Monday, October 15
Log In

General Knowledge

టైమ్ జోన్స్

General Knowledge
- 1947 సెప్టెంబర్ 1న భారత ప్రామాణిక కాలమనా (IST)ఏర్పాటైంది - ఈశాన్య రాష్ట్రాలకు మిగతా దేశానికి 4 గంటలు గ్యాప్ వస్తుండటంతో ప్రత్యేక టైమ్ జోన్ కోసం ఈశాన్య రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. - 2014లో ఛాయ్ బగాన్ లేదా బగాన్ టైమ్ ( టీ ఎస్టేట్ టైమ్ ) ను పాటించాలని అసోం అనధికారికంగా నిర్ణయించింది. - పగటి సమయం ఒక గంట ఎక్కువ ఉండేలా గతంలో తేమాకు తోటలు, గనులు, చమురు కోసం బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. - బ్రిటీష్ పాలనలో భారత్ లో బొంబాయి, కోల్ కతా అనే రెండు టైమ్ జోన్లుగా విభజించారు

S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ

General Knowledge
- రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. - 2018 అక్టోబర్ 5 నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. - ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.36.9 వేల కోట్లు ) - S-400 క్షిపణులను భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగిస్తారు - ఈ వ్యవస్థతో ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించవచ్చు - రష్యాకి చెందిన అల్మాజ్ యాంట్ సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది. - ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులు ఉంటాయి. - ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఒకే టైమ్ లో గుర్తించగలదు. దాదాపు 600 కిమీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడని కనిపెడుతుంది. 400కిమీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది. - రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెర

ఆయుష్మాన్ భారత్

General Knowledge
- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జయ్ - ఆయుష్మాన్ భారత్ ) పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు - లబ్ది పొందే కుటుంబాలు - గ్రామీణంలో - 8.03 కోట్లు, పట్టణాల్లో : 2.33 కోట్లు - దేశంలో 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి బీమా రక్షణ కల్పిస్తారు - 1300కు పైగా రోగాలకు ఈ పథకం కింద రక్షణ కల్పిస్తారు - ఇంతవరకూ గ్రామాల్లో : 85.9 శాతం, పట్టణాల్లో 82 శాతం మందికి ఆరోగ్య బీమా లేదు - కొత్త పథకంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.3500 కోట్లు ఖర్చవుతాయని నీతి ఆయోగ్ అంచనా - పథకం కోసం హెల్ప్ లైన్ నెంబర్ : 14555 - కేంద్రం - రాష్ట్రం వాటా : 60శాతం - 40శాతం

అకాడమీ అవార్డులకు విలేజ్ రాక్ స్టార్స్

General Knowledge
- ఈ మూవీని 91వ అకాడమీ అవార్డులు 2019 కి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసింది చేసింది. - ఇది అస్సామీ మూవీ. లీడ్ రోల్ పోషించింది భానితా దాస్. డైరక్టర్ రిమా దా - 65వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది - ఈ మూవీలో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు దక్కాయి.
తెలంగాణ – అడవులు ( టాప్ 10 బిట్స్)

తెలంగాణ – అడవులు ( టాప్ 10 బిట్స్)

General Knowledge, Latest News
1) రాష్ట్ర మొత్తం భూ విస్తీర్ణంలో అడవులు శాతం జ: 24.35 శాతం 2) రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం జ: 27,292 చ.కి.మీ. (దేశంలో 12వ స్థానం. దేశ అటవీ విస్తీర్ణం - 7,01,673 చ.కి.మీ) హరితహారం కార్యక్రమం (మొత్తం బడ్జెట్ : రూ.5500కోట్లు ) 2) మొదట ఎప్పుడు ప్రారంభించారు ? జ: 2015 జులై 3 - కేసీఆర్ - చిలుకూరి బాలాజీ టెంపుల్ లో 3) రెండో దశ హరితహారం ఎక్కడ ప్రారంభించారు జ: 2016 జులై 8 - గుండ్రాంపల్లి, నల్లగొండ జిల్లా (ముఖ్యమంత్రి కేసీఆర్) 4) మూడో దశ హరితహారం ఎక్కడ ప్రారంభించారు జ: 2017 జులై 12 - కరీంనగర్ - కేసీఆర్ 5) హరిత హారం స్లోగన్ జ: కోతులు వాపసు పోవాలె... వానలు వాపస్ రావాలె 6) రాష్ట్రంలో అత్యధిక అడవులు ఉన్న జిల్లా జ: జయశంకర్ భూపాల పల్లి జిల్లా ( 4.50 లక్షల హెక్టార్లు ) 7) అత్యల్ప అడవులు ఉన్న జిల్లా జ: హైదరాబాద్ 8) శాతాల పరంగా అడవులు అత్యధికం - జయశంకర్ భూపాల పల్లి అత్యల్పం - కరీం

