Monday, September 24
Log In

Current Affairs Weekly

CURRENT AFFAIRS – SEPT 24

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో రైలు మార్గాన్ని ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ రూట్ లో ఎన్ని కిలోమీటర్ల మార్గం కవర్ అవుతుంది ? జ: 16 కి.మీ. 02) మెట్రో రైలు ఎండి ఎవరు ? జ: NVS రెడ్డి 03) మై జర్నీ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఇది ఎవరి రాజకీయ సామాజాకి జీవితం ఆధారంగా రాసిన పుస్తకం ? జ: టీడీపీ నేత దేవేందర్ గౌడ్ 04) రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కి ప్రభుత్వం ప్రతియేటా ఎంత మొత్తం నిధులు కేటాయిస్తోంది ? జ: రూ.700 కోట్లకు పైగా (నోట్: ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం రూ.280 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది ) జాతీయం 05) దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పించేందుకు ఉద్దేశించిన ఆయుష్మాన్ బారత్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు ? జ: జార్ఖండ్ లోని రాంచీ దగ్గర ( జన

CURRENT AFFAIRS – SEPT 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) ఖరీఫ్ పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో 3,140 కొనుగోలు కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్రం మద్దతు ధర కింద ఏ గ్రేడ్ ధాన్యంనకు క్వింటాకి ఎంత మొత్తాన్ని చెల్లించనున్నారు ? జ: రూ.1,770 02) రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ ( TSIIC) ఛైర్మన్ ఎవరు ? జ: గ్యాదరి బాలమల్లు 03) రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవి ఏంటి జ: భద్రాచలం, ఆసిఫాబాద్, సారపాక 04) విష్ణు కుండినుల కాలం నాటి శివాలయం గుండం, నివాస నిర్మాణాల జాడలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఎక్కడ వెలుగులోకి తెచ్చింది ? జ: మెదక్ జిల్లా టేక్మల్ మండలం వేలుపుగొండ 05) రేణ, మాయని దర్వాజ, ఆమె లాంటి పుస్తకాల్లో తెలంగాణ పల్లెపదాలను , సామెతలను అక్షీకరించిన తెలంగాణ రచయిత చనిపోయారు. ఆయన ఎవరు ? జ: చైతన్య ప్రకాశ్ జాతీయం 06) ఒడిశాలోని తాల్చేర్ లో 13వేల కోట్ల రూపాయలతో

CURRENT AFFAIRS – SEPT 22

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) ఈనెల 27న శాసన మండలి సమావేశం జరుగుతోంది. గతంలో శాసనసభ రద్దయినా మండలి సమావేశాలు ఎప్పుడెప్పుడు కొనసాగాయి ? జ: ఎప్పుడూ కొనసాగలేదు. ఇదే మొదటిసారి (నోట్: నిబంధనల ప్రకారం మండలి ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య 6 నెలల లోపు ఉండాలి. అందుకే సమావేశం జరుగుతోంది ) 02) రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంయుక్త ముఖ్య ఎలక్టోరల్ అధికారిగా ఎవరిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది ? జ: ఆమ్రపాలి ( ప్రస్తుతం GHMC అదనపు కమిషనర్ గా పనిచేస్తున్నారు ) 03) ఆంధ్ర బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, CEO గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: జె. పకిరిసామీ 04) రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శిల్పాచార్యుడు ఎక్కా యాదగిరి రావుకి గౌరవ డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ ఏది ? జ: గీతం యూనివర్సిటీ 05) యాసంగి పెట్టుబడి కోసం రైతులకు రెండో విడత రైతు బంధు చెక్కులు ఎప్పటి నుంచి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది ? జ: 2018 అక్టో

CURRENT AFFAIRS – SEPT 21

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో మూడు కొత్త రహదారులకు కేంద్ర ఆమోదం తెలిపింది. అవి ఏవి జ: 1) హైదరాబాద్ నుంచి కొత్తగూడెం - 234 కిమీ 2) మెదక్ నుంచి రుద్రూరు - 9115 కిమీ 3) బోధన్ నుంచి భైంసా - 54 కిమీ 02) వాల్మీకి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ? జ: ఆశ్వయుజ పౌర్ణమి రోజున 03) హైదరాబాద్ శివారుల్లోని కొల్లూరులో ప్రొడక్ట్ ఇంజనీరింగ్, రీసెర్చ్, డెవలప్ మెంట్, ఐటీ, ఐటీ అనుబంధ కార్యకలాపాలకు 20 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రమఖ ఆటో మొబైల్ కంపెనీ ఏది ? జ: హ్యూందాయ్ మొబీస్ జాతీయం 04) దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సర్జికల్ స్ట్రైక్స్ డే ని ఎప్పుడు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలిచ్చింది ? జ: సెప్టెంబర్ 29న 05) చిన్న మొత్తాల పొదుపుపై కేంద్ర ప్రభుత్వం ఎంత

CURRENT AFFAIRS – SEPT 20

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) ఎల్బీ నగర్ టు అమీర్ పేట మెట్రో రైల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ? జ: 2018 సెప్టెంబర్ 24 నుంచి (గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు ) 02) ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన సర్వేలో టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి ఆసియాలో హైదరాబాద్ కి ఏ స్థానం లభించింది జ: 7వ స్థానం జాతీయం 03) ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్టినెన్స్ చేసింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడనుంది ? జ: మూడేళ్ళు 04) భారత్ - రుమేనియా ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 70యేళ్ళయిన సందర్భంగా ఆ దేశంలో పర్యటిస్తున్న భారత్ ప్రముఖుడు ఎవరు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 05) రాష్ట్ర మాతగా ఆవుని గుర్తిస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు ? జ: ఉత్తరాఖ

