గుహలు, దేవాలయాలు
1) వాస్తు, చిత్ర, శిల్పకళలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
జ: మహారాష్ట్రలోని ఔరంగా బాద్ లో
2) ఎల్లోరాలో ఏయే వాస్తు కళలతో శిల్పాలను చెక్కారు ?
జ: బౌద్ధం, హిందూ మతంనకు చెందిన వాస్తు కళ
3) ఏకశిలా గుహతో నిర్మితమై ఉంది, బౌద్ధ కట్టడాలను పోలి ఉన్న ఆలయం ఏది ?
జ: కైలాస నాథ ఆలయం
4) ఏ మత ప్రభావం వల్ల భారతీయ వాస్తు నిర్మాణంలో రాతిని ఉపయోగించారు ?
జ: బౌద్ధ మతం
5) బుద్ధుడు చనిపోయాక అతని భౌతిక అవశేషాల మీద కట్టిన నిర్మాణాన్ని ఏమంటారు ?
జ: స్థూపం
6) అరేబియా సముద్రంలోని ఓ దీవిలో ఏనుగులాగా కనిపించే గుహలు ఏవి ?
జ: ఎలిఫెంటా గుహలు
7) ఎలిఫెంటా గుహల్లో ప్రసిద్ధి చెందిన శిల్పం ఏది ?
జ: మూడు శిరస్సులు కలిగిన శివుడు
8) దక్షిణ భారత్ లో గుహాలయాల్లో దీర్ఘ చతురస్రాకారంలో కనిపించేవి ఏవి ?
జ: మండపాలు
9) భారత్ లో దేవాలయాల వాస్తు కళ ఏ రాజుల కాలం నుంచి మొదలైంది ?
జ: గుప్తులు
10) దేవా...