Saturday, May 26
Log In

Current Affairs

CURRENT AFFAIRS – MAY 05

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం 2018 మే 10 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభిస్తారు ? జ: కరీంనగర్ జిల్లా శాలపల్లి 2) బాలల న్యాయ చట్టం - 2015 అమల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ చిన్నారుల సంరక్షణకు బాలల న్యాయ నిధిని ఎంత మొత్తంతో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది ? జ: రూ.కోటి తో 3) తెలంగాణ తొలి దళిత కవి మాదిగ మహాయోగిపై తెలంగాణ వికాస సమితి రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఆ రచయిత పేరేంటి ? జ: దున్న ఇద్దాసు 4) NTPC దక్షిణ ప్రాంత ED గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: దిలీప్ కుమార్ జాతీయం 5) వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో తొలి విదేశీ పర్యటన కోసం వారం రోజుల పాటు ఏ దేశాలకు వెళ్తున్నారు ? జ: లాటిన్ అమెరికా దేశాల్లో 6) దేశంలో మొదటిసారిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృత్రిమ మేథస్సును వినియోగించే దిశగా నీతి ఆయోగ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుద

CURRENT AFFAIRS – MAY 04

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) పౌరసరఫరాల శాక కమిషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: అకున్ సబర్వాల్ 2) దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ( CISF) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఐజీగా ఎవరు నియమితులయ్యారు ? జ: సి.వి. ఆనంద్ 3) 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా ఎక్కడ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని టీఎస్ జెన్ కో నిర్ణయించింది ? జ: కొత్తగూడెంలో జాతీయం 4) జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు ? జ: వినోద్ ఖన్నా 5) నర్గీస్ దత్ జాతీయ సమగ్రత పురస్కారం ఎవరికి దక్కింది ? జ: మరాఠీ సినీ ఢప్పా నిర్మాత సమతి పొపట్ లాల్ షా 6) భవిష్యత్తులో ల్యాప్ టాప్ సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ప్రస్తుతం ఇస్రో అధ్యక్షులు ఎవరు? జ: డాక్టర్ కె.శివన్ 7) భారత్ - దక్షిణాఫ్రికా వాణిజ్యసదస్సు మొదటిసారిగా ఎక్కడ జరుగుతోంది ? జ: జోహెన

CURRENT AFFAIRS MAY 03

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) పిజ్జాలు, శాండ్ విచ్ లు లాంటివి తయారు చేసే డొమినోస్ తమ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇది ఏ దేశానికి చెందిన కంపెనీ ? జ: అమెరికాకి 2) మానవీయ, ఆర్ట్స్, సాంఘిక శాస్త్రంలో రాష్ట్రపతి జారీ చేసే విజిటర్స్ అవార్డును అందుకున్న HCU ప్రొఫెసర్ ఎవరు ? జ: ప్రమోద్ నాయర్ 3) అలంకరణల విభాగంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి దేశంలో ఎన్నో స్థానం దక్కింది ? జ: మూడో స్థానం 4) ఖనిజాల లభ్యతకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకునేందుక రిమోట్ సెన్సింగ్, GIS ల్యాబ్ ను ఇస్రో సహకారంతో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: హైదరాబాద్ NMDCలో జాతీయం 5) ఫేస్ బుక్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 6) ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీకి ఎన్నో స్థానం దక్కింది ? జ: మూడో స్థానం 7) ఢిల్ల

CURRENT AFFAIRS – MAY 2

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) ఒకటి నుంచి పదో తరగతి వరకూ అన్ని విద్యాసంస్థల్లో బోధనలో తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమలు చేయకుండా మొదటిసారి ఎంత జరిమానా విధిస్తారు ? జ: రూ.50వేలు (నోట్: 2వసారి లక్షల, మూడోసారి - విద్యాసంస్థ గుర్తింపు రద్దు ) 2) తెలంగాణలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి ( MCI) ఆమోదం తెలిపింది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: సిద్ధిపేటలో 3) రాష్ట్రంలోని ఏ పోలీస్ కమిషనరేట్ లో కాగిత రహిత (పేపర్ లెస్ ) పాలనను నెల రోజుల్లోగా అమల్లోకి తేనున్నారు ? జ: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ( సీపీ అంజనీ కుమార్ ) జాతీయం 4) పార్లమెంటు ప్రజా పద్దుల సంఘ్యం ( PAC) కి ఛైర్మన్ గా ఎవరు నియమితుయల్యారు ? జ: మల్లికార్జున్ ఖర్గే (నోట్: ప్రతిపక్ష నేతకు ఈ పదవి ఇస్తారు. ఇందులో 22మంది సభ్యులుగా ఉంటారు.) 5) పార్లమెంటరీ అంచనాల సంఘం ఛైర్మన్ గా ఎ

CURRENT AFFAIRS – MAY 1

Current Affairs, May Current Affairs
రాష్ట్రీయం 1) వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారక ఉపన్యాసం ప్రతి యేటా నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్సిటీ ఏది ? జ: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 2) భారత వాయుసేన (IAF) మాజీ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ (హైదరాబాద్ ముద్దు బిడ్డ) హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన పేరేంటి ? జ: ఇద్రిస్ హసన్ లతీఫ్ జాతీయం 3) దేశంలో మొత్తం ఎన్ని వారసత్వ కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్తలకు దత్తతకు ఇచ్చింది ? జ: 98 కట్టడాలు 4) భారత్ - చైనా మధ్య వివాదస్పదంగా ఉన్న డోక్లాం పరిశీలనకు వెళ్ళే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ? జ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ 5)ప్రతియేటా జనవరిలో నిర్వహించే ప్రవాసీ భారతతీయ దివస్ 2019ని ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: వారణాసిలో 6) వేసవి సెలవుల్లో విద్యార్థులకు స్వచ్ఛ్ భారత్ ఇంటర్నషిప్ 2018 మే 1 నుంచి ప్రారంభమైంది. ఎన్ని నెలల