CURRENT AFFAIRS – SEPT 19

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) కేంద్ర యువజన సంక్షేమ శాఖ ప్రతిష్టాత్మక తెన్ సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారం 2017 కి ఎంపికైన భారతీయ నౌకాదళ లెఫ్టినెంట్ కమాండర్ ఎవరు ? జ: బొడ్డపాటి ఐశ్వర్య (తెలంగాణకి చెందిన అధికారిణి) 02) బోగస్ ఓటర్లను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రాష్ట్రంలో ఉపయోగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెబుతున్నారు. ఆ సాఫ్ట్ వేర్ ఏది ? జ: ERO NET జాతీయం 03) బంగ్లాదేశ్ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఏ పేరుతో పైప్ లైనును భారత్, బంగ్లా ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనా ప్రారంభించారు ? జ: ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ (నోట్: 130 కిమీలు, ప్రాజెక్టు వ్యయం: రూ.346 కోట్లు ) 04) క్షయ వ్యాధి పీడిత 30 దేశాల్లో భారత్ స్థానం ఎంతగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో పేర్కొంది ? జ: మొదటి స్థానం (నోట్: 2017లో కోటి మంది ఈ వ్యాధి బారిన పడితే 27ల

CURRENT AFFAIRS – SEPT 18

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రూ.300కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు మైక్రాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: మాదాపూర్ 02) రాష్ట్రంలో రెండో విడత రైతు బంధు చెక్కులను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ? జ: 2018 నవంబర్ 17నుంచి 03) 24 గంటలూ సౌరశక్తిని నిల్వ చేసి వినియోగించే లిథియం ఇరన్ పాస్ఫేట్ బ్యాటరీలను రూపొందించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ఏది ? జ: ప్యూర్ ఎనర్జీ జాతీయం 04) దేశంలో మరో మూడు బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ఆ బ్యాంకులు ఏవి ? జ: బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ 05) హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన ఏపీకి చెందిన ఎవరిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సన్మానించారు ? జ: పావులూరి శివరామ కృష్ణయ్య 06) ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ సంఘం (DDCA) క్రికెట్ కమిటీకి రాజీనామా

CURRENT AFFAIRS – SEPT 16 & 17

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) 2018 సెప్టెంబర్ 16 నాడు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్రను హైదరాబాద్ లో ఎవరు ప్రారంభించారు ? జ: ఐటీ మంత్రి కేటీఆర్ 02) 2018 సెప్టెంబర్ 17తో హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయి 70యేళ్ళు అవుతుంది. విలీనం అయిన తేదీ ఏది ? జ: 1948 సెప్టెంబర్ 17 03) భారత్ లో విలీనం అంశాన్ని 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ రేడియో ద్వారా ప్రకటించారు ? జ: హైదరాబాద్ రేడియో 04) భారత సైన్యాధిపతి ముందు తన సైన్యంతో సహా లొంగిపోయిన హైదరాబాద్ సంస్థాన సైన్యాధిపతి ఎవరు ? జ: అల్ ఇద్రూస్ 05) 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సైనిక గవర్నర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: మేజర్ జనరల్ జె.ఎన్ చౌదరి 06) మేఘాలయలోని షిల్లాంగ్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న నృత్యకారిణి ఎవరు ? జ: భావనా రెడ్డి 07) ఈసారి ఎన

CURRENT AFFAIRS – SEPT 14&15

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్ ఇంజనీర్ కి ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆయన పేరేంటి ? జ: వెంకటేశ్వర్లు (నోట్: భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఈ అవార్డును ప్రతియేటా ప్రదానం చేస్తుంది ) 02) దేశంలో ఆయిల్ పాం పండ్ల గెలలను గానుగాడించి దేశంలో అత్యధికంగా 18.43శాతం పామాయిల్ ఉత్పత్తి సాధించిన మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది ? జ: తెలంగాణ జాతీయం 03) భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగొయ్ ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. గొగొయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ? జ: 2018 అక్టోబర్ 3 04) 46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ రంజన్ గొగొయ్ ఎప్పటి దాకా ఈ పదవిలో కొనసాగుతారు ? జ: 2019 నవంబర్ వరకూ (నోట్: ఈ అత్యున్నత పదివిలో నియమితులయ్యే ఈశాన్యరాష్ట్రా

CURRENT AFFAIRS – SEPT 13

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ లో అంచనాలకు మించి ఎన్ని ఎకరాల్లో వరి సాగైంది ? జ: 25.44 లక్షల ఎకరాలు (జనరల్ నాలెడ్జ్ లో పాయింట్స్ ఇచ్చాం. ఆ విభాగంలో చూడగలరు ) 02) 5-15 మిలియన్ల ప్రయాణీకుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల్లో ప్రయాణీకుల భద్రతతో పాటు అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఏ ఎయిర్ పోర్టుకి ఉత్తమ పురస్కారం ఇచ్చింది ? జ: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయం 03) రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి ? జ: ప్రధానమంత్రి - అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ( PM AASHA) 04) PM AASHA పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది ? జ: రూ.15,053 కోట్లు 05) 2021-22 కల్లా దేశంలో ఎన్ని కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ల విద్యుదీకరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిట