Monday, September 24
Log In

Latest Notifications

60వేల రైల్వే ఉద్యోగాలు

60వేల రైల్వే ఉద్యోగాలు

Latest News, Latest Notifications
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్ ఉద్యోగాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 26,502 ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఇప్పుడీ సంఖ్య 60 వేలకు చేరింది. ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఉద్యోగాల్లో భాగంగా మొదటి విడత ఈ నెల 9న జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం దేశమంతటా 47.56 లక్షల మంది అప్లయ్ చేశారు. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెంచడంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు ఎగ్జామ్ రాసుకునే ఛాన్సుంది. ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రకటన వేసిన తర్వాత వివిధ రైల్వే జోన్లలో వచ్చిన ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. ఈనెల 9న జరిగే ఎగ్జామ్ కోసం జులై 26నే ఆన్ లైన్ లింక్ అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు 4 రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ ను
వాటర్ వర్క్స్ లో 692 పోస్టులకు అనుమతి

వాటర్ వర్క్స్ లో 692 పోస్టులకు అనుమతి

Latest News, Latest Notifications
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కింద... హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ( HMWSSB) లో 692 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. పోస్టుల వివరాలు: 1) జనరల్ పర్సస్ ఎంప్లాయీ (సీవరేజ్ ) 200 2) జనరల్ పర్సస్ ఎంప్లాయీ (వాటర్ సప్లై) 200 3) టెక్నీషియన్ గ్రేడ్ -2 (వాటర్ సప్లై) (సివిల్) - 100 4) మేనేజర్ (E) - 80 5) సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ ( P&A) - 20 6) అసిస్టెంట్ ( P&A) 20 7) అసిస్టెంట్ ( F&A) - 15 8) ఆఫీసర్ (P&A) - 09 9) సీనియర్ ఆఫీసర్ (P&A) - 08 10) డైరక్టర్ (E) - స్కేల్ 2 - 02 11) చీఫ్ జనరల్ మేనేజర్ (E) - 02 12) జనరల్ మేనేజర్ (E)- 10 13) చీఫ్ జనరల్ మేనేజర్ ( P&A) - 01 14) డిప్యూటీ జనరల్ మేనేజర్ (E) - 20 15)డిప్యూటీ జనరల్ మేనేజర్(QAT) - 02 16) డిప్యూటీ జనరల్ మేనేజర్ (P&A) - 03 మొత్తం 692 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మరో 1917 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు

మరో 1917 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు

Latest News, Latest Notifications
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మరో 1917 పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటనలు జారీ చేస్తామని TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. 2016-17 సం.నికి సంబంధించి TSPSC వార్షిక నివేదికను గవర్నర్ నరరసింహన్ కు అందించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టులకు సంబంధించి వివరాలు తెలిపారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పోస్టులన్నింటికీ ఈ డిసెంబర్ లోగా నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మొత్తం 40,921 పోస్టల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా మొత్తం 30,204 పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇచ్చామన్నారు. వీటిల్లో 12,749 పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. మరో 20,360 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ దశలో ఉందని ఘంటా చక్రపాణి వివరించారు.
281 జేఎల్ పోస్టులకు ఈనెల 31న నోటిఫికేషన్

281 జేఎల్ పోస్టులకు ఈనెల 31న నోటిఫికేషన్

Latest News, Latest Notifications
గురుకుల జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 281 జూనియర్ లెక్చరర్ పోస్టులను తెలంగాణ గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 31న అధికారికంగా ప్రకటన వెలువడుతోంది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 8 వరకూ Online లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక 3 విధాలుగా ఉంటుంది పేపర్ - 1(100మార్కులు) : జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ సామర్థ్యం పేపర్ -2 (100మార్కులు): సంబంధిత సబ్జెక్టులో బోధనా పద్దతులు పేపర్ -3(100మార్కులు): సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం ప్రాక్టికల్ డెమో - 25 మార్కులు ఈ నోటిఫికేషన్ తర్వాత గురుకుల డిగ్రీ కాలేజీల్లోని 500 డిగ్రీ లెక్చరర్ పోస్టుల ప్రకటన కూడా వెలువడనుంది. యూజీసీ నెట్ ఫలితాల తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. గురుకుల బోర్డుకి అప్పగించిన PGT, TGT పోస్టులకు 2 ప్రకటనలకు ప్రస్తుతం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను అక
పోలీస్ ఉద్యోగాల్లో ఒక్క పోస్టుకి 40 మంది పోటీ

