Saturday, January 19

Latest News

పోలీస్ ఫిట్నెస్ కు మళ్ళీ అభ్యర్థుల కొత్త జాబితా

పోలీస్ ఫిట్నెస్ కు మళ్ళీ అభ్యర్థుల కొత్త జాబితా

Latest News, Latest Notifications
రాష్ట్రంలో జరుగుతున్న పోలీస్ ఉద్యోగాల నియామకాల ప్రాసెస్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల కొత్త జాబితాను బోర్డు మళ్లీ విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రాసెస్ కు మరో 20 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 16,925 కానిస్టేబుల్స్, 1217 ఎస్సై పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 2018 మే 31న నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను పూర్తి చేసింది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించి మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. అయితే ప్రాథమిక ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నలు ఔట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం 6 ప్రశ్నలపై స్పష్టత లేకపోవడంతో వాటిని తొలగించాలని కోరింది. ఆ తర్వాత దేహ దారుఢ్య పరీక్షలకు కొత్త మెరిట్ జాబితా రెడీ చేయాలని ఆదేశించింది. ఈ క
స్మార్ట్ ఫోన్ కొంటారా ? 10 రోజులు వెయిట్ చేయండి !!

స్మార్ట్ ఫోన్ కొంటారా ? 10 రోజులు వెయిట్ చేయండి !!

Latest News, Latest Trends
కొత్త ఏడాది వచ్చింది కాదా... స్మార్ట్ ఫోన్ కొత్తది కొందామని ప్లాన్ చేశారా ? అయితే ఒక్క 10, 15 రోజులు ఆగండి... మీరు ఊహించని ధరల్లో స్మార్ట్ ఫోన్స్ ధరలు దిగివస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఈ-కామర్స్ fdi పాలసీ వస్తోంది. ఈ పాలసీ వచ్చాక మొబైల్ కంపెనీలు భారీ భారీ డిస్కౌంట్స్ ఇచ్చి పరిస్థితి ఉండదు. దాంతో ఇప్పటిదాకా కేవలం ఆన్ లైన్ లోనే అమ్మకాలు చేస్తూ భారీగా లాభాలు గడించిన మొబైల్ కంపెనీలకు పెద్ద షాక్ తగలబోతోంది. అందువల్ల ఇప్పటిదాకా ఉన్న తమ మొబైల్స్ ని వదిలించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి కొన్ని దిగ్గజ కంపెనీలు. కొత్త ఈ-కామర్స్ పాలసీ అమల్లోకి వచ్చే ఫిబ్రవరి 1 కంటే ముందే తమ పాత సరుకు అమ్ముకునేందుకు భారీ డిస్కౌంట్స్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఆసుస్, లెనోవో, రియల్ మీ, హానర్ లాంటి కంపెనీలు దసరా, దీపావళి పండగల సీజన్ లో 40 లక్షలకు పైగా ఇన్వెంటరీని ఆన్ లైన్ మార్కెట్లోకి దించాయి. అయితే వీటిల్లో 50శా
అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు

Latest News, Latest Trends
అగ్రవర్ణాలు (ఓసీలు) ల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ 10శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో రిజర్వేషన్ల కోటా 50 నుంచి 60శాతానికి చేరే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం కోసమే శీతాకాల సమావేశాలను మరో 2 రోజుల పాటు పొడిగ
తెలంగాణలో సెట్స్ డేట్స్ ఖరారు

తెలంగాణలో సెట్స్ డేట్స్ ఖరారు

Latest News, Latest Updates
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలతో పాటు మిగతా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ షెడ్యూల్ వివరాలు: ఎంసెట్ (ఇంజనీరింగ్ ): 2019 మే 3,4,6 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్ ) : 2019 మే 8, 9 తేదీల్లో మార్నింగ్ సెషన్  : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మధ్యాహ్నం సెషన్: మ. 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మిగతా సెట్స్ వివరాలు మే 11 నాడు - ఈసెట్ మే 20 నాడు -పీఈసెట్ 23, 24 ల్లో - ఐసెట్ 26 నాడు - లాసెట్, పీజీ లాసెట్ 27 నుంచి 29 వవరకూ: పీజీ ఈసెట్ మే 30, 31ల్లో - ఎడ్ సెట్ పరీక్షలు జరుగుతాయి.
పోలీస్ ఫిట్నెస్ టెస్టులు ఎప్పుడో ?

పోలీస్ ఫిట్నెస్ టెస్టులు ఎప్పుడో ?

Latest News, Latest Notifications
రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి జరగాల్సిన దేహ దారుఢ్య పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 17 నుంచే టెస్టులు నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అయితే కానిస్టేబుల్, SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కొన్ని ప్రశ్నలు తప్పుగా ఇచ్చారంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఫిట్నెస్ టెస్టులను బోర్డు వాయిదా వేసింది. ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం యధాతధ స్థితి కొనసాగుతుండటంతో టెస్టుల నిర్వహణలో మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం సంక్రాంతి తర్వాత అయినా ఈ విషయంలో స్పష్టత వస్తుందని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అప్పుడు దేహదారుఢ్య పరీక్షలు మొదలుపెట్టినా ఫిబ్రవరి నెలాఖరు దాకా అవి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 45 రోజులకు మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ నెలాఖరులోగా నిర్వహించే
RRB లో 14వేల జూనియర్ ఇంజనీర్ పోస్టులు

RRB లో 14వేల జూనియర్ ఇంజనీర్ పోస్టులు

Latest News, Latest Notifications
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుల్లో మరో భారీ రిక్రూట్ మెంట్ కి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేల్లో ఖాళీగా ఉన్న 14,033 జూనియర్ ఇంజనీర్ తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. RRB JE రిక్రూట్ మెంట్ కోసం సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి మంచి అవకాశం. ఇందులో జూనియర్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ (ఐటీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ : 13,034 పోస్టులు జూనియర్ ఇంజనీర్ (ఐటీ) : 49 పోస్టులు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : 456 పోస్టులు కెమికల్ అండ్ మెటలర్జికలల్ అసిస్టెంట్ : 494 పోస్టులు వయోపరిమితి: 18 నుంచి 33యేళ్ళ లోపు (01.01.2019 నాటికి ) ఆన్ లైన్ రిజిష్ట్రేషన్లు : 2019 జనవరి 2 నుంచి 31 వరకూ విద్యార్హతలు: 1) జూనియర్ ఇంజనీర్: డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి
REVISED SCHEDULE FOR MOCK TESTS

REVISED SCHEDULE FOR MOCK TESTS

Latest News, Viewers
పటి నుంచి జరిగే మాక్ టెస్టుల కోసం షెడ్యూల్ ను రివైజ్డ్ చేయడమైనది.  ఇంకా 53 రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 16 వరకూ జరుగుతాయి.  ఈ వారం నుంచి అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులు మొదలవుతాయి.  రివైజ్డ్ షెడ్యూల్ కోసం ఈ కింది క్లిక్ చేసి డౌన్లోడ్చే చేసుకోండి. అలాగే అవసరమైతే అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులను మరికొన్ని యాడ్ చేస్తాం.  అదనపు టెస్టుల వివరాలు NEXT WEEK లో చెబుతాను.  (గత రెండు వారాల్లో మిస్ అయిన టెస్టులను ఈ వారంలో కవర్ చేస్తున్నాం ) REVISED 53 DAYS PLAN pdf ఇంకా మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించవారు వెంటనే జాయిన్ అవ్వగలరు.  రోజువారీ షెడ్యూల్ ప్రకారం మాక్ ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. స్టేట్ మెంట్స్, జతపరచడం, కాలక్రమం కి సంబంధించి ప్రశ్నలు ఉంటున్నాయి. దాంతో ఒక్క ప్రశ్న చదివితే నాలుగు ప్రశ్నలు చదివిన ప్రయోజనం ఉంటుంది. మాక్ టెస్టుల వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి https
ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

ఇక ఆన్‌లైన్‌ భారీ డిస్కౌంట్లు లేనట్టే !

Latest News, Latest Trends
30శాతం తగ్గింపు ! బిగ్ డే సేల్ !! దినపత్రికల్లో, టీవీల్లో ఇలాంటి ప్రకటనలు ఇకముందు ఉండకపోవచ్చు. ఆఫ్ లైన్ కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చే రోజులు పోతున్నాయి. కొత్త ఇ-కామర్స్ పాలసీ 2019 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది. దాంతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న మొన్నటిదాకా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పోటా పోటీగా డిస్కౌంట్స్ ప్రకటించాయి. దాంతో చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్‌ లోనే తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. అంతేకాదు కొన్ని సంస్థలైతే బయటి మార్కెట్ కి తమ వస్తువులను రిలీజ్ చేయకుండా కేవలం ఆన్‌లైన్‌ లో ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమ్ముకొని భారీగా లాభపడ్డాయి. ఇటు వినియోగదారులకు కూడా డిస్కౌంట్స్ బాగానే అందాయి. అయితే కొత్త ఈ-కామర్స్ పాలసీతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిజినెస్ భారీగా తగ్గే అవకాశముంది. అదే టైమ్ లో స్థానిక వ్యాపారులకు వ్యాపారం పెరి
పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో తప్పులు దొర్లడంపై హైకోర్టు సీరియస్ అయింది. స్పోర్ట్స్, వికలాంగుల కోటాని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్, వికలాంగుల వాటా సరిచేసిన తర్వాత మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ సెక్రటరీ రిక్రూట్ మెంట్ పై ఉన్న స్టేని ఎత్తివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులతో పాటు 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో ఇవ్వడంపైనా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తప్పులు జరిగినప్పుడు ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేయాలని చూస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.