Tuesday, July 17
Log In

తెలంగాణ చ‌రిత్ర 1948-1970

తెలంగాణ ఉద్యమ ఆవిర్బావం (1969)

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) ఏ ఆర్డర్ ప్రకారం తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు ? జ: 1958 లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 2) తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేవారు ? జ: 1958 ఫిబ్రివరి 20 3) తెలంగాణ ప్రాంతీయ కమిటీలో ఎంతమంది సభ్యులు ? జ: 9 మంది 4) తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు ? జ: కె.అచ్చుత రెడ్డి ( 1958-1962) 5) తెలంగాణ కమిటీ అధ్యక్షులు - ఉపాధ్యక్షులు మొదటిది(1958-62) : కె.అచ్చుత రెడ్డి , మాసూమా బేగం (ఉపా) రెండోది (1962-1967) : టి.హయగ్రీవాచారి, టి.రంగారెడ్డి మూడోది(1967-1972) : జె.చొక్కారావు, కోదాటి రాజమల్లు నాలుగోది(1972) : కోదాడి రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ 6) తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు రద్దయింది ? ఎందుకు ? జ: 1972-73 కాలంలో... జై ఆంధ్ర ఉద్యమం జరిగిన తర్వాత ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. దాంతో ప్రాతీయ కమిటీని రద్దు చేశారు. 7) పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా

విశాలాంధ్ర నినాదం- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాద తత్వం ఉన్నది అన్నది ఎవరు ? జ: జవహర్ లాల్ నెహ్రూ 2) విశాలాంద్ర్ర భావనను మొదట ఎవరు వ్యాస్తి చేశారు? జ) కమ్యూనిస్టులు 3) కమ్యూనిస్టులు ఏమని ప్రచారం చేశారు? జ) ఒకేజాతి, ఒకేభాష, ఒకేరాష్ట్ర్రం. 4) విశాలాంధ్ర పత్రికను ఎవరు ప్రచురించారు? జ) పుచ్చలపల్లి సుందరయ్య 5) వావిలాల గోపాలకృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని ఎప్పుడు రాశారు ? జ) 1940. 6) అయ్యదేవర కాళేశ్వరరావు 1949లో ఎక్కడ సభను నిర్వహించారు? జ) విజయవాడ 7) విశాలాంధ్ర మహాసభ మొదటిసారిగా ఎక్కడ ఎవరి అధ్యక్షతన జరిగింది? జ) వరంగల్, హయగ్రీవాచారి 8) అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ ను ఏమని కొట్టి పారవేశాడు? జ) లూజ్ టాక్ 9) తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర్రంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన వారెవరు? జ) కె.వి.రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి. 10) విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసి

1953 తెలంగాణ రాష్ట్రం – ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) కమ్యూనిస్టులు ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు? జ) విశాలాంద్ర. 2) ఆంధ్రులు కంటే గొప్ప కవులు తెలంగాణలో ఉన్నారని అన్నవారు ఎవరు? జ) సురవరం ప్రతాపరెడ్డి 3) 350 మంది తెలంగాణ కవుల వివరాలతో ‘గోల్కొండ కవుల సంచిక‘ ను ప్రచురించనది ఎవరు ? జ: సురవరం ప్రతాపరెడ్డి 4) ఆంధ్ర రాష్ట్ర్రం ఎప్పుడు ఏర్పడింది? జ) 1953 అక్టోబర్ 1 5) విశాలాంధ్రను తిరస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాటు భావనను మొదటగా తీసుకొచ్చింది ఎవరు? జ) కె.వి.రంగారెడ్డి ( తెలంగాణ పితామహుడు అంటారు) 6) 1938లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఏ ఉద్యమం జరిగింది? జ) వందేమాతర ఉద్యమం. 7) వందే మాతరం ఉద్యమంలో పాల్గొని డిబార్ అయిన ఓయూ విద్యార్థులు మొదట ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించారు ? జ: ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖ పట్నం) 8) అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? జ) కట్టమంచి రామలింగారెడ్డి. 9) ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్

1952 గైర్ ముల్కీ ఉద్యమం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) గైర్ ముల్కీ ఉద్యమానికి నాంది పలికిన ప్రాంతం ఏది? జ) వరంగల్. 2) 1952 జులైలో వరంగల్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల యాక్షన్ కమిటీకి కన్వీనర్ ఎవరు ? జ) బుచ్చయ్య 3) వరంగల్ లో ముల్కీ ఉద్యమం మొదలయ్యే టైమ్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నది ఎవరు ? జ: గోవిందరావు దేశ్ పాండే 4) 1952 ఆగస్టు 24న గైర్ ముల్కీలకు వ్యతిరేకంగా విద్యార్దులు ఎక్కడ బహిరంగ సభ నిర్వహించారు ? జ) బొల్లారం. 5) సిటీ కాలేజ్ దగ్గర జరిగిన ఊరేగింపులో విద్యార్దులు ఏమని నినాదాలు చేశారు? జ) ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.... గైర్ ముల్కీ గో బ్యాక్. 6) సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు ఎప్పుడు జరిగాయి ? జ: 1952 సెప్టెంబర్ 3న 7) కాల్పులకు అనుమతి ఇచ్చిన నగర మేజిస్ట్ర్రేట్ ఎవరు? జ) అబ్దుల్ బషీర్. 8) సిటీ కాలేజ్ దగ్గర పోలీసులు ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు ? జ: 12 రౌండ్స్ 9) సిటీ కాలేజ్ తర్వాత మరోచోట ఎక్కడ కాల్పులు జరిగాయి ? జ: మదీనా హోటల

సాధారణ ఎన్నికలు – హైదరాబాద్ రాష్ట్రం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ? జ) 1952 ఫిబ్రవరిలో 2) 1952లో హైదరాబాద్ రాష్ట్ర్రంలో ఉన్న మొత్తం జిల్లాలు ఎన్ని? జ) 16 జిల్లాలు 3) హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండేవి ? జ: 142 నియోజకవర్గాలు, రిజర్వు అభ్యర్థులు 33 మంది మొత్తం 175 మంది శాసనసభ్యులు 4) హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందింది ? జ: 93 సీట్లు 5) కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు? జ) బూర్గుల రామకృష్ణారావు. 6) భారత దేశంలోనే అత్యధిక మెజార్టితో గెలుపొందినవారు ఎవరు? జ) రావి నారాయణరెడ్డి (3,09,162 ఓట్ల మెజార్టీ) భారత దేశంలోనే అత్యధిక మెజారిటీ 7) ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఏ రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది? జ) బ్రాహ్మణ వర్సెస్ రెడ్డి. 8) హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1952 మార్చి 6న బూర్గుల రామక్రి

ఆపరేషన్ పోలో – హైదరాబాద్ సంస్థానం విలీనం

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7వ నిజాం నవాబు 1) హైదరాబాద్ సంస్థానం విలీనానికి భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి ? జ: ఆపరేషన్ పోలో (ఆపరేషన్ కాటర్ పిల్లర్) 2) నిజాం రాజ్యంపైకి భారత్ సర్కార్ ఎప్పుడు సైన్యాన్ని పంపింది ? జ: 1948 సెప్టెంబర్ 13న 3) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ఎప్పుడు విలీనం అయింది ? జ: 1948 సెప్టెంబర్ 17న 4) యథాతధ ఒడంబడిక ఎవరెవరి మధ్య కుదిరింది ? ఎప్పుడు ? జ: 29 నవంబర్ 1947న.. భారత ప్రభుత్వం - నిజాం రాజుకి మధ్య 5) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ను చేర్చడానికి కృషి చేసిన చివరి బ్రిటీష్ వైస్రాయ్ ఎవరు ? జ: లార్డ్ మౌంట్ బాటెన్ 6) మజ్లీస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (రజాకార్ల ఉద్యమం)కు ఎవరు నాయకత్వం వహించారు ? వాళ్ళ నినాదం ఏంటి ? జ: కాశీం రజ్వీ. ఆజాద్ హైదరాబాద్ 7) హైదరాబాద్ కు ఏమని పేరుపెట్టాలని పంజాబ్ కు చెందిన చౌదరి హకమత్ అలీగుజర్ సూచించారు ? జ: ఉస్మానిస్తాన్ 8) సర్వస్

తెలంగాణలో అస్తిత్వ ఉద్యమాలు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా 1901లో హైదరాబాద్ లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించింది ఎవరు ? జ: మునగాల సంస్థానపు దివాన్ అయిన కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాధరావు 2) హన్మకొండలో స్థాపించబడిన గ్రంథాలయం ఏది ? జ: రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం (1904లో) 3) ఉస్మానియాలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం స్థాపించిన సంస్థ ఏది ? జ: అంజుమాన్ తారక్ ఇ ఉర్దూ ( మౌల్వీ అబ్దుల్ హక్) 4) నిజాం రాజ్యంలో దళితుల తరపున ఉద్యమం చేపట్టింది ఎవరు ? జ: మాదిరి భాగ్యరెడ్డి వర్మ 4) అంటరానితనం నేరమంటూ వారికి భాగ్యరెడ్డి వర్మ ఏమని పేరు పెట్టారు? జ: ఆది హిందువులు 5) భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థ ఏది ? జ: జగన్ మిత్ర మండలి 6) జగన్ మిత్ర మండలిలో ఎవరెవరికి సభ్యత్వాన్ని నిరాకరించారు ? జ: మద్యపానం సేవించేవారు, సిగరెట్టు తాగే వారు 7) హిందువుల్లో చైతన్యం తెచ్చేందుకు భాగ్యరెడ్డి వ

