1) నక్షత్రాల సముదాయాన్ని ఏమిని అంటారు?
జ: గెలాక్సీ
2) సూర్యుడు ఏ గెలాక్సీకి చెందిన నక్షత్రం ?
జ: పాలపుంత
3) సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్ అన్నింటిని కలిపి ఏమంటారు ?
జ: సూర్యకుటుంబం
4) సౌర కుటుంబంలో భూమి సూర్యుడి నుంచి ఎన్నో గ్రహం ?
జ: మూడోది
5) గ్రహాల్లో అన్నిటి కన్నా పెద్దది, చిన్నది ఏవి ?
జ: పెద్దతి: గురుగ్రహం, చిన్నది : బుధుడు
6) ఏ గ్రహం సూర్యుడికి కనిష్ట దూరంలో ఉంది ?
జ: బుధ గ్రహం
7) అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది?
జ: శని
8) చిన్న చిన్న నక్షత్ర సముదాయాలను ఏమంటారు?
జ: నక్షత్ర మండలాలు
9) హేలీ తోక చుక్క ఎన్నేళ్ళకోసారి వస్తుంది?
జ: 76 యేళ్ళు
10) సూర్యుడు భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారు ?
జ: ఖగోళ ప్రమాణం
11) సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత ?
జ: 8 నిమిషాల 20 సెకన్లు (500 సెకన్లు)
12) చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే టైమ్ ఎంత ?
...