Thursday, June 27

Latest Notifications

FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వీళ్ళే !

FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వీళ్ళే !

Latest News, Latest Notifications
ఫారెస్ట్ బీట్ అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడిచింది. 2017 ఆగస్టు 15న దీనికి సంబంధించి 48/2017 నోటిఫికేషన్ ను విడుదల చేసింది TSPSC. దీనికి 29 అక్టోబర్ 2017 నాడు రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జులై, 2018 లో ఫిట్నెస్ టెస్టులు నిర్వహించారు. అందులో క్వాలిఫై అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లుగా ఎన్నికైన వారి జాబితాను చివరకు ఇవాళ www.tspsc.gov.in వెబ్ సైట్ లో ఉంచారు. tspsc వెబ్ నోట్ కోసం క్లిక్ చేయండి fbo-web-note పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి FBO-SELECT-RESULT
మార్చికల్లా పోలీస్ నియామకాలు : వచ్చే నెలలోనే మెయిన్స్ ఎగ్జామ్ ?

మార్చికల్లా పోలీస్ నియామకాలు : వచ్చే నెలలోనే మెయిన్స్ ఎగ్జామ్ ?

Latest News, Latest Notifications
రాష్ట్రంలో పోలీస్ నియామకాల ప్రక్రియను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే లోపే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలోపే ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేసి ఆ తర్వాత నెలాఖరులోగా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం అవసరమైతే అదనపు సిబ్బందిని ఉపయోగించుకోవాలని ప్లాన్ లో ఉంది బోర్డు. రాష్ట్రంలో మొత్తం 18 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి 2018 మే నెలలో రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమిక పరీక్షలో 3.77 లక్షల మంది అర్హత సాధించారు. ఎస్సై ఎగ్జామ్ లో 6 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారంటూ కోర్టులో కేసు నడిచింది. నియామకాలపై సింగిల్ బెంచ్ జడ్జి స్టే ఇవ్వడంతో డిసెంబర్ 17 నుంచి మొదలు కావాల్సిన ఫిట్నెస్ టెస్టుల ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వ
గ్రూప్ 2పై హైకోర్టులో వాదనలు : ఈనెల 5కి వాయిదా

గ్రూప్ 2పై హైకోర్టులో వాదనలు : ఈనెల 5కి వాయిదా

Latest News, Latest Notifications
TSPSC గ్రూప్ - 2 ఎగ్జామ్స్ కి సంబంధించి హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. రాత పరీక్షలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడం వల్లే తప్పులు చేశారని అభ్యర్థులు హైకోర్టుకి విన్నవించారు. డబుల్ బబ్లింగ్ చేసిన వారిని అనుమతించరాదంటూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. గ్రూప్ - 2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్, వైట్ నర్ ఉపయోగించిన అభ్యర్థులను ఎంపిక జాబితా నుంచి తొలగించాలని 2018 అక్టోబర్ 12న సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు చెప్పారు. అభ్యర్థుల తరపున నలుగురు సీనియర్ న్యాయవాదులు తమ వాదన వినిపించారు. పార్ట్ - ఎలో వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమే అభ్యర్థులు పొరపాట్లు చేశారని అన్నారు. అలాగే పార్ట్ -బిలో ఆన్సర్లు దిద్దినా వైట్ నర్ ఉపయోగించిన జవాబు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. ఇన్విజిలేటర్లకు TSPSC సరైన అవగాహన కల్పించలేకపోవడంతోనే ఈ తప్పులు దొర్లాయని అ
ఫిబ్రవరి 11 నుంచి పోలీస్ ఈవెంట్స్

ఫిబ్రవరి 11 నుంచి పోలీస్ ఈవెంట్స్

Latest News, Latest Notifications
పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి. ఫిబ్రవరి 11 నుంచి PMT/PET నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. టెస్టులు నిర్వహించేందుకు గతంలో ప్రకటించిన వేదికల్లో రెండింటిని రద్దు చేశారు. హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంతో పాటు KU గ్రౌండ్స్, వరంగల్ లో ఈసారి ఈవెంట్స్ నిర్వహించడం లేదు. మారిన షెడ్యూల్ తో రివైజ్డ్ అడ్మిట్ కార్డులు, ఇంటిమేషన్ లెటర్లను తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలని TSLPRB అధికారులు అభ్యర్థులకు సూచించారు. హైదరాబాద్ లో పోలీస్ ఈవెంట్స్ ను మూడు మైదానాల్లో నిర్వహిస్తారు. ఇక పాత జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున గ్రౌండ్స్ ని ఎంపిక చేశారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ల్లో వీటిని నిర్వహిస్తారు. శారీరక దారుఢ్య పరీక్షలు 35 నుంచి 40 రోజుల్లోపు అంటే... మార్
RRB లో 14వేల జూనియర్ ఇంజనీర్ పోస్టులు

