కేంద్ర ప్రభుత్వ పథకాలు (Part-2) – QUICK REVISION
( 2nd part )
11) ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన
- 2016 మే 1న ఉత్తరప్రదేశ్లోని బలియాలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభమైంది.
- దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ( పేద కుటుంబాలు ) మహిళల పేరుతో ఉచితంగా LPG (వంట గ్యాస్) కనెక్షన్లు ఇస్తారు.
- మొదటి మూడేళ్ళలో 5 కోట్ల కనెక్షన్లు ఇస్తారు.
12) హృదయ్
- HRIDAY (Heritage City Development and Augmentation Yojana
- వారసత్వ నగరాల సంరక్షణ కోసం 2015 జనవరి 21న ఈ పథకం ప్రారంభమైంది.
- మొదటి దశలో 12 నగరాలను ఎంపిక చేశారు.
ఇందులో తెలంగాణ నుంచి వరంగల్, ఏపీ నుంచి అమరావతి ఉన్నాయి. ఇవి కాకుండా... వారణాసి (ఉత్తరప్రదేశ్), పూరి (ఒడిశా), అమృత్సర్ (పంజాబ్), అజ్మీర్ (రాజస్థాన్), గయ (బీహార్), మధుర (ఉత్తరప్రదేశ్), కాంచీపురం (తమిళనాడు), వేలంగిణి (తమిళనాడు), బాదామీ (కర్ణాటక) తోపాటు ద్వారక (గుజరాత్).
13) ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన
- వ్యవసాయరంగం, గ్రామాలకు న...