Wednesday, December 19

Latest News

పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అంతా సిద్ధం !

పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అంతా సిద్ధం !

Latest News, Latest Notifications
 పంచాయతీ కార్యదర్శుల నియామకాలను తొందరలొనే చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొత్త సర్కార్ లో మొదటి నియమాలకు ప్రిపేర్ అవుతున్నారు. రాత పరీక్షలో మార్కులు, కొత్త జిల్లాలు, రిజర్వేషన్లు ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తం 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను పంచాయతీరాజ్‌ శాఖ మొదలు పెట్టింది. అక్టోబరులో జరిగిన రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది.   పంచాయతీ ఎన్నికల కల్లా విధుల్లోకి కార్యదర్శులు హైకోర్టు ఉత్తర్వులతో  పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు  చేస్తోంది.  ఈలోగా గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశముంది.  పంచాయతీ ఎన్నికల తర్వాత కొత్త పాలక వర్గాలు వచ్చే సరికల్లా కొత్త కార్యదర్శులు కూడా అందుబాటులోకి వస్తారని పంచాయతీ అధికారులు భావిస్తున్నారు.&
కొలువుల భర్తీపై కేసీఆర్ ఏమన్నారు ?(వీడియో)

కొలువుల భర్తీపై కేసీఆర్ ఏమన్నారు ?(వీడియో)

Latest News, Videos
https://youtu.be/AA5m-LZbUqk మాస్టర్స్ అకాడమీ నుంచి వచ్చిన 3 యూట్యూబ్ ఛానెల్స్ SUBSCRIBE చేయండితెలంగాణ ఎగ్జామ్స్ ఛానెల్:https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=trueమాస్టర్స్ టీవీhttps://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ?disable_polymer=trueఆంధ్రఎగ్జామ్స్ :https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true
ఇస్రో నుంచి మరో ఉపగ్రహం !

ఇస్రో నుంచి మరో ఉపగ్రహం !

General Knowledge, Latest News
షార్‌ నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 19న రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV-F‌11 రాకెట్‌ను రోదసిలోకి పంపనుంది. రాకెట్‌ అగ్రభాగాన 2.2 టన్నుల జీశాట్‌-7ఏ ఉపగ్రహ అనుసంధానం పూర్తయ్యింది. ఈ రాకెట్‌కి వివిధ పరీక్షలు నిర్వహించి ఈ నెల 17న MRR ల్యాబ్‌ సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత కౌంట్‌డౌన్‌ ప్రారంభించి 19న సాయంత్రం ఈ ప్రయోగాన్ని చేపడతారు. షార్‌ నుంచి నవంబరు 14న జీశాట్‌-29, 29న హైసిస్‌, ఈ నెల 5న ఫ్రెంచ్‌ గయానా నుంచి జీశాట్‌-11ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు జీశాట్‌-7A ని పంపుతున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇస్రో అనేక అంతరిక్ష ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ ఉపగ్రహం వైమానిక రంగానికి సేవలు అందించనుంది. ఇప్పటి వరకు 13 శాటిలైట్లు ఇండియన్ ఆర్మీకి సేవలందిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా కార్టోశాట్ సిరీస్ కి చెందిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ భూమిక
TSPSCవల్ల కాలేదు.. అందుకు ప్రభుత్వ శాఖలకి ఇచ్చాం : కేసీఆర్

TSPSCవల్ల కాలేదు.. అందుకు ప్రభుత్వ శాఖలకి ఇచ్చాం : కేసీఆర్

Latest News, Latest Trends
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నూటికి నూరు శాతం భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కొలువుల భర్తీ ప్రక్రియను వేగంగా చేపడతామన్నారు. ఉద్యోగాల పేరుతో గత ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. నిరుద్యోగాలను పావులుగా వాడుకున్నాయన్నారు సీఎం కేసీఆర్. ఖాళీగా ఉన్న ఉద్యోగాల రిక్రూట్ మెంట్ బాధ్యతలను TSPSC కి అప్పగించినా… కమిషన్ ఆ పని పూర్తి స్థాయిలో చేయలేకపోయిందన్నారు. అది తమకు మైనస్ అయిందనీ… దాంతో కొలువుల భర్తీ బాధ్యతలను కొన్ని ప్రభుత్వ శాఖలకే అప్పగించామన్నారు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని స్పీడప్ చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఏడాది నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తామన్నారు.  వచ్చే ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు సీఎం. 
SI/PC మెయిన్స్ కి ప్లానింగ్ ఇస్తాం ! ఈవెంట్స్ వాయిదాతో నిరాశ వద్దు !!

