Thursday, October 1

Latest Notifications

RRB 111JUMBO -11,100 ప్రశ్నలు @Rs.600

RRB 111JUMBO -11,100 ప్రశ్నలు @Rs.600

Breaking News, Current Affairs Today, Latest News, Latest Notifications, Viewers
2020 డిసెంబర్ 15 నుంచి స్టార్టయ్యే RRB NTPC, RRB GROUP D పరీక్షల కోసం Telangana Exams & Andhra Exams తరపున Masters Academic and Digital Education (MADE) ఆధ్వర్యంలో 11 వేల 100 ప్రశ్నలతో 111 JUMBO ప్యాకేజీని నిర్వహిస్తున్నాం.  పూర్తిగా RRB పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి... మెటీరియల్ తయారు చేయబడుతోంది.   RRB 111 JUMBO PKG 1 YEAR SUBSCRIPTION + UNLIMITED ATTEMPTS మొత్తం ప్రశ్నలు:  11100 ప్రశ్నలు Exams Start అయ్యాయి ఇందులో .... 340 జనరల్ అవేర్ నెస్ టెస్టులు : 8500 ప్రశ్నలు (జనరల్ అవేర్ నెస్ + GK + బేసిక్ కంప్యూటర్ + అర్థమెటిక్ + రీజనింగ్ ) 24 కరెంట్ అఫైర్స్ Tests     = 600 ప్రశ్నలు ( మే 2020 నుంచి నవంబర్ 30 వరకూ 6 నెలల కాలానికి. వారానికి నాలుగు చొప్పున 6x4=24 టెస్టులు) 20 గ్రాండ్ టెస్టులు : 2000 ప్రశ్నలు ఇవి కాకుండా మీరు చదువుకునేందుకు వీలుగా ఈ-మెటీరియల్ + ప్ర

అంగన్ వాడీ టీచర్ పోస్టులకి నోటిఫికేషన్, టీచర్లు : 58, ఆయాలు : 174 ఖాళీలు

Breaking News, Current Affairs Today, Latest News, Latest Notifications
రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ విభాగం ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అర్హతలు: తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి వివాహితురాలై ఉండాలి స్థానిక గ్రామ పంచాయతీలో నివాసం ఉండాలి వయస్సు: 01.07.2020 నాటికి 21-35 ఏళ్ళ మధ్య ఉండాలి... జతచేయాల్సిన సర్టిఫికెట్స్: బర్త్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ మార్కులు మెమో కులం ధృవీకరణ పత్రం లోకల్ ఏరియా తదితర సర్టిఫికెట్స్ అప్లికేషన్లను ఆన్ లైన్ లో సమర్పించడానికి ఆఖరు తేది: 18 సెప్టెంబర్ 2020 పూర్తి వివరాలకు ఈ కింది వెబ్ సైట్ ను విజిట్ చేయండి: వెబ్ సైట్ అడ్రెస్ కు క్లిక్ చేయండి ఖాళీల వివరాలు: ఖాళీలు, ఇతర నోటిఫికేషన్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
IBPS 2020 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా

IBPS 2020 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా

Breaking News, Current Affairs Today, Latest News, Latest Notifications
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS) 2020 రూరల్ బ్యాంక్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈనెల 12, 13 తేదీల్లో వీటిని నిర్వహిస్తామని నోటిఫికేషన్ సమయంలో అంటే 10 ఆగస్టు 2020 నాడు IBPS ప్రకటించింది. అయితే ప్రస్తుతం కొన్ని అనుకోని పరిస్థితుల్లో 12.09.2020 మరియు 13.09.2020 నాడు జరగాల్సిన CRP-RRB-IX ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు IBPS డైరక్టర్ వెల్లడించారు. మళ్ళీ ఈ ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేది వెబ్ సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు తదుపరి తేదీల కోసం www.ibps.in ను రెగ్యులర్ గా విజిట్ చేయాలని తెలిపారు. ఇదే విషయాన్ని ఓ నోటీస్ ద్వారా వెబ్ సైట్ లో ఉంచారు ( నోటీస్ కింద ఇవ్వడమైనది. అలాగే లింక్ కూడా ఇస్తున్నాం ) దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ ఆఫీసర్లు (Scale-I, II & III) మరియు గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్ ) పోస్టులకు
RRB NTPC ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్, ట్విట్టర్ లో ఆందోళనకి దిగొచ్చిన RRB