పోలీస్ ఉద్యోగాల్లో ఒక్క పోస్టుకి 40 మంది పోటీ

Latest News, Latest Notifications
రాష్ట్ర పోలీస్ శాఖ భర్తీ చేసే ఉద్యోగాల్లో ఒక్క కొలువుకి 40 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 18 వేల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది పోలీస్ శాఖ. ఇందులో సబ్ ఇన్సెపెక్టర్, కానిస్టేబుల్, ఫైర్, జైళ్ళ శాఖ, ఫింగర్ ప్రింట్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 7,19,840 మంది అభ్యర్థులు వీటికి అప్లయ్ చేసుకున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వర్గాలు తెలిపాయి. దాంతో ఒక్కో ఉద్యోగానికి 40 మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు - నిరుద్యోగ అభ్యర్థుల నుంచి బోర్డుకి దాదాపు 50 కోట్ల దాకా ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు : 30 సెప్టెంబర్ 2018 నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎగ్జామ్ జరుగుతుంది. సబ్ ఇన్సెపెక్టర్ కేడర్ ఉద్యోగాలకు: 26 ఆగస్టు 2018 నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎగ్జామ్ నిర్వహిస్తారు SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీర
93 పోస్టులకు TSPSC ప్రకటనలు

93 పోస్టులకు TSPSC ప్రకటనలు

Latest News, Latest Notifications
మున్సిపల్ శాఖ, డెయిరీ సమాఖ్యల్లో 93 ఉద్యోగాల భర్తీకి TSPSC మూడు ప్రకటనలు రిలీజ్ చేసింది. పురపాలక శాఖలో శానిటరీ ఇన్సెపెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్స్, డెయిర్ సమాఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: శానిటరీ ఇన్సెపెక్టర్లు - 35 పోస్టులు దరఖాస్తులు చేసుకోడానికి గడువు: ఈనెల 31 నుంచి ఆగస్టు 30 వరకూ హెల్త్ అసిస్టెంట్స్ - 50 పోస్టులు దరఖాస్తులు చేసుకోడానికి గడువు: ఆగస్టు 3 నుంచి 22 వరకూ ఫీల్డ్ అసిస్టెంట్స్ : 08 పోస్టులు దరఖాస్తులు చేసుకోడానికి గడువు: ఆగస్టు 3 నుంచి 22 వరకూ పూర్తి వివరాలకు :https://tspsc.gov.in/TSPSCWEB0508/Directrecruitment.jsp
కొత్త కార్యదర్శుల నియామకం ఎలా ఉండొచ్చు ?

కొత్త కార్యదర్శుల నియామకం ఎలా ఉండొచ్చు ?

Latest News, Latest Notifications
రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో ఖాళీగా ఉన్న 9200 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  అయితే  ఈ రిక్రూట్ మెంట్ కింద తీసుకునే వారికి మూడేళ్ళ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.  ఈ కాలంలో వారి పనితీరును బట్టి రెగ్యులరైజ్ చేస్తారు.  అందుకోసం మహారాష్ట్ర పద్దతిని అనుసరించాలని అధికారులు భావిస్తున్నారు.  అక్కడ మూడేళ్ళ పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకుంటారు.  ఆ తర్వాత రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తారు.  అదే పద్దతిని తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించే అవకాశాలున్నాయి. అదేవిధంగా మూడేళ్ళ పాటు పంచాయతీ కార్యదర్శికి వేతనం కింద నెలకు రూ.15వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారు. దాంతో గ్రామపంచాయతీ పరిధిలో మాత్రమే పనిచేసే ఉద్యోగికి 15వేలు మంచి వేతనమే అని కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం మూడేళ్ళ దాకా ఆగకుండా శాశ్వత ప్రాతిప
అకౌంటెంట్ పరీక్షకు కామర్స్ అక్కర్లేదా ?

