Monday, December 17

ప‌ర్యావరణ అంశాలు

పర్యావరణ అంశాలు- కాలుష్యాలు

ప‌ర్యావరణ అంశాలు
1) పర్యావరణ క్షీణతకు ప్రధాన కారణం ఏమని చెప్పొచ్చు ? జ: కాలుష్యం 2) కాలుష్యం అనేది నాలుగు రకాలు అవి ఏంటి ? జ: వాయు, జలం, భూమి, ధ్వని కాలుష్యం 3) భూవాతావరణంలో అత్యధిక శాతం ఉన్న వాయువు అది. ప్రాణకోటికి ఆధారమే గానీ జంతు జీవితంలో దాని పాత్ర లేదు. ఆ వాయువు పేరేంటి ? జ: నైట్రోజన్ 4) భూమ్మీద కాలుష్య కారక వాయువుల్లో ఇదీ ఒకటి. దీనికి రంగు, రుచి,వాసన ఉండదు. వాహనా వదిలే పొగల్లో ఉంటుంది. ఆ వాయువు పేరేంటి ? జ: కార్బన్ మోనాక్సైడ్ 5) ఈ వాయువు ట్రోపోస్పియర్ లోనే ఉంటుంది. మానవులు, జంతువుల శ్వాసక్రియ తర్వాత విడుదలవుతుంది ? జ: కార్భన్ డైయాక్సైడ్ 6) భూమికి 20-25 కిమీల ఎత్తులో ఉన్న ఈ పొర.. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను (Ultraviolet rays) ను నిలిపివేస్తుంది. ఈ పొరను ఏమంటారు ? జ: ఓజోన్ పొర 7) భూమ్మీద వాహనాలు, పారిశ్రామిక పొగ కారణంగా ఓజోన్ పొరకు అంటార్కిటా ప్రాంతంలో రంధ్రం పడింది. దీన్ని 1