ఉద్యోగాలు

ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ?

ఏ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ?

సివిల్స్ నుంచి TSPSC గ్రూప్స్, టీచర్ పోస్టులు, SIలు, కానిస్టేబుల్స్ దాకా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రైల్వేలు ఇలా ఏ ఉద్యోగానికి సంబంధించి అయినా సరే…. మీకు www.telanganaexams.com వెబ్ సైట్ + app లో గైడెన్స్ అందించాలన్నదే మా లక్ష్యం.

చాలా మందికి ఫలానా జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నా .. దానికి సంబంధించిన సరైన గైడెన్స్ లేక ముందడుగు వేయలేకపోతున్నారు. అందుకే అలాంటి వారికి మేం అండగా నిలబడాలని నిర్ణయించాం. ఒక్క గైడెన్సే కాదు… కొన్ని రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి మెటీరియల్, Question & Answers కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఎగ్జామ్స్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ… ప్రిపరేషన్ మెళకువలు చెబుతూనే… Online లేదా Offline గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహిస్తాం. రాష్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో మోడల్ పేపర్స్ ఇస్తూ… మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేలా తీర్చిదిద్దుతాం.

మీరు ఉద్యోగం సంపాదించే వరకూ మా తరపున సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. వెబ్ సైట్ తో పాటు యాప్ లో కూడా మీకు మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో మెటీరియల్ ను మీ మొబైల్ లో Save చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా ప్రముఖులతో పాటు ఆయా ఉద్యోగాలు సాధించిన విజేతల నుంచి సలహాలు, సూచనలు కూడా అందిస్తాం.

విద్య, ఉద్యోగాల్లో ప్రభుత్వ నుంచి వచ్చే Latest information తో పాటు ఆయా రిక్రూట్ మెంట్ బోర్డులు, యూనివర్సిటీలు, కమిషన్స్, వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే నోటిఫికేషన్లు, ఇతర సమాచారాన్ని కూడా వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తాం. వీటితో పాటు ప్రముఖుల సలహాలు, సూచనలను వీడియోల రూపంలో కూడా అందిస్తాం. ఇవేకాకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ అవడానికి అవసరమైన…..

1) Burning Issues ( Examination point of view)

2) Current Affairs ( Today, Weekly, Monthly)

3) General Knowledge

4) Year Round up -2016

5) Grand Tests, Model Papers

6) Success Tips

7) Post a Question ద్వారా…జాబ్ ఎంట్రన్స్ టెస్ట్ లపై మీ సందేహాలకు Expertsతో సమాధానాలు.

ఇప్పటివరకూ ఇలా విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించి.. అంతా ఒకే చోట యువతకు సమాచారాన్ని అందించే వెబ్ సైట్ ఏదీ తెలుగులో లేదు. టెన్త్ క్లాస్ నుంచి ఉద్యోగం లేదా ఉపాధితో స్థిరపడే వరకూ మీ వెన్నంటి ఉండాలన్న లక్ష్యంతోనే  www.telanganaexams.com వెబ్ సైట్ cum యాప్ ను రూపొందించాం.

Enter to Learn… Leave to Achieve