అకౌంటెంట్ పరీక్షకు కామర్స్ అక్కర్లేదా ?

Latest News, Latest Notifications
ఎక్సైజ్ శాఖలోని బేవరేజ్ కార్పొరేషన్ లో 78 ఉద్యోగాలకు TSPSC ఇచ్చిన నోటిఫికేషన్ కామర్స్ విద్యార్థులను గందరగోళంలో పడేసింది. ఈ పోస్టులకు బీకాం అభ్యర్థులకు మాత్రమే అర్హత నిర్ణయించినప్పటికీ... రాత పరీక్షలో కామర్స్ సబ్జెక్టును ఇవ్వలేదు. దాంతో బీకాం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పేపర్ -1 లో జనరల్ నాలెడ్జ్, పేపర్ - 2 లో సెక్రటరియేట్ ఎబిలిటీస్ లో ఎగ్జామ్స్ ఉంటాయని TSPSC పేర్కొంది. అయితే గతంలో TSPSC నిర్వహించిన జలమండలి ఉద్యోగాలతో పాటు విద్యుత్ శాఖలో SPDCL, జెన్ కో తో పాటు BSNL సంస్థలు నిర్వహించిన అకౌంటెంట్ పోస్టుల నియామకంలో జనరల్ స్టడీస్ తో పాటు కామర్స్ ను ఓ సబ్జెక్ట్ గా రాత పరీక్షలో ఇచ్చారు. అలాంటిది బేవరేజ్ కార్పోరేషన్ లో 13 అసిస్టెంట్ అకౌంటెంట్ (AAO), 55 అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్స్ ( ASO) పోస్టుల భర్తీలో వాణిజ్య శాస్త్రంను ఒక పేపరుగా కేటాయించాలని కోరుతున్నారు. తమ విజ్ఞప్తిని TSPSC అధికారులు
రెవెన్యూ శాఖలో 316 పోస్టులు

రెవెన్యూ శాఖలో 316 పోస్టులు

Latest News, Latest Notifications
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 316 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఖాళీల వివరాలు: 2 - డిప్యూటీ కలెక్టర్లు 26 -తహసిల్దార్లు 152 - గిర్దావర్ పోస్టులతో పాటు, 23 - జూనియర్ అసిస్టెంట్స్ 56 - ఆఫీస్ సబార్డినేట్ తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (tspsc) ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు (200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు) (మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి ) https://telanganaexams.com/mockmaterial/
9200 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ

9200 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ

Latest News, Latest Notifications
రాష్ట్రంలో కొత్తగా పంచాయతీలు ఏర్పడటంతో ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9200 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. వారం లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేయాలని కోరారు.  కొత్తగా నియమించే పంచాయతీ కార్యదర్సులకు 3ఏళ్ల వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ల పనితీరు బట్టి regularise చేయాలని సీఎం ఆదేశించారు. విధులు నిర్వహించలేని వారిని రెగ్యులర్ చేయకుండా చూడాలన్నారు. ప్రొబేషన్ టైం లో వారికి రూ.15వేలు జీతం చెల్లిస్తారు. పంచాయతీ కార్యదర్శి ల నియామకం లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో నియామకాలు ఉంటాయి.  రాష్ట్రంలో మొత్తం 12వేల751 గ్రామ పంచాయితీ లు ఉన్నాయి. వీటిల్లో 3వేల562 మంది కార్యదర్సులు పనిచేస్తున్నారు. నియామక ప్రక