Thursday, February 27

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు

కేంద్ర ప్రభుత్వ పథకాలు 2014-19 (వీడియో)

కేంద్ర ప్రభుత్వ పథకాలు 2014-19 (వీడియో)

Latest News, Preparation Plan, Videos, కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం... పాత పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్త స్కీమ్స్ అమల్లోకి తెస్తోంది.  అందుకే మీకు 2014 నుంచి 2019 వరకూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాం... ఇవి రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్ తో పాటు కేంద్ర స్థాయిలో జరిగే అన్ని ఎగ్జామ్స్ లోనూ పనికొస్తాయి... ఇవాళ మొదటి క్లాస్ ఇచ్చాను.  Central Govt. Schemes పై మరికొన్ని క్లాసులు కూడా ఇస్తాను.  ఇవాళ 12 స్కీమ్స్ గురించి వివరించాను.  ఈ వీడియోలో చూడండి https://www.youtube.com/watch?v=VxkpuiSjvGE

స్టాండప్ ఇండియా

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
SC, STలు మహిళల్లో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2016 ఏప్రిల్ 5న దళిత నేత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా దీన్ని ప్రారంభించారు.  భాతర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ), దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (డిక్కీ) దేశంలో భిన్న రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. సిడ్బీతో పాటు నాబార్డ్ కూడా స్టాండప్ కనెక్ట్ సెంటర్లను నిర్వహిస్తుంది.  ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తేలికపాటి రుణాలు అందించడం, ఎస్సీ, ఎస్టీ, మహిళలు చేపట్టే వ్యవసాయేతర కార్యక్రమాల కింద 10లక్షల నుంచి కోటి రూపాయల దాకా కొద్దిపాటి షరతులతో రుణాలు అందించడం. దేశంలోని ప్రతీ ఒక్క బ్యాంకు యొక్క శాఖ ఎస్సీ, ఎస్టీ లేదా మహిళకు రుణం అందించేలా చూడటం. రుణాలు తీసుకునే పారిశ్రామిక వేత్తలకు రూపే కార్డును అందిస్తారు.  దీంతో ఒకేసారి రుణ మొత్తాన్ని

జాతీయ వ్యవసాయ మార్కెట్ ‘ఈ-నామ్’

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు వచ్చేందుకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుకల్పించేదే ఈనామ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ లో ఈపథకాన్ని ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ 8 రాష్ట్రాల్లోని 21 మార్కెట్లలో ఏర్పాటు చేస్తారు. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఈ మార్కెట్లలో గోధుమలు, నూనె గింజలు, గిజం ధాన్యాలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, బంగాళా దుంపలు లాంటి మొత్తం 25 పంటలను అమ్ముకునే వీలుంటుంది. ఈ మార్కెట్లను ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో అనుసంధానిస్తారు. ఏ రోజుకారోజు మార్కెట్లో పంటల రేట్లను అందులో పొందుపరుస్తారు. రైతులు తమకు గిట్టుబాటు ధర అందుతున్నప్పుడు తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలుంటుంది.

గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ‘మౌ’ గ్రామంలో ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. గ్రామాల్లో సామాజిక సామరస్యం, జాతీయ సమైక్యతపై ఆయన భావాలను తెలిపే పాంప్లేట్స్, పుస్తకాల పంపిణీ, బడుగు వర్గాల అభివృద్ధికి ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాల పరిచయం లాంటి పథకాలు చేపడతారు. ఇది ప్రత్యేక పథకం కాదు. ప్రచార ఉద్యమం మాత్రమే. పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం, గ్రామీణాభివృద్ధి, రైతుల అభివృద్ధికి ఈ ప్రచార ఉద్యమం చేపట్టారు.

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్’ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. పల్లెలల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలను నిరోధించేందుకు ఉద్దేశించిందే ఈ పథకం. ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లా కురుభత్ గ్రామంలో ప్రధాని ఈ పథకం ప్రారంభించారు. మూడేళ్ళలో 300 గ్రామాలను ఈ రూర్భన్ మిషన్ కింద అభివృద్ధి చేయాలన్నది కేంద్రం లక్ష్యం. పథకంలో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు ఎలక్ట్రానిక్ సేవలు అందించడం, డిజిటల్ అక్షరాస్యత, మొబైల్ హెల్త్ యూనిట్లు, విద్య, పారిశుధ్యం, తాగు నీటి సరఫరా, పట్టణాలతో గ్రామాల రహదారులను అనుసంధానం చేయడం, యువతలో నైపుణ్యాలపై శిక్షణ లాంటి అంశాలు ఉన్నాయి.

స్టార్టప్ లకు కేంద్రం ప్రోత్సాహం

కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
భారతదేశంలో స్టార్టప్ (అంకుర) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.10వేల కోట్ల మూలనిధిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత జీవిత బీమా సంస్థ (LIC) దీనికి సహ పెట్టుబడి దారు. స్టార్టప్ పరిశ్రమలకు 3యేళ్ళ పాటు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేస్తారు. మొదటి విడతగా రూ.2,500 కోట్ల మూలనిధిని ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో స్టార్టప్ లకు మూడో కేంద్రంగా భారత్ నిలిచింది. అమెరికా, బ్రిటన్ తర్వాత ఇక్కడే స్టార్టప్ లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి.