కులం (CASTE)

1) కులాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ? ఇది ఏ భాషా పదం నుంచి వచ్చింది ?
జ: క్యాస్ట్ (CASTE) ఇది కాస్టా అనే స్పానిష్ పదం నుంచి వచ్చింది
2) జాతి, వ్యవస్థ లేదా వారసత్వ లక్షణాల సముదాయాన్ని ఏమంటారు ?
జ: కులం
3) భారత్ లో క్యాస్ట్ అనే పదాన్ని వాడిన వారు ఎవరు ?
జ: పోర్చుగీసు వారు
4) ఏ దేశీయులు జాతి లక్షణాలకు సామీప్యత ఉండటంతో క్యాస్ట్ పదాన్ని వాడారు ?
జ: పోర్చుగీసు వారు
5) ఆర్యులు స్థానిక ప్రజలను గుర్తించడానికి రెండు తెగలుగా విభజించారు. అవి ఏంటి ?
జ: ఆర్య వర్ణులు, దాస్య వర్ణలు
6) తెల్లగా ఉండి, ఆజానుబాహులను ఏమని పిలిచేవారు ?
జ: ఆర్యులు
7) నల్లగా, పొట్టిగా ఉండే వారిని ఏమని ఆర్యులు పిలిచేవారు ?
జ: దాస్య వర్ణులు
8) ద్విజులు ఎన్ని రకాల సంస్కారాలు నిర్వహిస్తారు ?
జ: 44 రకాలు
9) చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భావం అనేది ఏయే గ్రంథాల్లో ఉంది ?
జ: 1) విష్ణు పురాణం 2) పురుష సూక్తం
10) ఈ రెండు పురాణాల్లో ఎవరి గురించ ప్రస్తావన లేదు ?
జ: అస్పృశ్యులు
11) UNICEF ప్రకారం భారత్ లో కులవివక్ష దాదాపు ఎంతమందిపై ప్రభావం చూపిస్తోంది ?
జ: 25 కోట్ల మందిపై
12) ఎవరి కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థను నిర్మూలించారు ?
జ: మౌర్యుల కాలంలో
13) కులం దైవాంస సంభూతం అన్నది ఎవరు ?
జ: హాకర్డ్ & సెనార్డ్
14) కులం వృత్తిపరమైనది అనే సిద్ధాంతం చెప్పింది ఎవరు ? ఇది అందరి ఆమోదం పొందినది .
జ: నెస్ ఫీల్డ్ (
15) పీపుల్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసింది ఎవరు ? వీరు కులం విషయంలో ఏ సిద్ధాంతం ప్రతిపాదించారు ?
జ: హెర్బర్ట్ రిస్లే - జాతి సిద్ధాంతం
16) జాతి సిద్ధాంతం ను బలపరచిన మరొకరు ఎవరు ?
జ: మజుందార్
17) కులం విషయంలో మాన సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు ?
జ: హట్టన్
18) బ్రహ్మణీక సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు ?
జ: అబ్బే డ్యుబాయిస్
19) కులంపై పరిమాణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు ?
జ: గిల్బర్ట్స్
20) మౌర్యులు, గుప్తుల కాలంలోనే బ్రాహ్మణ మతానికి పునరుజ్జీవనం వచ్చిందనీ, ఛండాలులపై వివక్ష కొనసాగిందని చెప్పింది ఎవరు ?
జ: పాహియాన్
21) మనువు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు రాశాడు ?
జ: క్రీ.పూ. 1250 - 1000
22) మను ధర్మ శాస్త్రంలో బ్రాహ్మణులకు ఏ విధి నిర్వహించాలని తెలిపారు ?
జ: ధర్మ విధి
23) మను ధర్మ శాస్త్రం రాజులకు ఎన్ని పాలనా సూత్రాలను వివరించింది ?
జ: 960 సూత్రాలు
24) వైశ్యులు, శూద్రులకు మనువు ఎన్ని సూత్రాలు ప్రతిపాదించాడు ?
జ: 8 సూత్రాలు
25) భారత్ లో దాదాపు ఎన్ని కులాలు ఉన్నాయి ?
జ: 6 వేలు
26) అస్పృశ్యులను షెడ్యూల్డ్ కులాలు అని ఏ చట్టం ద్వారా పిలుస్తున్నారు ?
జ: 1930 భారత ప్రభుత్వ చట్టం
27) Caste in India పుస్తకం రాసినది ఎవరు ?
జ: జె హెచ్ హట్టన్
28) ‘‘అస్పృశ్యులను సాంఘికంగా అణగదొక్కడానికి వారి ఉక్కుపాదాల కింద నలిగిపోవడానికి హిందూ వర్ణ వ్యవస్థ మరింత అవకాశం ఇచ్చింది ’’ అని అన్నదెవరు ?
జ: AR దేశాయ్ - Social Background of Indian Nationalism
29) కులం పట్ల అభిమానం ఇతర కులాల పట్ల వ్యతిరేకతను పెంపొందించి జాతీయ భావానికి అవరోధం ఏర్పడుతుంది - అన్నదెవరు ?
జ: G S ఘర్యే
30) ఆర్థిక, సాంస్కృతిక సమానత్వం ద్వారా కుల నిర్మూలన చేయవచ్చు - అని చెప్పినదెవరు ?
జ: శ్రీమతి ఐరావతి కార్వే