Tuesday, July 23

Latest News

గ్రూప్ 2పై హైకోర్టులో వాదనలు : ఈనెల 5కి వాయిదా

గ్రూప్ 2పై హైకోర్టులో వాదనలు : ఈనెల 5కి వాయిదా

Latest News, Latest Notifications
TSPSC గ్రూప్ - 2 ఎగ్జామ్స్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. రాత పరీక్షలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడం వల్లే తప్పులు చేశారని అభ్యర్థులు హైకోర్టుకి విన్నవించారు. డబుల్ బబ్లింగ్ చేసిన వారిని అనుమతించరాదంటూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. గ్రూప్ - 2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్, వైట్ నర్ ఉపయోగించిన అభ్యర్థులను ఎంపిక జాబితా నుంచి తొలగించాలని 2018 అక్టోబర్ 12న సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు చెప్పారు. అభ్యర్థుల తరపున నలుగురు సీనియర్ న్యాయవాదులు తమ వాదన వినిపించారు. పార్ట్ - ఎలో వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమే అభ్యర్థులు పొరపాట్లు చేశారని అన్నారు. అలాగే పార్ట్ -బిలో ఆన్సర్లు దిద్దినా వైట్ నర్ ఉపయోగించిన జవాబు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. ఇన్విజిలేటర్లకు TSPSC సరైన అవగాహన కల్పించలేకపోవడంతోనే ఈ తప్పులు దొర్లాయని అ
ఫిబ్రవరి 11 నుంచి పోలీస్ ఈవెంట్స్

ఫిబ్రవరి 11 నుంచి పోలీస్ ఈవెంట్స్

Latest News, Latest Notifications
పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి. ఫిబ్రవరి 11 నుంచి PMT/PET నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. టెస్టులు నిర్వహించేందుకు గతంలో ప్రకటించిన వేదికల్లో రెండింటిని రద్దు చేశారు. హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంతో పాటు KU గ్రౌండ్స్, వరంగల్ లో ఈసారి ఈవెంట్స్ నిర్వహించడం లేదు. మారిన షెడ్యూల్ తో రివైజ్డ్ అడ్మిట్ కార్డులు, ఇంటిమేషన్ లెటర్లను తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలని TSLPRB అధికారులు అభ్యర్థులకు సూచించారు. హైదరాబాద్ లో పోలీస్ ఈవెంట్స్ ను మూడు మైదానాల్లో నిర్వహిస్తారు. ఇక పాత జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున గ్రౌండ్స్ ని ఎంపిక చేశారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ల్లో వీటిని నిర్వహిస్తారు. శారీరక దారుఢ్య పరీక్షలు 35 నుంచి 40 రోజుల్లోపు అంటే... మార్
త్వరలోనే గ్రూప్.1, 3 నోటిఫికేషన్లు

త్వరలోనే గ్రూప్.1, 3 నోటిఫికేషన్లు

Latest News, Latest Updates
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్.1, గ్రూప్.3 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. మారిన జోనల్ సిస్టమ్ తో పాటు, విధి విధానాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లెటర్ రాశామని తెలిపారు. అలాగే గ్రూప్3 కి సంభందించి కూడా స్టేట్ లెవల్, HOD లెవల్ పోస్టుల వివరణతో పాటు రోస్టర్ వివరాలు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. మొత్తం 1800 పోస్టులకు వివరణ రావాల్సి ఉందన్నారు. ఆ వివరాలు రాగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి వివరించారు. జనవరి 26 వరకు ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు ఏవీ తమ దగ్గర పెండింగ్ లేవన్నారు. (ఫిబ్రవరి 1st నుంచి గ్రూప్.1 మరియు గ్రూప్.3 కి సంభందించిన guidance మేము ఇస్తాం)
అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

Latest News, Latest Trends
అగ్రవర్ణాలు (ఓసీలు) ల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ 10శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో రిజర్వేషన్ల కోటా 50 నుంచి 60శాతానికి చేరే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం కోసమే శీతాకాల సమావేశాలను మరో 2 రోజుల పాటు పొడిగ
తెలంగాణలో సెట్స్ డేట్స్ ఖరారు

