తెలంగాణలో జరిగే జాతరలు
1) నాగోబాను ఎప్పుడు జరుపుకుంటారు?
జ: మాఘ శుద్ద పౌర్ణమి ( మూడురోజులు)
2) ఏయే రాష్ట్రాల నుంచి ప్రజలు నాగోబా జాతరకు హాజరవుతారు?
జ: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్
3) ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది ?
జ: సమ్మక్క సారక్క జాతర
4) తెలంగాణ కుంభమేళా అని దేనిని పిలుస్తారు?
జ: సమ్మక్క సారక్క జాతర
5) సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది?
జ: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో
6) సమ్మక్క సారక్క జాతర ఎన్నేళ్ళ కోసారి జరుగుతుంది?
జ: రెండేళ్ళకు
7) మేడారం జాతర ఎన్ని రోజులపాటు జరుగుతుంది?
జ: నాలుగు రోజులు
8) అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పిస్తారు?
జ: బంగారం(బెల్లం)
9) ఈ పండుగను రాష్ట్ర పండుగగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది ?
జ: 1996లో
10) ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుంది?
జ: మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలం నాగసానిపల్లిలో
11) నాగసాని పల్లిలో ఏ దేవాల...