notifications
మూడు శాఖల్లో ఖాళీగా ఉన్న 109 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో SC డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ లో ( 30 పోస్టులు ) 1) జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ - 17 2) జూనియర్ అసిస్టెంట్ -కమ్-టైపిస్ట్(ASWOs Offices) - 11 3) జూనియర్ అసిస్టెంట్ -కమ్-టైపిస్ట్ (ఆనంద నిలయాలు ) - 02 Click here for GO: SC DEPARTMENT POSTS హోంశాఖలో (73 పోస్టులు) 1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ - 41 2) జూనియర్ అసిస్టెంట్స్ - 32 Click here for GO: HOME DEPARTMENT పరిశ్రమలు, వాణిజ్యశాఖలో ( 06 పోస్టులు) 1) సీనియర్ స్టెనో గ్రాఫర్ - 01 2) జూనియర్ అసిస్టెంట్ - 05 Click here for GO: INDUSTRIES & COMMERCE ఈ 109 పోస్టులను tspsc ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.    
JEE (MAINS) రిజల్ట్స్ వెల్లడి

JEE (MAINS) రిజల్ట్స్ వెల్లడి

Latest News, Latest Updates
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( JEE - MAINS-2018) ఫలితాలు వెలువడ్డాయి. ర్యాంకులను కూడా CBSE ప్రకటించింది. ఇందులో క్వాలిఫై అయిన వారికి అడ్వాన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఈ నెల 8న రాత పరీక్ష, 15,16 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా 11 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే... ఇందులో తెలుగు రాష్ట్రాలకుచెందిన 1.50లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మెయిన్స్ కి కటాఫ్ ను నిర్ణయించి 2.24 లక్షల మందిని అడ్వాన్సుడ్ కి ఎంపిక చేస్తారు. మే 20 న JEE అడ్వాన్సుడ్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి OC కటాఫ్ - 74 మార్కులు OBCలకు - 45 SC లకు - 29 STలకు - 24 CLICK FOR RESULTS
FRO/FSOకి ఎంపికైనది వీళ్ళే !

FRO/FSOకి ఎంపికైనది వీళ్ళే !

Latest News, Latest Notifications
అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( నోటిఫికేషన్ నెం.46/2017) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (నోటిఫికేషన్ నెం. 47/2017) ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వీరికి ఫిజికల్ టెస్టులు, ఈవెంట్స్ ను మే 4 నుంచి నిర్వహించనున్నారు.  ఇందులో క్వాలిఫై అయిన వారిని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. ఫారెస్ట్ రేంజ్అధికారి పోస్టుకి ఎంపికైన వారి జాబితా Results_46_FRO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకి ఎంపికైన వారి జాబితా Results_47_FSO అభ్యర్థులకు విజ్ఞప్తి.  మన వెబ్ సైట్ లో మాక్ టెస్టులు రాసిన వారు ఎవరైనా ఉంటే... మాకు వాట్సాప్ లేదా  మెస్సేజ్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.   
సివిల్స్ 2017 ఫలితాలు వెల్లడి

సివిల్స్ 2017 ఫలితాలు వెల్లడి

Latest News
సివిల్ సర్వీసెస్ - 2017 మెయిన్స్ తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. దేశం మొత్తమ్మీద నెంబర్ వన్ ర్యాంక్ రాష్ట్రానికి చెందిన దురిశెట్టి అనుదీప్ కి దక్కింది. ఫలితాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారిక వెబ్ సైట్ http://www.upsc.gov.inలో చూడండి.  దేశం మొత్తం మీద 990 మంది పోస్టులకు ఎంపికయ్యారు. తెలుగు విద్యార్థుల ర్యాంకులు దురిశెట్టి అనుదీప్ (మెట్ పల్లి ) - మొదటి ర్యాంకు శీలం సాయితేజ - 43 నారపురెడ్డి శౌర్య - 100 మాధురి - 144 వివేక్ జాన్సన్ - 195 వై.అక్షయ్ కుమార్ - 624 భార్గవ శేఖర్- 816
ఆన్ లైన్ లోనే రైల్వే ఎగ్జామ్స్