తెలంగాణలో సెట్స్ డేట్స్ ఖరారు

Latest News, Latest Updates
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలతో పాటు మిగతా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ షెడ్యూల్ వివరాలు: ఎంసెట్ (ఇంజనీరింగ్ ): 2019 మే 3,4,6 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్ ) : 2019 మే 8, 9 తేదీల్లో మార్నింగ్ సెషన్  : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మధ్యాహ్నం సెషన్: మ. 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మిగతా సెట్స్ వివరాలు మే 11 నాడు - ఈసెట్ మే 20 నాడు -పీఈసెట్ 23, 24 ల్లో - ఐసెట్ 26 నాడు - లాసెట్, పీజీ లాసెట్ 27 నుంచి 29 వవరకూ: పీజీ ఈసెట్ మే 30, 31ల్లో - ఎడ్ సెట్ పరీక్షలు జరుగుతాయి.
RRB లో 14వేల జూనియర్ ఇంజనీర్ పోస్టులు

RRB లో 14వేల జూనియర్ ఇంజనీర్ పోస్టులు

Latest News, Latest Notifications
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుల్లో మరో భారీ రిక్రూట్ మెంట్ కి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేల్లో ఖాళీగా ఉన్న 14,033 జూనియర్ ఇంజనీర్ తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. RRB JE రిక్రూట్ మెంట్ కోసం సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి మంచి అవకాశం. ఇందులో జూనియర్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ (ఐటీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ : 13,034 పోస్టులు జూనియర్ ఇంజనీర్ (ఐటీ) : 49 పోస్టులు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : 456 పోస్టులు కెమికల్ అండ్ మెటలర్జికలల్ అసిస్టెంట్ : 494 పోస్టులు వయోపరిమితి: 18 నుంచి 33యేళ్ళ లోపు (01.01.2019 నాటికి ) ఆన్ లైన్ రిజిష్ట్రేషన్లు : 2019 జనవరి 2 నుంచి 31 వరకూ విద్యార్హతలు: 1) జూనియర్ ఇంజనీర్: డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి
ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

Latest News, Latest Trends
30శాతం తగ్గింపు ! బిగ్ డే సేల్ !! దినపత్రికల్లో, టీవీల్లో ఇలాంటి ప్రకటనలు ఇకముందు ఉండకపోవచ్చు. ఆఫ్ లైన్ కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చే రోజులు పోతున్నాయి. కొత్త ఇ-కామర్స్ పాలసీ 2019 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది. దాంతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న మొన్నటిదాకా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పోటా పోటీగా డిస్కౌంట్స్ ప్రకటించాయి. దాంతో చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్‌ లోనే తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. అంతేకాదు కొన్ని సంస్థలైతే బయటి మార్కెట్ కి తమ వస్తువులను రిలీజ్ చేయకుండా కేవలం ఆన్‌లైన్‌ లో ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమ్ముకొని భారీగా లాభపడ్డాయి. ఇటు వినియోగదారులకు కూడా డిస్కౌంట్స్ బాగానే అందాయి. అయితే కొత్త ఈ-కామర్స్ పాలసీతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిజినెస్ భారీగా తగ్గే అవకాశముంది. అదే టైమ్ లో స్థానిక వ్యాపారులకు వ్యాపారం పెరి
పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో తప్పులు దొర్లడంపై హైకోర్టు సీరియస్ అయింది. స్పోర్ట్స్, వికలాంగుల కోటాని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్, వికలాంగుల వాటా సరిచేసిన తర్వాత మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ సెక్రటరీ రిక్రూట్ మెంట్ పై ఉన్న స్టేని ఎత్తివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులతో పాటు 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో ఇవ్వడంపైనా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తప్పులు జరిగినప్పుడు ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేయాలని చూస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
పంచాయతీ కార్యదర్శుల ఫలితాలపై అధికారుల వివరణ

పంచాయతీ కార్యదర్శుల ఫలితాలపై అధికారుల వివరణ

Latest News, Latest Trends
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు, ఫలితాలపై వస్తున్న ఆరోపణలకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు 50 శాతం దాటలేదని వివరించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామని చెప్పారు. ప్రాథమిక కీ విడుదల చేసి... అభ్యంతరాలు తీసుకున్నామనీ... ఆ తర్వాత సబ్జెక్ట్ నిపుణులతో ఫైనల్ కీ తయారు చేయించామని చెప్పారు.  ఆ ఫైనల్ కీ ప్రకారమే పేపర్ కరెక్షన్ చేశామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సెలెక్ట్ లిస్ట్ ప్రకటించామనీ... మార్క్ లిస్టులు, మెరిట్ లిస్టులు కూడా జిల్లాల వారీగా విడుదల చేశామన్నారు పంచాయతీ అధికారులు. అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ఇచ్చామన్నారు. అభ్యర్థులు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారో, ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానం ఇచ్చారో వారి ర్యాంక్ కార్డుల్లో పొందుపరిచామని తెలిపారు. గురువారం నుంచి అభ్యర్థులకు Omr sheets కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. జూనియర్ పంచ