నిజాం సబ్జెక్ట్ లీగ్

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) 1933లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వెల్లడించిన ఫర్మానా ఉద్దేశ్యం ఏంటి ? జ: ఉద్యోగాల్లో ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వడం. నాన్ ముల్కీలను తాత్కాలిక ప్రాతిపదికన నియామకం. 2) ముల్కీల హక్కులు కాపాడటానికి ఏర్పడిన ప్రజా సంస్థ ఏది ? జ: 1934లో నిజాం ప్రజల సంఘం (నిజాం సబ్జెక్ట్స్ లీగ్) 3) నిజాం ప్రజల సంఘంను ఉర్దూలో ఏమంటారు ? జ: జమీయత్ రిఫాయామే నిజాం (అధ్యక్షుడు : నవాబ్ సర్ నిజామత్ జంగ్) 4) ముల్కీలీగ్ ఏ భాషను ప్రోత్సహించాలని కోరింది ? జ: హిందీ (హిందూస్థానీని) 5) నిజాం ముల్కీ లీగ్ ఏమని నినాదం ఇచ్చింది ? జ: హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ 6) ముల్కీలీగ్ నుంచి చీలిపోయి హిందువులు ఏ సంస్థను స్థాపించారు ? జ: పీపుల్స్ కన్వెన్షన్ 7) హైదరాబాద్ స్టేట్ లో రాజకీయ సంస్కరణలు తెచ్చేందుకు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరి అధ్యక్షతన రాజకీయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు ? జ: దివాన్ బహుదూర్ అరవమూడి అయ్యంగార్ (ఛైర్మన

ముల్కీ – గైర్ ముల్కీ సమస్యలు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) ముల్కీ అనే పదానికి అర్థమేంటి ? ముల్కీ-గైర్ ముల్కీ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది ? జ: ముల్కీ అనగా స్థానికుడు. ఈ సమస్య బహమనీల కాలం నుంచే మొదలైంది. 2) దక్కనీలు, అఫాకీలుగా ఎవరిని వ్యవహరించేవారు? జ) ముల్కీలు, గైర్ ముల్కీలు 3) అఫాకీలు, దక్కనీలు అంటే ఎవరు ? జ: అఫాకీలంటే షియాలు, దక్కనీలు అంటే సున్నీలు 4) ముల్కీ, గైర్ ముల్కీ సమస్యలతో అంతమైన రాజ్యం ఏది ? జ: బహమనీ రాజ్యం (క్రీ.శ.16వ శతాబ్దంలో) 5) కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించిన సుల్తాన్ కులీ కుతుబ్ షా.. హైదరాబాద్ సంస్థానంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు ? జ: ముల్కీలు (స్థానికులకు) 6) మొదటి సాలార్ జంగ్ తన పరిపాలనలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు ? జ: కాయస్తులు, ఖత్రీలు 7) సాలార్ జంగ్ తన పరిపాలనా సంస్కరణల్లో ఉపయోగపడేందుకు ఎవరిని హైదరాబాద్ లో ఉద్యోగాల్లో నియమించాడు ? జ: అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యావంతులను రప్పించాడు 8) సాలార్ జంగ్ హయాంలో

హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్ సంస్కరణలు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు స్దాపించారు? జ) మీర్ ఖమ్రుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ @ నిజాముల్ ముల్క్ (1724) 2) చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఏంటి ? జ: కుర్ర కత్తి వీరుడు 3) నిజాం పాలనలో హైదరాబాద్ విస్తీర్ణం ఎంత? జ) విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు 4) నిజాముల్ ముల్క్ అసఫ్ జాహీ రాజ్యం స్థాపించినప్పుడు రాజధాని ఏది ? జ: ఔరంగాబాద్. 1770 తర్వాత హైదరాబాద్ కి మార్చాడు 5) నిజాముల్ ముల్క్ కాలంలో ఎన్ని సుభాలు ఉండేవి ? జ: 6 సుభాలు. ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్, ఖాందేష్, బీదర్, బీరార్ (వీటినే స్మిత్ లు అని కూడా అంటారు ) 6) రెవెన్యూ వసూళ్ళకి అసఫ్ జాహీలు అనుసరించిన విధానం ? జ) జాగీర్దారీ పద్దతి 7) జాగీర్ అనే పదానికి అర్థమేంటి ? వీటిని ఎవరికి ఇచ్చేవారు ? జ: జాగీర్ అంటే పర్షియన్ భాషలో ‘ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతం’. దీన్ని ఉద్యోగులు లేదా ప్రత్యేక సేవలు చేసే వారికి ఇచ్చేవారు. 8) జాగీర్దారీ విధానం మొగలులు