చదువులు

ఏం చదవాలి ? ఎలా చదవాలి ?

ఏం చదివితే.. ఏ ఉద్యోగం ?

జీవితంలో ఎలా స్థిరపడాలి ?

         నిజంగా ఇలాంటి ఆలోచనలు పదో తరగతిలోనే మొదలవుతాయి. చదువులనేవి ఉద్యోగానికి, ఉపాధి కోసమో, డబ్బుల సంపాదన కోసమో కాదు… విజ్ఞానం, మనం మనిషిగా ఎదగడానికి ఉపయోగపడతాయని కొందరు అంటుంటారు. అయితే ఉన్నత చదువులనేవి ఉద్యోగం, ఉపాధి పొందడానికి మాత్రం తప్పనిసరిగా ఉపయోగపడతాయి. జీవితంలో స్థిరపడాలంటే ముందు మనం చదువే చదువు నుంచే ఆలోచనలు, ప్రణాళికలు మొదలు కావాలి. వాటికి నాంది టెన్త్ తర్వాతే పడుతుంది. మరి అంత కీలకమైన టెన్త్ క్లాస్ తర్వాత నిజంగా విద్యార్థి తనకిష్టమైన కోర్సునే ఎంచుకొని చదువులు సాగిస్తున్నాడా… అంటే అదేం లేదు. ఎవరో ఏదో సాధించారనీ, ఎవరో ఏదో చదువుతున్నారనీ… ఇరుగు, పొరుగు వాళ్ళో, స్నేహితులో చెప్పింది ఫాలో అయ్యే వాళ్ళు నూటికి 60శాతం మంది ఉంటున్నారు. అలా ఎవర్నో చూసి ఫాలో అయి… తమకు ఇష్టం లేని చదువులు చదివి అందులో విజయం సాధించలేక చతికిలపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే మన చదువును మనమే నిర్ణయించుకోవాలి. మన కెరీర్ ను మనకిష్టమైనట్టు అందంగా మలుచుకోవాలి.

           ఏదో అనుకొని.. ఏదో చదువుకొని… మరేదో వృత్తిలో స్థిరపడే రాజీ మనస్థత్వం నుంచి మనం బయటపడాలి. అందుకు మార్గదర్శకంగా వ్యవహరించడానికే www.telanganaexams.com మీకు అండగా ఉంటుంది. పదో తరగతి మొదలు డిగ్రీలు, పీజీలు, బీటెక్, బీఈడీ, ఫ్యాషన్ టెక్నాలజీ… ఇతర సాంకేతిక, ప్రొఫెషనల్ కోర్సుల్లో మీకు అకడమిక్ పరంగా అన్ని విధాలా గైడ్ చేస్తుంది. మిమ్మల్ని చదువుల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన సమాచారం, మెటీరియల్ అందిస్తుంది. Subject Experts నుంచి మీకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుంది. ప్రముఖ కాలేజీలు, విద్యాసంస్థల నుంచి గైడెన్స్, మోడల్ పేపర్స్ అందిస్తాం. ఆయా చదువుల్లో విజేతలుగా నిలిచిన వారి ఇంటర్వ్యూలు, విజయ సూత్రాలు సమాచారం, వీడియో రూపంలో అందిస్తుంది మన వెబ్ సైట్.

విద్యకి సంబంధించి ఏం ఉంటాయి ?

1) పదో తరగతి మొదలు…. ఇంటర్, డిగ్రీ, బీటెక్, MBA, MCA ఇలా అన్ని అకడమిక్ కోర్సుల ఎగ్జామ్స్ గైడెన్స్

2) ఏం కోర్సు చదివితే ఎలాంటి కెరీర్ ఉంటుంది ?

3) అకడమిక్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్ & గ్రాండ్ టెస్టులు

4) Subject Experts నుంచి సలహాలు ( Text + Vedio ల రూపంలో)

5) విదేశాల్లో చదువులు

6) Spoken English

7) రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఇచ్చే Scholarships వివరాలు

8) బ్యాంకులు ఇచ్చే Educational Loans సమాచారం

9) Post a Question సౌకర్యం ద్వారా…ఉన్నత విద్యపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా… Education Expertsతో సమాధానాలు.

మేథావులు, సబ్జెక్ట్ నిపుణుల సలహాలు, వివిధ విద్యాసంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ నుంచి మీకు సహాయ సహకారాలు అందించడానికి www.telanganaexams.com వెబ్ సైట్ + App ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

         ఇప్పటివరకూ ఇలా విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించి అంతా ఒకే చోట యువతకు సమాచారాన్ని అందించే వెబ్ సైట్ ఏదీ తెలుగులో లేదు. టెన్త్ క్లాస్ నుంచి ఉద్యోగం లేదా ఉపాధితో స్థిరపడే వరకూ మీ వెన్నంటి ఉండాలన్న లక్ష్యంతోనే www.telanganaexams.com వెబ్ సైట్ cum యాప్ ను రూపొందించాం.

Enter to Learn… Leave to Achieve