పేదరికంపై ఐక్యరాజ్యసమితి నివేదిక

General Knowledge
- ప్రపంచంలో మొత్తం 104 అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో పేదరికాన్ని ఐక్యరాజ్యసమితి లెక్కించింది - దాదాపు 130 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టు తేల్చింది - బహు మితీయ పేదరిక సూచీ ( MPI) 2018 ని ఆక్స్ ఫోర్డ్ పేదరిక - మానవాభివృద్ధి కార్యక్రమం ప్రతినిధులతో కలసి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ( UNDP) ఈ నివేదిక విడదల చేసింది - UNDP డైరక్టర్ అచిమ్ స్టీనెర్ - రోజుకి 1.90 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఆర్జిస్తున్న వారిని లెక్కలోకి తీసుకున్నారు ( రూ.137 రోజుకి) - ఎక్కువ పేదరికం అనుభవిస్తున్న వారిలో 66.20 కోట్ల మంది చిన్నారులే
PSLV – C42 రాకెట్ ప్రయోగం సక్సెస్

PSLV – C42 రాకెట్ ప్రయోగం సక్సెస్

General Knowledge
- 2018 సెప్టెంబర్ 16న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV C42 ప్రయోగం ద్వారా బ్రిటన్ కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది - భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవాSAR, S1-4 లను 230.4 టన్నుల బరువున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - సీ42 వాహనక నౌక మోసుకెళ్ళింది - శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక ద్వారా దీన్ని నింగిలోకి పంపారు. దీని వ్యయం రూ.175 కోట్లు - ఇప్పటిదాకా ఇస్రో 23 దేశాలకు చెందిన 242 విదేశీ ఉపగ్రహాలను షార్ నుంచి PSLV రాకెట్ల ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది - ఈ ప్రయోగంతో మొత్తం 243 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది - విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా ఇస్రో ఏడాదికి రూ.220 కోట్లు ఆర్జిస్తోంది. - వచ్చే ఆరు నెలల్లో మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ వెల్లడించారు.

మానవాభివృద్ధి సూచిక

General Knowledge
- ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాతిపదికలుగా ఏటా ఐరాస అభివృద్ధి కార్యక్రమం ( UNDP) ఈ ర్యాంకులు ప్రకటిస్తుంది. - మొత్తం 189 దేశాలతో నివేదిక రూపొందించింది - ఇందులో భారత్ స్థానం 130. (గతం కంటే ఒక్కస్థానం ఎగబాకింది ) - బంగ్లాదేశ్ - 136, పాకిస్తాన్ 150 వ స్థానాల్లో ఉన్నాయి - ఆసియా సగటుతో HDI తో పోలిస్తే భారత్ 0.638విలువతో కాస్త పైన ఉంది - భారత్ 2016లో 0.624 విలువతో 131వ స్థానంలో ఉంది
తెలంగాణలో వరి సాగు

తెలంగాణలో వరి సాగు

General Knowledge, Latest News
1) రాష్ట్రవ్యాప్తంగా అంచనాలకు మించి వరి సాగైంది. మొత్తం 25.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి 2) రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం : 23.75 లక్షల ఎకరాలు. ఇప్పుడు 107 శాతానికి చేరుకుంది 3) రాష్ట్రంలో అన్ని రకాల పంటల సాగు సాధరణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ప్రస్తుతం 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతోంది. 4) 12 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది 5) సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో లోటు వర్షపాతం 6) ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధికవర్షపాతం నమోదైంది.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్

General Knowledge, Latest News
- అందరికీ బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 28 ఆగస్టు 2014లో అమల్లోకి తెచ్చింది. నాలుగేళ్ళ పాటు అమల్లో ఉండేలా పథకం రూపొందించగా, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. - దేశంలో బ్యాంకు ఖాతాలు లేని 7.5 కోట్ల మంది ఖాతా తెరిచి, రూపే డెబిట్ కార్డులను పంపిణీ చేయాలన్నది మొదట లక్ష్యంగా పెట్టుకున్నారు. ^ ప్రస్తుత ఖాతాలు : 32.41 కోట్లు, వీటిల్లో సొమ్ము : రూ.81,200 కోట్లు - ఖాతాదారులకు మొదట్లో 1లక్ష రూపాయల ప్రమాద బీమా, మరణిస్తే రూ.30వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్ర ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఉచిత బీమా సౌకర్యం రూ.2 లక్షలు చేశారు. - మొదట్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం రూ.5 వేలు ( 6 నెలల పాటు ఖాతాను నిర్వహించాలి ) ఇప్పుడు రూ.10 వేలు చేశారు - ఖాతాదారుల్లో మహిళలు 53శాతం మంది ఉన్నారు.