Monday, December 17

భార‌తదేశంలో శాస్త్రీయ నృత్యాలు

మోహినీ అట్టం

భార‌తదేశంలో శాస్త్రీయ నృత్యాలు
1) మోహినీ అట్టం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి ? జ: కేరళ 2) మోహిని అట్టం ఏ రాజు కాలంలో ఆవిర్భించింది ? జ: ట్రావెన్ కూర్ రాజైన మహారాజా స్వాతి తిరునాళ్ కాలంలో 3) మోహిని అట్టంలో గీతాల్లో చాలా వరకూ ఎవరు రచించారు ? జ: మహారాజా స్వాతి తిరునాళ్ 4) మోహినీ అట్టంను ఎంతమంది ప్రదర్శిస్తారు ? జ: ఒక్కరు మాత్రమే 5) కేరళలో దేవదాసీ సాంప్రదాయం ద్వారా వెలుగులోకి వచ్చిన నృత్యం ఏది ? జ: మోహిని అట్టం 6) మోహినీ అట్టం నాట్య ప్రస్తావన మొదట ఎవరి రచనల్లో కనిపిస్తుంది ? జ: నారాయణ నంబూద్రి 7) మోహినీ అట్టాన్ని పునరుద్ధరించినది ఎవరు ? జ: వళ్లత్తోల్ కవి 8) మోహినీ అట్టంలో ఏ నృత్యరీతులు ఉంటాయి ? జ: తాండవ, లాస్యం 9) ఈ నాట్యంలో నాట్యకత్తెలు ఏ దుస్తులను ధరిస్తారు ? జ: తెల్లటివి 10) మోహిని అట్టంలో ప్రసిద్ధులైన కళాకారిణి ఎవరు ? జ: కళ్యాణియమ్మ

కథాకళి నృత్యం

భార‌తదేశంలో శాస్త్రీయ నృత్యాలు
1) కథాకళి నృత్యం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది ? జ: కేరళ 2) కథాకళి ఎక్కడి నుంచి పుట్టిందని చెబుతారు ? జ: కుట్టియాట్యం కృష్ణ అట్టం అనే జానపద సంప్రదాయం 3) కథాకళిలో కథనం కంటే ఏది ఎక్కువగా ఉంటుంది ? జ: నాటకీయత 4) కథాకళి నాట్యాన్ని పునరుద్ధరించినది ఎవరు ? జ: వళ్ళత్తోల్ నారయాణన్ మీనన్ 5) కథాకళిలో ఏ అభినయానికి ప్రాధాన్యత ఉంటుంది ? జ: నేత్రాభినయనం 6) కేరళ రాజాస్థానాల్లో అవతరించిన కళగా దేన్ని చెబుతారు ? జ: కథాకళి

కూచిపూడి

భార‌తదేశంలో శాస్త్రీయ నృత్యాలు
1) కూచిపూడి ఏ రాష్ట్రంలో బాగా ప్రచారంలో ఉంది ? జ: ఆంధ్రప్రదేశ్ 2) కూచిపూడి ముందుగా ఏ గ్రామంలో రూపుదిద్దుకుంది ? జ: కుచేలపురం అగ్రహారంలో 3) కూచిపూడి నృత్య సంప్రదాయానికి ఆద్యులు ఎవరు ? జ: సిద్ధేంద్ర యోగి, తీర్థ నారాయణ 4) సిద్ధేంద్ర యోగి రచించిన పుస్తకం ఏది ? జ: భామా కలాపం 5) కూచిపూడి నృత్యాన్ని సాధారణంగా ఎంతమంది అభినయిస్తారు ? జ: ఒక్కరు మాత్రమే 6) ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడికి, తమిళనాడులోని ఏ నృత్య సంప్రదాయానికి పోలిక ఉందని భావిస్తారు ? జ: భాగవతి మేళ నాటకం 7) ఎవరి ద్వారా కూచిపూడి నృత్యానికి ఆధునిక అబ్బింది ? జ: వెంపటి చిన సత్యం 8) కూచిపూడి నృత్యంలో ప్రముఖులు ఎవరు ? జ: చింతా కృష్ణమూర్తి, రాధారెడ్డి - రాజా రెడ్డి

భరత నాట్యం

భార‌తదేశంలో శాస్త్రీయ నృత్యాలు
1) భరత నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది ? ఎవరి నాట్యశాస్త్ర సూత్రాల ఆధారంగా దీన్ని రూపొందించారు ? జ: తమిళనాడు, భరత మహర్షి 2) 19వ శతాబ్దంలో తంజావూరు నాట్యాచార్యులు చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం తదితరులు ప్రాచుర్యంలోకి తెచ్చిన నాట్యం ఏది ? జ: భరత నాట్యం 3) భరత నాట్యం ఏ సంగీత సంప్రదాయం ఆధారంగా ప్రదర్శించేవారు ? జ: కర్ణాటక సంగీత సంప్రదాయం 4) భరత నాట్యాన్ని మొదట ఎక్కడ ప్రదర్శించేవారు ? జ: దేవదాసీలు ఆలయాలు, గొప్పవారి ఇండ్లల్లో ప్రదర్శించేవారు 5) భరత నాట్యానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన కళాకారిణి ఎవరు ? జ: శ్రీమతి రుక్మిణీదేవి అరండీల్ 6) భరత నాట్యంలో ప్రసిద్ది పొందిన కళాకారిణి ఎవరు ? జ: టి.బాల సరస్వతి

భారతీయ శాస్త్రీయ నృత్యాలు

భార‌తదేశంలో శాస్త్రీయ నృత్యాలు
1) శాస్త్రీయ, జానపద నృత్యాలు ఎవరి నాట్య శాస్త్ర సూత్రాలపై ఆధారపడి రూపొందించబడినవి ? జ: భరతముని 2) భరత నాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ? జ: తమిళనాడు 3) దేశీయ నృత్యాల గురించి 11 వ శతాబ్దంలో వివరించిన వారెవరు ? జ: సోమేశ్వరుడు, భోజుడు 4) కాకతీయుల కాలంలో నృత్యరత్నావళిలో మార్గ-దేశీ నృత్య సంప్రదాయాలను వివరించినది ఎవరు ? జ: జాయప సేనాని 5) అభినయ దర్పణం, గీతా గోవిందం నాట్యగ్రంథాల రచయితలు ఎవరు ? జ: అభియన దర్పణం - నందికేశ్వరుడు, గీతగోవిందం - జయదేవుడు 6) నాట్యానికి ఏ నాలుగు ఉపాంగాలు అవసరమని భరతుడు తెలిపాడు ? జ: అంగిక, వాచక, ఆహార్య, సాత్వికములు