Tuesday, July 17
Log In

భార‌త్‌లో మ‌తాలు

జైన మతం

భార‌త్‌లో మ‌తాలు
1) జైన మతానికి నిజమైన స్థాపకుడిగా ఎవరిని చెబుతారు ? జ: వర్ధమాన మహావీరుడు ( 24వ తీర్థంకరుడు) 2) జైనమతంలోని 24 తీర్థంకరులను ఏమని పిలుస్తారు ? జ: జినులు 3) మోక్షం పొందగానికి జైనమతస్థులు అనుసరించే సూత్రాలను ఏమంటారు ? జ: త్రిరత్నాలు (1) సరైన విశ్వాసం (2) సరైన జ్ఞానం (3) సరైన నడవడిక 4) జైన మతం ఎన్ని శాఖలుగా విడిపోయింది ? ఎవరెవరు నాయకత్వం వహించారు ? జ: దిగంబరులు (బద్రబాహు) , శ్వేతాంబరులు (స్థూల భద్ర) 5) దక్షిణ భారత దేశానికి వలస వచ్చిన వారిని ఏమంటారు ? జ: దిగంబరులు ( కర్ణాటకలోని శ్రావణ బెళగొళకి వచ్చారు ) 6) స్థూలభద్రుని నేతృత్వంలోని శ్వేతాంబరులు ఎక్కడ ఉండిపోయారు ? జ: మగధలో

బౌద్ధ మతం

భార‌త్‌లో మ‌తాలు
1) బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు ఎక్క జ్ఞానోదయం పొందాడు ? జ: గయ 2) బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని ( ధర్మ చక్ర పరివర్తనం) ఎక్కడ ఇచ్చాడు ? జ: సారనాధ్ లోని జింకల వనం 3) బుద్ధని మొదటి మహిళా శిష్యురాలు ఎవరు ? జ: గౌతమి 4) బౌద్ధమతాన్ని నిర్వచించడానికి ఏవి ఉపయోగపడతాయి ? జ: అష్టాంగ మార్గాలు 5) గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపేవి ఏవి? జ: జాతక కథలు 6) స్థూపం, విహారం, చైత్యం - ఇవి వేటికి చిహ్నాలు ? జ: స్థూపం - బుద్ధుని భౌతిక అవశేషాలపై నిర్మించినవి విహారం - బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు చైత్యం - సన్యాసుల ప్రార్థనా మందిరాలు 7) బుద్ధుడిని దేవుడిగా భావించిన శాఖ ఏది ? జ: మహాయానం 8) బుద్ధుడు మానవుడే అని చెబుతూ, అతను ఉపయోగించిన వస్తువులను, ఆయన బోధనలను పూజించినది ఏ శాఖ ? జ: హీనయానం 9) బౌద్ధ మతం ఎక్కడ రెండుగా చీలిపోయింది ? జ: కాల అశోకుడు వైశాలిలో నిర్వహించిన బౌద్ధ సంగీతిలో 10

హిందూ మతం

భార‌త్‌లో మ‌తాలు
1) భారత్ లో పెద్దది, పురాతన మతం ఏది ? జ: హిందూ మతం 2) హిందూ మతానికి మూలాలుగా వేటిని భావిస్తారు ? జ: వేదాలు 3) హిందూ మత ఆచాలను తెలిపేవి ఏంటి ? జ: వేదాలు 4) హిందూ మతంలో మానవ జీవితం నాలుగు విధాలుగా ఉంటుంది ? ఏంటి అవి ? జ: బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం 5) హిందూమతంలోని నాలుగు వర్గాలు ఏవి ? జ: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యలు , శూద్రులు