RRB లో 14వేల జూనియర్ ఇంజనీర్ పోస్టులు

Latest News, Latest Notifications
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుల్లో మరో భారీ రిక్రూట్ మెంట్ కి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేల్లో ఖాళీగా ఉన్న 14,033 జూనియర్ ఇంజనీర్ తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. RRB JE రిక్రూట్ మెంట్ కోసం సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి మంచి అవకాశం. ఇందులో జూనియర్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ (ఐటీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ : 13,034 పోస్టులు జూనియర్ ఇంజనీర్ (ఐటీ) : 49 పోస్టులు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : 456 పోస్టులు కెమికల్ అండ్ మెటలర్జికలల్ అసిస్టెంట్ : 494 పోస్టులు వయోపరిమితి: 18 నుంచి 33యేళ్ళ లోపు (01.01.2019 నాటికి ) ఆన్ లైన్ రిజిష్ట్రేషన్లు : 2019 జనవరి 2 నుంచి 31 వరకూ విద్యార్హతలు: 1) జూనియర్ ఇంజనీర్: డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి
పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

పంచాయతీ సెక్రటరీ నియామకాలపై హైకోర్టు సీరియస్

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో తప్పులు దొర్లడంపై హైకోర్టు సీరియస్ అయింది. స్పోర్ట్స్, వికలాంగుల కోటాని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్, వికలాంగుల వాటా సరిచేసిన తర్వాత మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ సెక్రటరీ రిక్రూట్ మెంట్ పై ఉన్న స్టేని ఎత్తివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులతో పాటు 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో ఇవ్వడంపైనా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తప్పులు జరిగినప్పుడు ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేయాలని చూస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
గ్రూప్ – 1, గ్రూప్ 3 ప్రకటనలకు సిద్ధం !

గ్రూప్ – 1, గ్రూప్ 3 ప్రకటనలకు సిద్ధం !

Latest News, Latest Notifications
రెండోసారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా గ్రూప్ -1 ఉద్యోగ ప్రకటన అతి త్వరలోనే వెల్లడి కానుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 150 పోస్టులతో నోటిఫికేషన్ వేసేందుకు tspsc రంగం సిద్దం చేసింది. ప్రభుత్వం నుంచి కొన్ని సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. వాటిని ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన విడుదల చేయాలని tspsc అధికారులు భావిస్తున్నారు. గతంలోనే tspsc గ్రూప్ - 1 నోటిఫికేషన్ వెల్లడించాలని అనుకుంది. అయితే అప్పట్లో కొత్త జోన్స్ ప్రకటించడంతో తాత్కాలికంగా నోటిఫికేషన్ విడుదలను పక్కనబెట్టారు. గ్రూప్ 1 పోస్టులను కొత్త జోన్ల వారీగా విభజించే ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. దాంతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. గ్రూప్ -1 నోటిఫికేషన్ లో ఏ పోస్టులు ఉన్నాయి ? DSP - 42 డిప్యూటీ కలెక్టర్లు - 15 ఇవి కాకుండ
నెలాఖరులో గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

నెలాఖరులో గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

Latest News, Latest Notifications
గ్రూప్ - 2 ఇంటర్వ్యూలను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు TSPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే 1:3 నిష్పత్తిలో జాబితాని ప్రకటించిన కమిషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగాలకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్వీకరిస్తోంది. ఇది పూర్తయ్యాక పోస్టులు, వాటి అర్హతల ప్రకారం ఇంటర్వ్యూకి 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఈ మెరిట్ జాబితా విడుదలయ్యాక గ్రూప్ -2 పోస్టులకు TSPSC ఈ నెలాఖరులో ఇంటర్వ్యూలు మొదలుపెట్టనుంది. రెండు పోస్టులకు ఇతర టెస్టులుగ్రూప్ -2 పోస్టుల భర్తీలో 1) ఎక్సైజ్ ఇన్సెపెక్టర్ (2) ASO పోస్టులకు ఇతర పరీక్షలను కూడా TSPSC నిర్వహించనుంది. Excise Inspector పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అలాగే ASO పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ప్రొఫిషియెన్సీ టెస్టు ఉంటుంది.