Monday, January 25
Shadow

జనరల్ సైన్స్ – రసాయన శాస్త్రం

రసాయనిక చర్యల్లో రకాలు, నీరు సంఘటిత మూలకాలు

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) రెండు లేదా అంతకంటేఎక్కువ పదార్దాలు కలిసి ఒకే పదార్దంగా ఏర్పడటన్నిఏమంటారు? జ) రసాయన సంయోగం 2) ఒక పదార్దం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్దాలను ఏర్పరచడాన్ని ఏమంటారు? జ) రసాయన వియోగం 3) రెండు పదార్దాలు వాటి మూలకాలు లేదా ప్రాతిపదికలను పరస్పరం మార్చుకునే చర్యను ఏమంటారు? జ) ద్వంద్వ వియోగం 4) నీరు రసాయనిక నామం ఏది? జ) హైడ్రోజన్ మోనాక్సైడ్ 5) విద్యుత్తును ప్రవహింపజేస్తూ నీటిని దాని సంఘటిత మూలకాలుగా విడగొట్టడాన్ని ఏమంటారు? జ) విద్యుత్ విశ్లేషణం 6) సబ్బుతో నురగని ఇవ్వని జలాన్ని ఏమంటారు? జ) కఠిన జలం 7) ఏది నీటిలో ఉన్న హానికరమైన బాక్టీరియాను నాశనం చేస్తుంది ? జ) క్లోరిన్ 8) నీటిని ఏమని పిలుస్తారు ? జ) యూనివర్సల్ ద్రావణి 9) ఘన పరిమాణాత్మకంగా గాలిలో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? జ) 5వ వంతు  ...

పదార్ధాలపై వేడిమి చర్య, సంకేతాలు, ఫార్ములాలు, సమీకరణాలు

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) పదార్దాలను వేడి చేసినపుడు ఘన రూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు? జ) ఉత్పతనం 2) మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తీసుకొస్తే ప్రకాశవంతంగా మండే వాయువు ఏది? జ) ఆక్సిజన్ 3) పొటాషియం నైట్రేట్ ను వేడి చేస్తే ఏది విడుదలవుతుంది? జ) ఆక్సిజన్ 4) పొటాషియం లాటిన్ పేరు ఏంటి? జ) కాలియం 5) CO2 వాయువు యొక్క అణుభారం ఎంత? జ) 44 6) ఓజోన్ ఫార్ములా ఏది? జ) O3. 7) సోడియం కార్బోనేట్ ను ఏమంటారు? జ) వాషింగ్ సోడా 8) ఒక పరమాణువు లేదా పరమాణువుల సమూహం ఎలక్ట్రాన్ ను కోల్పోయినపుడు గానీ పొందినపుడు గానీ ఏర్పడిన దాన్ని ఏమంటారు? జ) రాడికల్ లేదా అయాన్ 9) అణుభారాన్ని గ్రాముల్లో సూచిస్తే దాన్ని ఏమంటారు? జ) గ్రాము అణుభారం 10) ఎలక్ట్రాన్ ను కోల్పోవడం వల్ల ఏర్పడిన ప్రాతిపదికను ఏమంటారు? జ) ధనాత్మక ప్రాతిపదిక లేదా క్షార ప్రాతిపదిక...

లోహ సంగ్రహణ శాస్త్రం

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) మలినాలతో కూడిన ప్రకృతిలో లభించే సమ్మేళనాలను ఏమంటారు? జ) ఖనిజాలు. 2) ధాతువును గాలిలేకుండా బాగా వేడిచేసి బాష్పశీల మలినాలను తొలగించడాన్ని ఏమంటారు? జ) భస్మీకరణం 3) రక్తంలోని ఎందులో ఇనుము ఘటక పదార్దముగా ఉంటుంది? జ) హిమోగ్లోబిన్ 4) దుక్క ఇనుము లేదా పోత ఇనుములో కార్బన్ ఎంత శాతం ఉంటుంది? జ) 3.4 శాతం 5) గాల్వనైజింగ్ పద్దతిలో ఇనుముపై దేన్ని పూతగా పూస్తారు? జ) జింక్...

రసాయన చర్యల వేగాలు – రసాయన సమతాస్థితి

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) లిప్తపాటు నుంచి కొన్ని సెకన్లలో జరిగే చర్యలను ఏమంటారు? జ) అతివేగ చర్యలు. 2) నిర్దిష్ట లేదా ప్రమాణకాలంలో గాఢతలోని మార్పును ఏమంటారు? జ) చర్యావేగం 3) నిర్దిష్ట లేదా ప్రమాణకాలంలో క్రియాజనకాల గాఢతలోని తగ్గుదల లేదా క్రియాజన్యాల గాఢతలోని పెరుగుదలని ఏమంటారు? జ) రేటు 4) రేటుకి ప్రమాణాలుఏమిటి? జ)మోల్స్, లీటర్, సెకను...