RRB NTPC ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్, ట్విట్టర్ లో ఆందోళనకి దిగొచ్చిన RRB

Breaking News, Latest News, Latest Notifications
ట్విట్టర్ వేదికగా నిరుద్యోగులు చేపట్టిన #5Baje5Minutes ఉద్యమానికి రైల్వే శాఖ అధికారులు దిగొచ్చారు. RRB NTPC, Group D కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని 2020 డిసెంబర్ 15నుంచి నిర్వహిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. మూడు కేటగిరీలకు సంబంధించిన రిక్రూట్ మెంట్ అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ 15 నుంచి మొదలయ్యే  ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తొందర్లోనే  ప్రకటిస్తామన్నారు. సోషల్ మీడియాలో 7 లక్షల మంది యుద్ధం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ 2019 లో ప్రకటించిన NTPC, గ్రూప్ డి తదితర నోటిఫికేషన్లకి కోటిన్నర మందికి పైగా అప్లయ్ చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఎగ్జామ్స్ నిర్వహణకి సంబంధించిన సమాచారాన్ని RRB ప్రకటించలేదు. దాంతో టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న ట్విట్టర్ వేదికగా #5Baje5Minutes పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు నిరుద్యోగులు. రైల్వేలతో పాటు SSC పోస్టుల భర్తీ కోరుతూ శనివారం సాయ
రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్లు : 131 పోస్టులు మంజూరు, త్వరలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ తో కొత్త పోస్టుల భర్తీ

రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్లు : 131 పోస్టులు మంజూరు, త్వరలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ తో కొత్త పోస్టుల భర్తీ

Current Affairs, Current Affairs Today, Latest News, Latest Notifications
రాష్ట్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా 14 స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిల్లో వివిధ కేటగిరీలో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు డైరెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం రిక్రూటింగ్ ఏజెన్సీకి (TSPSCకి) ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. భర్తీ చేసే పోస్టులు - వాటి సంఖ్య 1) అడిషినల్ కమిషనర్ - 01 2) జూనియర్ కమిషనర్ - 02 3) డిప్యూటీ కమిషనర్స్ : 03 4) అసిస్టెంట్ కమిషనర్స్ : 04 5) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్: 12 6) అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్: 09 7) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్స్: 18 8) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్సెపెక్టర్స్:: 02 9) ప్రొహిబిషన్ అండ
ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్స్

ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్స్

Latest News, Latest Notifications
ఇంటర్మీడియట్ విద్యార్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్  5,846 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ 7 వరకూ ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి అవకాశం ఉంది. మొత్తం పోస్టులు: 5,846 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ (Male) : 3,433 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ (Female): 1,944 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ (Male Ex.Servicemen) : 226 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ( Commondos) : 234) విద్యార్హతలు:  ఇంటర్మీడియట్ అర్హత. వయస్సు: 1జులై 2020 నాటికి 18 నుంచి 25యేళ్ళ లోపు వయస్సు ఉండాలి. పురుష అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ నిర్వహించే నాటికి LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీలో వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. పరీక్ష ఫీజు: రూ.100 (SC/ST/Women/pwd అభ్యర్థులకి ఫీజు నుంచి మినహాయింపు) ఎగ
త్వరలో 2298 మున్సిపల్ వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ,  మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి తుది నిర్ణయం !

త్వరలో 2298 మున్సిపల్ వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ, మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి తుది నిర్ణయం !

