Thursday, May 24
Log In

భార‌త సామాజిక నిర్మితి

కులం (CASTE)

భార‌త సామాజిక నిర్మితి
1) కులాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ? ఇది ఏ భాషా పదం నుంచి వచ్చింది ? జ: క్యాస్ట్ (CASTE) ఇది కాస్టా అనే స్పానిష్ పదం నుంచి వచ్చింది 2) జాతి, వ్యవస్థ లేదా వారసత్వ లక్షణాల సముదాయాన్ని ఏమంటారు ? జ: కులం 3) భారత్ లో క్యాస్ట్ అనే పదాన్ని వాడిన వారు ఎవరు ? జ: పోర్చుగీసు వారు 4) ఏ దేశీయులు జాతి లక్షణాలకు సామీప్యత ఉండటంతో క్యాస్ట్ పదాన్ని వాడారు ? జ: పోర్చుగీసు వారు 5) ఆర్యులు స్థానిక ప్రజలను గుర్తించడానికి రెండు తెగలుగా విభజించారు. అవి ఏంటి ? జ: ఆర్య వర్ణులు, దాస్య వర్ణలు 6) తెల్లగా ఉండి, ఆజానుబాహులను ఏమని పిలిచేవారు ? జ: ఆర్యులు 7) నల్లగా, పొట్టిగా ఉండే వారిని ఏమని ఆర్యులు పిలిచేవారు ? జ: దాస్య వర్ణులు 8) ద్విజులు ఎన్ని రకాల సంస్కారాలు నిర్వహిస్తారు ? జ: 44 రకాలు 9) చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భావం అనేది ఏయే గ్రంథాల్లో ఉంది ? జ: 1) విష్ణు పురాణం 2) పురుష సూక్తం 10) ఈ రెండు పురాణాల్లో

భారతీయ సమాజ నిర్మితి – పరిచయం

భార‌త సామాజిక నిర్మితి
1) భారతీయ సమాజం ఆదర్శాలు, విలువలతో కూడినది. అయితే హిందూ సమాజం పునాదులు వేటిపై నిర్మితమై ఉన్నాయి. జ: (1)చతుర్విధ పురుషార్ధాలు (2) ఆశ్రమ ధర్నాలు (3)రుణాలు (4) కర్మ సిద్దాంతం (5)త్రిగుణాలు (6)శ్రుతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు 2) వేటిని సమాజంలో నివసిస్తున్న వ్యక్తి అంతర్గత, బాహ్య ప్రవర్తనను నియంత్రించడానికి నిర్దేశించారు ? జ: చతుర్విధ పురుషార్థాలు 3) వ్యక్తులు వివిధ దశల్లో క్రమశిక్షణతో, ధర్మబద్ధంగా జీవించడానికి అవసరమైన చతుర్విధ పురుషార్థాలు ఏవి ? జ: a) ధర్మం (b) అర్థం (c) కామం(కోరికలు) (d) మోక్షం 4) ‘ధృ’ అనే సంస్కృత ధాతువు నుంచి ‘ధర్మం’ అనే పదం వచ్చింది. దీనికి అర్థమేంటి ? జ: కలిపి ఉంచు లేదా నిలబెట్టు 5) ధర్మం అనే పదం రుగ్వేదంలో ‘రుత’ అనే భావాన్ని తెలియజేస్తుంది. రుత అంటే ఏంటి ? జ: ‘క్రమం’ అని అర్థం. 6) సమాజంలో సుఖమయ జీవనానికి గృహస్థ ధర్మానలను ఇతర బాధ్యతలను నిర్వర్తించడానికి వ్