క్షారమృతిక లోహాలు, శక్తి మార్పులు

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) గ్రూప్ 2A మూలకాలను ఏమంటారు? జ) మృత్తిక లోహాలు 2) రేడియో ధార్మిక స్వభావమున్న క్షార మృత్తిక లోహం ఏది? జ) రేడియం 3) ఒకరసాయన చర్యలో ఉష్ణము గ్రహించబడితే దానిని ఏమంటారు? జ) ఉష్ణగ్రాహక చర్య 4) పదార్దం యొక్క ఒక గ్రాము అణుభారాన్ని ఏమంటారు? జ) మోల్ 5) ప్రకృతిసిద్దంగా సంభవించే ఉష్ణగ్రాహక చర్యకు ఉదాహరణ ఏది? జ) కిరణజన్య సంయోగక్రియ 6) రసాయన చర్యలో కొత్త మార్పులేవీ లేకుండా చర్యావేగాన్ని మార్పు చేసే పదార్ధాన్ని ఏమంటారు? జ) ఉత్ప్రేరకం 7) గ్రామ్ పరమాణుభారం లేదా అణుభారాన్ని ఏమంటారు? జ) మోల్ 8) ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా అర్దవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్ని ఏమంటారు? జ) రసాయన సమీకరణం...

మూలకాల వర్గీకరణ

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) మూలకాల వర్గీకరణను మొదట చేపట్టినది ఎవరు? జ) 1817 డాబర్నీర్ 2) అష్టక సిద్దాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జ) జాన్ న్యూలాండ్స్ 3) పరమాణు ధర్మం మూలకాల వర్గీకరణకు ఆధారం కావాలని ఎవరు సూచించారు? జ) మెండలీఫ్ 4) జడ వాయువులు ఏవి? జ) హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ 5) అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది? జ) ఫ్లోరిన్ 6) పరమాణు పరిమాణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? జ) ఆంగ్ స్ట్రామ్...

రసాయన బంధం

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) అణువులోని పరమాణువుల మధ్య ఆకర్షణ బలాన్ని ఏమంటారు? జ) రసాయన బంధం 2) అన్నిటి కంటే బహిర్గత కక్ష్యలోని ఎలక్ట్రానుల సంఖ్యను ఏమంటారు? జ) వేలన్సీ ఎలక్ట్రానులు 3) అయానిక బంధం దేనివల్ల ఏర్పడిన బంధం? జ) ఎలక్ట్రాన్ బదిలీ 4) విరుద్ద విద్యుదావేశం గల అయానుల మధ్య ఉండే స్థిర విద్యుత్ ఆకర్షణ బలాన్ని ఏమంటారు? జ) అయానిక బంధం 5) రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం వల్ల ఏ బంధం ఏర్పడుతుంది ? జ) సమయోజనీయ బంధం 6) అధృవ అణువులోని ఆకర్షణలను ఏమంటారు? జ) వాండర్వాల్ బలాలు 7) సంయోజనీయ పదార్దాలు ఎందులో కరుగుతాయి? జ) బెంజీన్, క్లోరో ఫామ్, కార్బన్ టెట్రాక్లోరైన్ 8) రెండు పరమాణువుల మధ్య గల దూరాన్ని ఏమంటారు? జ) బంధ ధైర్ఘ్యం 9) నీటి అణువు ఏ ఆకృతిని కలిగి ఉంటుంది? జ) V...

పరమాణు నిర్మాణం

జనరల్ సైన్స్ - రసాయన శాస్త్రం
1) పదార్దం అతి సూక్ష్మకణాలైన అణు, పరమాణువుల సమ్మిళితమని ప్రతిపాదించింది ఎవరు? జ: కణాడుడు 2) పదార్దం అతి సూక్ష్మమైన పరమాణువులు కలిగి ఉంటుందని ప్రతిపాదించినది ఎవరు? జ: డెమెక్రటిస్ 3) ఉత్సర్గ నాళిక ప్రయోగాల ద్వారా పరమాణు నిర్మాణాన్ని, పరమాణువులోని మౌలిక కణాలను గురించి వివరించింది ఎవరు? జ: విలియం క్రూక్స్ 4) కాధోడ్, రుణ ద్రువ కిరణాలను కనిపెట్టినది ఎవరు? జ: జె.జె.ధామ్సన్ 5) ధన ధృవ కిరణాలను కనిపెట్టినది ఎవరు? జ: గోల్డ్ స్టెయిన్ 6) ధన ధృవ కిరణాల్లో అతి సూక్ష్మ కణాన్ని ఏమంటారు? జ: ప్రోటాను 7) పరమాణులోని కణాలు ఏవి? జ: ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ 8) ప్రోటాన్ కనుగొన్నది ఎవరు ? దీని సంకేతం ఏది? జ: గోల్ట్ స్టెయిన్ దీని సంకేతము P. 9) ఎలక్ట్రాన్ ను కనుగొన్నది ఎవరు ? దీని సంకేతం ఏది? జ: జె.జె.ధామ్సన్. దీని సంకేతము E 10) న్యూట్రాన్ ను కనుగొన్నది ఎవరు ? దీని సంకేతమేది? జ: జేమ్స్ ...