ఆన్ లైన్ లోనే రైల్వే ఎగ్జామ్స్

Latest News, Latest Notifications
గ్రూప్ -సి, డి పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లోనే ఎగ్జామ్ నిర్వహించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. అన్ని జోన్లకి కలిపి దాదాపు 88 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందుకోసం 2.37 కోట్ల మంది అప్లయ్ చేసుకున్నారు. అంతమందికి ఆన్ లైన్ లో నిర్వహించడం కష్టమని మొదట రైల్వే వర్గాలు భావించాయి. అయితే తర్జన భర్జనల తర్వాత ఆన్ లైన్ కే మొగ్గు చూపాయి. ఆఫ్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించాలంటే ఏకంగా 7.5 కోట్ల పేపర్లు కావాలి. అంత పెద్ద సంఖ్యలో షీట్స్ తయారు చేయడానికి 10 లక్షల చెట్లు అవసరమవుతాయి. పైగా అన్ని భాషల్లో ప్రింట్ చేయాలంటే ఖర్చు కూడా బాగానే అవుతుంది. అందుకే ఆన్ లైన్ లోనే బెటర్ అని నిర్ణయానికి వచ్చాయి. అంతేకాకుండా ఆఫ్ లైన్ లో పెడితే క్వొశ్చన్ పేపర్స్ లీకేజీ సమస్య కూడా ఉంది. ఆన్ లైన్ లో ఆ ప్రాబ్లెమ్ ఉండదు. పాయింట్స్ మాన్, గేట్ మాన్, ట్రాక్ మాన్ తో పాటు టెక్నీషియన్, అసిస్టెంట్ లోకోపైలట్ లాంటి అన్ని పోస్టుల భ
D.El.Ed. ఫలితాలు వెల్లడి

D.El.Ed. ఫలితాలు వెల్లడి

Latest News
2018 ఫిబ్రవరిలో జరిగిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.,) రెండో సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను http://www.bse.telangana.gov.in లో ఉంచారు. అలాగే పాస్ సర్టిఫికెట్లను సంబంధిత ప్రిన్సిపాల్స్ పంపుతామని డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వివరించారు. డమ్మీ మార్కుల మోమోలను కూడా వెబ్ సైట్ లో ఉంచారు. అలాగే ఎవరైనా రీకౌంటింగ్ చేయించుకోవాలని అనుకుంటే ఎం.పద్మావతి, అడిషినల్ జాయింట్ సెక్రటరీకి మే 7 లోగా అప్లయ్ చేసుకోవాలని కోరారు. అందుకోసం ఒక్కో సబ్జెక్ట్ కి రూ.500లు చొప్పున చలానా ద్వారా చెల్లించాలి. పూర్తి వివరాలకు :http://www.bse.telangana.gov.in
ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు

Latest News
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి గడువు తేదీని ఇంటర్ బోర్డు పొడిగించింది. గతంలో ఏప్రిల్ 20లోపు ఫీజులు చెల్లించాల్సి ఉండగా... అది ఈనెల 25 వరకూ పెంచింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల విజ్ఞప్తి మేరకు గడువు తేదీని పెంచినట్టు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా ఈనెల 25 లోపు విద్యార్థుల ఫీజులను ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా గేట్ వే పేమెంట్  ద్వారా TSBIE CGG వెబ్ సైట్ లో చెల్లించాలి.
త్వరలో టెట్ నోటిఫికేషన్

త్వరలో టెట్ నోటిఫికేషన్

Latest News, Latest Updates
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న 2.5లక్షల మంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. 2017 జూలై 23న టెట్ నిర్వహించింది విద్యాశాఖ. ఏడాది తిరక్కముందే మరోసారి టెట్ నిర్వహించాలన్నది ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. సర్కార్ ఓకే చెబితే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే 2.5 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తుండగా, బీఈడీ, డీఈడీ ఫైనలియర్ చదువుతున్న మరో 25 వేల మంది అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామ్ కు హాజరవుతారని విద్యాశాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ కు ఏడాది

తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ కు ఏడాది

Latest News
తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చి ఇవాళ్టితో ఏడాది. ఇప్పటిదాకా 70 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. మొదటి నుంచి వెన్నంటి ప్రోత్సహించి, ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు.
పోస్టల్ ఉద్యోగాలకు అప్లయ్ చేశారా ?

పోస్టల్ ఉద్యోగాలకు అప్లయ్ చేశారా ?

Latest News, Latest Notifications
10వ తరగతి అర్హత మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు ఆన్ లైన్ దరఖాస్తుకు గడువు: ఏప్రిల్ 28 తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో 134 పోస్టల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 132 పోస్టుమెన్, 4 మెయిల్ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్ హెడ్డాఫీస్ పరిధిలో - 75 పోస్టులు హైదరాబాద్ రీజియన్ (జిల్లాల్లో) - 57 పోస్టులు అర్హత : 10 తరగతి లేదా మెట్రిక్యులేషన్ వయో పరిమితి : 18-27 ( ఏప్రిల్ 21, 2018 నాటికి ) సడలింపు : SC/ST లకు 5 యేళ్ళు, OBCలకు 3యేళ్ళ సడలింపు దరఖాస్తులకు ఆఖరు తేది: ఏప్రిల్ 21 ఫీజులు చెల్లించడానికి చివరి తేది: ఏప్రిల్ 25 ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 28 Job స్కేలు : రూ.21,700 పూర్తి వివరాలకు : http://ts.postalcareers.in/post_mail.html ఏవైనా సందేహాలుంటే హైదరాబాద్ హెల్ప్ డెస్క్ : 91 7550004136 పూర్తి నోటిఫికేషన్ కు ఈ లింక్ క్లిక్ చేయండి: http://ts.po