SI/PC మెయిన్స్ కి ప్లానింగ్ ఇస్తాం ! ఈవెంట్స్ వాయిదాతో నిరాశ వద్దు !!

Latest News, Viewers
Friendsతెలంగాణలో SI/PC మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి విజ్ఞప్తి మీకు ప్రస్తుతం ఈవెంట్స్ వాయిదా పడ్డాయి కాబట్టి… మీరు మెయిన్స్ ఎగ్జామ్ మీద మరింత concentrate చేయండి… మీరు చదువుకోడానికి చాలా టైమ్ దొరికింది అనుకోండి… అంతేగానీ… నిరాశ చెందవద్దు. ముఖ్యంగా మా దగ్గర మెయిన్స్ మాక్ టెస్టులు రాస్తున్న వారికి కూడా విజ్ఞప్తి. ఈవెంట్స్ వాయిదా పడ్డాయి కదా అని నేను కూడా నిర్లక్ష్యం చేయదలచుకోలేదు. ఇప్పుడు చదువుకోడానికి, ప్లానింగ్ చేసుకోడానికి మరింత టైమ్ దొరికింది కాబట్టి… నేను వచ్చే సోమవారం ( డిసెంబర్ 17) నుంచి 45 లేదా 50 రోజుల ప్లానింగ్ ఇస్తాను. ఈ ప్లానింగ్ ద్వారా మనం ఏ వారంలో ఎన్ని టెస్టులు కవర్ చేస్తామన్నది క్లియర్ గా ఇస్తాను. ఈ ప్లానింగ్ మా దగ్గర మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే కాకుండా… సొంతంగా చదువుకునే వాళ్ళకి కూడా పనికి వస్తుంది. అలాగే మేం మెయిన్స్ కోసం తయారు చేస్తున్న టెస్టులు 1) స్ట
పోలీస్ ఈవెంట్స్ వాయిదా

పోలీస్ ఈవెంట్స్ వాయిదా

Latest News
ఈనెల 17 నుంచి జరగనున్న పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా వేసినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల మేరకు PMT/PET పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించే తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఫిట్నెస్ టెస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 (శనివారం) అర్థరాత్రి వరకూ తమ హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో డే వైజ్ గా జరిగే టెస్టుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని TSLPRB ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. తేదీలు మాత్రం మారతాయన్నారు. ప్రింటవుట్ తీసుకున్న హాల్ టిక్కెట్స్ ను కొత్త డేట్స్ ప్రకటించిన తర్వాత ఉపయోగించుకోవచ్చని తెలిపారు. పోలీస్ ఈవెంట్స్ కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. POLICE EVENTS PRESS NOTEDownload
ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తాం: కేసీఆర్

ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తాం: కేసీఆర్

Latest News, Latest Notifications
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. యువత ఉద్యోగాలు, ఉపాధికి కృషి చేస్తామన్నారు. అనుకున్న స్థాయిలో కొలువులు రావడం లేదన్న బాధ యువతలో ఉంది. అటు ప్రవేట్ సెక్టార్ లోనూ ఉద్యోగాలు పెంచుతామని హామి ఇచ్చారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ కొనసాగిస్తామన్నారు.
నెలాఖరులో గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

