Tuesday, September 25
Log In

విప‌త్తుల నిర్వ‌హ‌ణ

ప్రకృతి విపత్తులు (భూకంపాలు)

విప‌త్తుల నిర్వ‌హ‌ణ
1) భూకంపాలను అధ్యయనం చేసే సిస్మాలజీ. వీటిని నమోదు చేసే పరికరం ఏది ? జ) భూకంప లేఖిని (సిస్మోగ్రాఫ్) 2) భూకంపం విడుదల చేసే శక్తి తీవ్రతను కొలచే పరికరాన్ని రిక్టర్ స్కేలు అంటారు. దీన్ని ఎక్కడ రూపొందించారు ? జ) 1935లో అమెరికాలో 3) రిక్టర్ స్కేలుపై ఎన్ని పాయింట్లు దాటితే సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు ? జ: 7.5 4) రిక్టర్ స్కేలు విడుదల చేసే శక్తిని ఏ రసాయన పదార్థం విడుదల చేసే శక్తితో లెక్కిస్తారు ? జ: TNT ( Trinitro Tolin) 5) భూకంపం ప్రారంభమైన ప్రదేశం (నాభి)ని ఏమంటారు ? జ: హైపో సెంటర్ 6) భూకంపం సంభవించినప్పుడు తీసుకునే జాగ్రత్తలను ఏ పదాలతో సూచిస్తారు ? జ) Drop, Cover, Hold 7) మనదేశంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతం ఏది ? జ: శివాలిక్ హిమాలయాలు 8) దేశంలో తరుచుగా భూకంపాలు వచ్చే రాష్ట్రాలు ఏవి ? జ: అసోం, మహారాష్ట్ర, గుజరాత్ 8) మనదేశంలో భూకంప జోన్స్ ను ఎన్ని రకాలుగా విభజించారు ?

విపత్తు నిర్వహణ – నివారణ

విప‌త్తుల నిర్వ‌హ‌ణ
1) విపత్తు అనే పదాన్ని ఇంగ్లీషులో Disaster అంటారు. ఈ పదం ఎందులో నుంచి పుట్టింది? జ: Disastre అనే ఫ్రెంచి పదం నుంచి 2) Disastre అనే ఫ్రెంచి పదానికి అర్థం ఏంటి ? జ: చెడు (Dis) నక్షత్రం (aster) : చెడు నక్షత్రం నోట్: ఇటలీలో disastro అని, గ్రీకులో dusastro 3) ‘‘సమాజపు సాధారణ నిర్మాణానికి మరియు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా మరియు తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’’ అని నిర్వచించింది ఎవరు ? జ: ఐక్యరాజ్య సమితి (UNO) 4) విపత్తు ఒక భయంకర పరిస్థితి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. మరియు పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి అవసరమయ్యే అత్యవసర పరిణామమే విపత్తు’’ అన్న నిర్వచనం ఎవరిది ? జ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 5) 1999-2000ల మధ్య ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో విపత్తుల మరణాల శాతం ఎంత ? జ: 4 శాతం