CURRENT AFFAIRS – APR 30

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) ఆదిలాబాద్ లో కన్నుమూసిన రవీంద్ర శర్మ గురూజీ ఏ రంగంలో ప్రసిద్ధులు ? జ: కళా రంగం ప్రోత్సాహానికి కళాశ్రమం స్థాపించారు 2) నాగార్జున సాగర్ లో నిర్మిస్తున్న బుద్ధవనాన్ని 2018 అక్టోబర్ 14న (బుద్ధు తొలి సందేశం ఇచ్చిన రోజు) ప్రారంభించాలని భావిస్తున్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి ఎవరు ? జ: మల్లేపల్లి లక్ష్మయ్య 3) ఏ రోజును డైరక్టర్స్ డే గా పాటించాలని తెలుగు చలన చిత్ర దర్శకులు నిర్ణయించారు ? జ: మే 4 (దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి) 4) వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ఎవర్ని పిలుస్తారు ? జ: విద్యాసాగర్ రావు (నోట్: డిండి ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరును పెడుతూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది ) జాతీయం 5) వేసవి సెలవుల్లో మూడు కేంద్ర మంత్రిత్వ శాఖలు చేపట్టిన స్వచ్ఛభారత్ ఇంటర్న్ షిప్ లో ఇచ్చిన లక్ష్యాలు పూర్తి చేస్తే UGC ఎన్ని క్రెడిట్ పాయింట్స్ ఇస్తుందని ప్రధాని నరేం

CURRENT AFFAIRS APR 29

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అంతా ఒకే దగ్గర లభించేలా రూపొందిస్తున్న టీ వెబ్ ను ఎప్పుడు ప్రారంభించనున్నారు? జ: 2018 జూన్ 2 (నోట్: ఇందులో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు నిర్వహించే 265 వెబ్ సైట్లను మానిటరింగ్ చేస్తారు ) 2) 2018 మే 6న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో కలిసి దక్కన్ డైలాగ్ 2018 పేరుతో సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో 3) 400 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో 4) ప్రతి నెలా ఏ రోజున జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది ? జ: 30వ తేదీన 5) తెలంగాణ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ? జ: గొడిశాల రాజేశం గౌడ్ 6) చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ లో కాంపౌండ్ మిక్స్ డ్ పెయిర్ విభాగంలో పతకం గెలుచుకున్నతెలుగు అమ్మాయి ఎవరు

CURRENT AFFAIRS – APR 28

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) సివిల్స్ 2017 ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ ఎవరు ? జ: అనుదీప్ (నోట్: మెట్ పల్లి, జగిత్యాల జిల్లా ) జాతీయం 2) ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య హార్ట్ టు హార్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది ? జ: వుహాన్ ( చైనా) 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా ప్రమాణం చేశారు. మల్హోత్ర ప్రమాణంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య ఎంతకు చేరింది ? జ: 25 4) సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉండవచ్చు ? జ: 31మంది 5) ప్రస్తుతం ప్రమాణం చేసిన ఇందూ మల్హోత్రాతో పాటు సుప్రీంకోర్టులో మరో మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఆమె పేరేంటి ? జ: జస్టిస్ భానుమతి (నోట్: 2014 ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు ) 6) చెన్నైలో జరుగుతున్న సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ 2018 ను ఎవరు ప్రారంభించారు ? జ: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ 7) సైన్యానికి రూ.3,68

CURRENT AFFAIRS – APR 26&27

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) టీ యాప్ ఫోలియా అనే ఒక యాప్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని సేవలను పొందవచ్చు ? జ: 150 సర్వీసులు 2) రాష్ట్రంలో పదో తరగతి వరకూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడానికి అవసరమైన నిబంధనల రూపకల్పన కమిటీకి ఎవరు కన్వీనర్ గా ఉంటారు ? జ: పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ 3) అంగన్ వాడీ సేవలకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? జ: 155209 4) ప్రత్యేక పరిస్థితుల్లో దళితులను ఆదుకునేందుకు 2018-19 సంవత్సరానికి ఎస్సీ సంక్షేమ శాఖ ఎంత మొత్తంతో అత్యవసర సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది ? జ: రూ.62 కోట్లతో 5) జూన్ 2019 లో చేపట్టే నాలుగో విడత హరితహారంలో ఏ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది ? జ: వెదురు మొక్కలు 6) మన రాష్ట్రంలో రైతులకు ఉత్తమ సేవలను అందించినందుకు గాను ఏ మార్కెట్ కు ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది ? జ: సిద్ధిపేట జాతీయం 7) పత్

CURRENT AFFAIRS – APR 25

April Current Affairs, Current Affairs
రాష్ట్రీయం 1) జోగులాంబ గద్వాల జిల్లాలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.581 కోట్లతో ఏ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: గట్టు ఎత్తిపోతల పథకం 2) పర్యావరణానికి మేలు చేసే చర్యలు చేపట్టినందుకు జీఎంఆర్ విమానాశ్రయానికి ఏ సంస్థ నుంచి హరిత పురస్కారం లభించింది ? జ: ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ - 2018 3) 32వ అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ (ఇస్టా) కాంగ్రెస్ ను 2019 జూన్ 26 నుంచి జులై 3 వరకూ ఎక్కడ నిర్వహించనున్నారు ? జ: హైదరాబాద్ లో (నోట్: ఇస్టా కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రేయాస్ వాయీస్ ) జాతీయం 4) 2018 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? జ: మధ్యప్రదేశ్ లో (రాంనగర్ ) 5) జాతీయ పంచాతీయ రాజ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణకి ఈ-