Current Affairs Today, Latest News, Latest Notifications
రాష్ట్రంలో త్వరలో మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకి ఒక అధికారి చొప్పున నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్లు తరహాలో మున్సిపాలిటీల్లో వార్డుకి ఒక వార్డు ఆఫీసర్ ని నియమించాలని భావిస్తోంది. ప్రగతి భవన్ లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్ల నియమించాలని నిర్ణయించారు.  రాష్ట్రంలోని ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తుది నిర్ణయం తీసుకున్నారు. ఖాళీల భర్తీ ద్వారా పట్టణ ప్రగతి మరింత వేగంగా ముందుకు పోతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పౌరుడే కేంద్రంగా పౌర సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు, పట్టణాల అభివృద్ధికి ఖాళీల భర్తీ దోహదం చేస్తుందని అన్నారు. కొత్త పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు వీల
అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకీ ఒకే ఎగ్జామ్

అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకీ ఒకే ఎగ్జామ్

Latest News, Latest Notifications
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశానికి ప్రస్తుతం అనేక రకాల ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సి వస్తోంది. దాంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆయా ఎగ్జామ్స్ కి వేర్వేరుగా ప్రిపేర్ అవడం, ఎగ్జామ్స్ ఫీజులు కూడా విడివిడిగా చెల్లించాల్సి రావడం పైగా ఎగ్జామ్స్ కేంద్రాలకు ఛార్జీలు, ఇతర ఖర్చులు లాంటి భారం పడుతోంది. అందుకే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (NRA) ను తీసుకొస్తోంది. బ్యాంకింగ్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ( RRB) లాంటి ఎగ్జామ్స్ అన్నింటికీ ఇకపై కామన్ ఎంట్రన్స్ ను నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏజెన్సీకి కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపింది. నాన్ టెక్నికల్ గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులన్నింటినీ NRA ద్వారానే భర్తీ చేస్తారు. ఈ NRA లో రైల్వేశాఖ, ఆర్థిక శాఖ ప్రతినిధులతో పాటు రిక్రూట్ మెంట్ బోర్డులైన SSC, RRB, IBPS
CET కి ఒకే సిలబస్

CET కి ఒకే సిలబస్

Latest News, Latest Notifications
నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఒకే సిలబస్ ఉంటుంది. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక పరీక్షా కేంద్రం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఎక్కువ మంది రాస్తుంటే అదే జిల్లాలో మరో సెంటర్ ను ఎలాట్ చేస్తారు. దాంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ దూరం వెళ్లి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉండదు ఎగ్జామ్స్ మొదట 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. దాంతో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంగ్లీష్ లేదా హిందీ వచ్చిన అభ్యర్థులు మాత్రమే పోటీ పడేవారు. ఇప్పుడు తెలుగు, తమిళం లాంటి ప్రాంతీయ భాషల్లోనూ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ రాయడానికి అభ్యర్థుల కోసం ముందుగా రిజిష్ట్రేషన్ పోర్టల్ ను ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా అభ్యర్థులందరికీ ఒకే క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఎలాంటి లీక్స్ కి ఆస్కారం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో పకడ్బందీగా
మున్సిపల్ ఖాళీలపై మంత్రి KTR సమీక్ష, అవసరమైన పోస్టులు గుర్తించాలని ఆదేశాలు

మున్సిపల్ ఖాళీలపై మంత్రి KTR సమీక్ష, అవసరమైన పోస్టులు గుర్తించాలని ఆదేశాలు

Current Affairs Today, Latest News, Latest Notifications
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే అంశంపై మంత్రి KTR ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఇప్పుడున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఆ తర్వాత ఎంతమంది అవసరం అవుతారో గుర్తించి కొత్త సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇందులో ఇంజనీరింగ్, మౌలిక సదుపాలయ విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఖాళీల భర్తీలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు ఏరియాల్లోని మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లోనూ సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుందనీ అందుకోసం ప్లానింగ్ రెడీ చేయాలని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శ అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు మంత్రి కేటీఆర్. మున్సిపాలిటీల్లో మ