నెలాఖరులో గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

Latest News, Latest Notifications
గ్రూప్ - 2 ఇంటర్వ్యూలను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు TSPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే 1:3 నిష్పత్తిలో జాబితాని ప్రకటించిన కమిషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగాలకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్వీకరిస్తోంది. ఇది పూర్తయ్యాక పోస్టులు, వాటి అర్హతల ప్రకారం ఇంటర్వ్యూకి 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఈ మెరిట్ జాబితా విడుదలయ్యాక గ్రూప్ -2 పోస్టులకు TSPSC ఈ నెలాఖరులో ఇంటర్వ్యూలు మొదలుపెట్టనుంది. రెండు పోస్టులకు ఇతర టెస్టులుగ్రూప్ -2 పోస్టుల భర్తీలో 1) ఎక్సైజ్ ఇన్సెపెక్టర్ (2) ASO పోస్టులకు ఇతర పరీక్షలను కూడా TSPSC నిర్వహించనుంది. Excise Inspector పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అలాగే ASO పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ప్రొఫిషియెన్సీ టెస్టు ఉంటుంది.
సెలవులకు చెక్కేశారా ? ఇంట్లో ఉండీ ఓట్లెయ్యలేదా ?

సెలవులకు చెక్కేశారా ? ఇంట్లో ఉండీ ఓట్లెయ్యలేదా ?

Latest News, Latest Trends
అనుకున్నదే అయింది... హైదరాబాద్ లో మళ్లీ పోలింగ్ శాతం తగ్గింది. విద్యావంతులున్న ట్విన్ సిటీస్ లోని అన్ని నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ శాతం బాగా పెంచాలని ఎన్నికల కమిషన్ విశ్వప్రయత్నాలు చేసింది. వినూత్న రీతిలో చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది బల్దియా. ప్రజాస్వామ్యంలో ఓటుకి ఎంత విలువ ఉందో చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. 5K, 2K రన్స్, మారథాన్స్, ముగ్గుల పోటీలు, వీథి నాటకాలు... ఇలా ఎన్నో రకాలుగా ఓటు విలువను తెలియజెప్పాయి. వికలాంగులు, వృద్దుల కోసం ప్రత్యేక వాహనాలు, పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్స్, వారికి సహాయకులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్వచ్ఛంధ సంస్థలు కూడా అధికారులకు జత కలిశారు. అటు ఐటీ సంఘాలు కూడా సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ లో చైతన్యం తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేశాయి. కానీ వీళ్ళందరి ప్రయత్నాలు వృధా అయ్యాయి. 2014 ఎన్నికల్లో 53 శాతానికి పైగా పోలింగ్ నమోదైతే... ఈసారి అంతకన్నా తక్కువగానే రిక
పల్లెకు పోదాం ! ఓట్లేద్దాం !!

పల్లెకు పోదాం ! ఓట్లేద్దాం !!

Latest News, Latest Trends
పట్టణాలు, నగరాలు పల్లె బాట పట్టాయి. జనమంతా ఓట్లేసేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. నగరంలో ఎంతో బిజీగా ఉన్నా సరే... ఊళ్ళల్లో ఓట్లేయాల్సిందే అంటున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. హైదరాబాద్ MGBS, JBS తో పాటు LB నగర్ లో కూడా ప్రయాణీకుల రద్దీ కనిపిస్తోంది. ఆర్టీసీ కూడా ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శుక్రవారం పోలింగ్ తర్వాత శని, ఆదివారాలు సెలవు కావడంతో ప్రైవేటు ఉద్యోగుల్లో సంతోషంగా కనిపిస్తోంది. ఊళ్ళో ఓట్లు వేయడంతో పాటు వీకెండ్ ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఊళ్ళల్లో బంధువుల్ని కూడా కలుసుకోవచ్చని సంబురపడుతున్నారు. జనం రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ఇతర నగరాల నుంచి కూడా హైదరాబాద్ కి బస్సులను తెప్పించారు ఆర్టీసీ అధికారులు. సిటీలో ఉన్న కండీషన్ బస్సులను కూడా గ్రామాలకు పంపుతున్నారు. జనం రష్ ను అంచనా వేస్తూ బస్సులు నడుపుతున్నామని చెబుతు