Thursday, May 24
Log In

ఎన్నిక‌లు వ్య‌వ‌స్థ‌

రాష్ట్ర్రఎన్నికల సంఘం

ఎన్నిక‌లు వ్య‌వ‌స్థ‌
1) 1992లో రాజ్యాంగంలో చేర్చబడ్డ ఏ రాజ్యాంగ సవరణలను అనుసరించి రాష్ట్ర్రాల్లో ప్రత్యేక ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు ? జ: 73 రాజ్యాంగ సవరణ 2) ఏ అధికరణ ప్రకారం రాష్ట్ర్ర ఎన్నికల సంఘాన్ని ఏర్సాటు చేస్తారు ? జ: 243(K) 243(ZA) 3) రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ఎవరు నియమిస్తారు ? జ: గవర్నర్ 4) రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలం ఎంత ? జ: 5 సంవత్సరాలు 5) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు ? జ: గవర్నర్ కు 6) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్దతిలోనే ఎవరు తొలగిస్తారు ? జ: పార్లమెంట్ సిఫార్సుతో రాష్ట్ర్రపతి 7) పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ, నగర పాలక సంస్థలు... అంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు ? జ: రాష్ట్ర ఎన్నికల సంఘం 8) 1994లో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్సాటు చేశారు. మొదటి ఎన్నికల ప్రధానాధికారి ఎవరు

ఎన్నికల యంత్రాంగం

ఎన్నిక‌లు వ్య‌వ‌స్థ‌
1) చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజినయల్ కమిషనర్లను ఎవరు నియమిస్తారు ? జ: రాష్ట్రపతి (నోట్: ఈ నియామకం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉండాలి) 2) జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘ తరపు రిటర్నింగ్ అధికారిగా ఎవరు పనిచేస్తారు ? జ: జిల్లా కలెక్టర్ 3) పోలింగ్ స్టేషన్ స్థాయిలో ఎన్నికల అధికారిని ఏమంటారు ? జ: ప్రొసీడింగ్ ఆఫీసర్ 4) భారత్ లో కేంద్ర ఎన్నికల కార్యాలయం ఢిల్లీలో ఉంది. దాన్ని ఏమంటారు ? జ: నిర్వాచన్ ఆయోజన్ 5) కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే CEC తో పాటు ఇద్దరు కమిషనర్లకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు ? జ: భారత సంఘటిత నిధి నుంచి 6) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించినట్టే పార్లమెంటు తప్పిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకరణ ఏది ? జ: ప్రకరణ 324 (5) 7) ఎన్నికల కమిషన్ లో కమిషనర్లను అవినీతి, అసర్థమత ఆరోపణలపై ఎవరి సిఫార్సులతో రాష్ట్రపతి తొలగిస్తారు ?

ఎన్నికల కమిషన్ ఏర్పాటు

ఎన్నిక‌లు వ్య‌వ‌స్థ‌
1) భారత్ లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ? జ: 2014 నాటికి 81.45 కోట్ల మంది 2) ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది ? జ: రాజ్యాగంలోని XV వ భాగంలో 324అధికరణ ప్రకారం 3) ఎన్నికల సంఘం తన పని విధానానికి సంబంధించి ఎవరికి జవాబుదారీ తనంగా ఉంటుంది ? యేటా ఎవరికి నివేదిక సమర్పిస్తుంది ? జ: ఎవరికీ జవాబుదారీ కాదు. ఎవరికీ నివేదిక సమర్పించదు 4) భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ? జ: 1950 జనవరి 25 (నోట్: అందుకే ఈ రోజులు ఓటర్ల దినోత్సవంగా జరుపుతారు ) 5) ప్రారంభంలో సిఈసి ఏకసభ్య కమీషన్ గా పనిచేసేది. దీన్ని ఎవరి హయాంలో త్రిసభ్య కమిషన్ గా మార్చారు ? జ: 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 6) తర్వాత మళ్ళీ 1990లో తిరిగి ఏకసభ్య కమీషన్ గా ఎవరి హయాంలో మారింది ? జ: వి.పి.సింగ్ ప్రభుత్వం 7) 1993లో పి.వి నర్సింహారావు ప్రభుత్వం తిరిగి ఎంతమంది సభ్యుల కమిషన