Wednesday, December 19

భార‌త రాజ్యాంగం – కొత్త స‌వాళ్ళు

రాజ్యాంగంపై వివిధ సవాళ్ళు

భార‌త రాజ్యాంగం - కొత్త స‌వాళ్ళు
పత్రికలు - సోషల్ మీడియా స్వేచ్చ కొత్త సవాళ్ళు 1) భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కులలోని ఏ నిబంధన ఆరు రకాల స్వేఛ్చలను భారత పౌరులకు కల్పిస్తోంది ? జ: 19వ నిబంధన 2) 19(1) (ఎ) ప్రకరణం వాక్ స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ కింద ఏ ఇతర స్వేచ్ఛలు అంతర్భాగంగా ఉన్నాయి ? జ: పత్రికా స్వేచ్చ, మీడియా స్వేచ్చ ఎన్నికల్లో అక్రమాల నివారణ - కొత్త సవాళ్ళు 3) ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే ఎన్నికల ప్రవర్తనావళి ఏ పేరుతో అమలు చేయబడుతుంది ? జ: కోడ్ ఆఫ్ కండక్ట్ 4) రాజకీయాల్లో, ఎన్నికల్లో నేరస్థులు పోటీ చేయడం, ప్రమేయం చూపడాన్ని ఏ కమిటీ తెలిపింది ? జ: 1993లో N.N.వోహ్ర కమిటీ 5) 2014 లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులపై ఎక్కువగా నేరారోపణలు ఉన్నాయి ? జ: కాంగ్రెస్ - 57 శాతం 6) ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది నేరస్థులు ఎన్నికల బరిలో నిల్చున్నారు ? జ: ఉత్తర ప్రదేశ్ (30శాతం మంది ) పార్టీ ఫిరాయింపులు 7) 1985లో

ప్రపంచీకరణ రాజ్యాంగ సవాళ్ళు

భార‌త రాజ్యాంగం - కొత్త స‌వాళ్ళు
1) ఏయే పారిశ్రామిక విధానాలు భారత దేశాన్ని సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పరిచాయి ? జ: 1948,1956 2) సాంఘిక, ఆర్దిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలన్నది ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన ? జ: 38వ నిబంధన 3) ఆదేశిక సూత్రాల్లో 39వ నిబంధనలో ఆరు నియమాలు ఉన్నాయి. అవి దేనికి సంబధించినవి ? జ: స్త్రీ, పురుషులకు సమాన వేతనం, ఉపాధి అవకాశాలు, సంపద కేంద్రీకృతం కాకుండా చేసే చర్యలు, కార్మిక సంక్షేమం 4) నిరుద్యోగ భృతి చెల్లించాలనే నియమం ఎన్నోవది ? జ: 41వ నిబంధన 5) కార్మికులకు సౌకర్యాల కల్పన, ఏర్పాట్లు ఏ నిబంధనలో ఉన్నాయి ? జ: 42వ నిబంధన 6) కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన చెబుతుంది ? జ: 43వ నిబంధన

భారత రాజ్యాంగం కొత్త సవాళ్లు

భార‌త రాజ్యాంగం - కొత్త స‌వాళ్ళు
1) భారత రాజ్యాంగాన్ని మొదటిసారి ఎప్పుడు సవరించారు ? జ: 18 జూన్ 1951లో 2) 2000సం.లో వాజ్ పేయి ప్రధాని హయాంలో రాజ్యాంగ సవరణలను సూచించుటకు ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ సమీక్షా కమీషన్ ను ఏర్పాటు చేశారు ? జ: జస్టిస్ M.N వెంకటాచలయ్య 3) దేశ ప్రజలందరికీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి హామీలు వేటి ద్వారా లభించాయి ? జ: రాజ్యాంగ ప్రవేశిక ద్వారా 4) రాజ్యాంగంలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఏ నిబంధన కామన్ సివిల్ కోడ్ ను ఏర్పాటు చేయాలని పేర్కొంది ? జ: 44వ నిబంధన 5) ఇంతవరకూ అమలు చేయని ఏకైక ఆదేశిక సూత్రంగా దేన్ని పేర్కొంటారు ? జ: ఉమ్మడి పౌరస్మృతి 6) రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిద్యం లేదని రాష్ట్ర్ర ప్రభుత్వం భావిస్తే వారికి కొన్ని ఉద్యోగాలు రిజర్వు చేయవచ్చు ? జ: 16(4) నిబంధన 7) మొదట రిజర్వేషన్లను ఎంత కాలపరిమితితో ఏర్పాటు చేశారు