Tuesday, October 16
Log In

CURRENT AFFAIRS- 29 ప్రశ్నలు-27JULY

రాష్ట్రీయం


1) ఆధార్ కార్డులను జారీ చేస్తున్న జాతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కి రాష్ట్రస్థాయిలో సాధికారత కమిటీ ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్ గా ఎవరు ఉంటారు ?
జ: ముఖ్యమంత్రి కేసీఆర్
2) ‘భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ళు - లౌకికవాదం, బహుళత్వం’ అంశంపై మాట్లాడేందుకు అమెరికాలోని షికాగో నగరానికి వెళ్తున్న రాష్ట్ర మంత్రి ఎవరు ?
జ: నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు
(నోట్: మిషన్ కాకతీయ పై ఆయన మాట్లాడతారు )
3) రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీల జనాభా ఎంత శాతం ?
జ: 9.06 శాతం
(నోట్: సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్టీల జనాభా 10శాతం)
4) 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంత శాతం ?
జ: 15.6శాతం
(నోట్: సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్సీల జనాభా 16.5శాతం )
5) తెలుగు టైటాన్స్ అనేది ఏ క్రీడకు సంబంధించిన జట్టు పేరు ?
జ: ప్రొ కబడ్డీ (కెప్టెన్: రాహుల్ చౌదరి)
6) బైసన్ పోలో అనేది దేనికి సంబంధించినది ?
జ: సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ శాఖ మైదానం
7) దేశంలో నదుల అనుసంధానికి 30 లింకులను కేంద్రం గుర్తించింది. ఇందులో ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి ఎన్ని ఉన్నాయి ?
జ: 8 లింకులు

జాతీయం

8) మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ స్మారక మండపాన్ని ప్రధాని మోడీ తమిళనాడులో ఎక్కడ ఆవిష్కరించనున్నారు ?
జ: కలామ్ స్వస్థలమైన రామేశ్వరం జిల్లా పీకరుంబులో
9) దేశంలో జరిగే పెళ్ళిళ్ళను తప్పసరిగా రిజిష్ట్రేషన్ చేసేలా నిబంధన తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ చట్టానికి స్వల్ప సవరణలు చేయనున్నారు ?
జ: జనన, మరణాల నమోదు చట్టం - 1969
10) బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. బీహార్ శాసనసభలో మొత్తం సీట్లు ఎన్ని ?
జ: 243


11) కార్గిల్ విజయ్ దివస్ ను ప్రతియేటా ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: జులై 26
(నోట్: 1999 లో కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయాలకు గుర్తుగా నిర్వహిస్తారు )
12) బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఎప్పుడు నియమితులయ్యారు ?
జ: 2016 జనవరిలో ( 2019 జనవరి వరకూ కొనసాగుతారు )
13) దేశంలోనే మొదటిసారిగా జైళ్ళను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది ?
జ: తెలంగాణ
14) దేశంలో రోడ్ల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త యాప్ ఏది ?
జ: ఆరంభ్ (Aarambh)
15) దేశంలోనే సొంత FM రేడియో స్టేషన్ ప్రారంభించిన మొదటి మెట్రో రైల్ స్టేషన్ ఏది ?
జ: లక్నో మెట్రో
16) శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: ఆంధ్రప్రదేశ్
17) పాస్ పోర్ట్ జారీలో ఏ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ?
జ: బర్త్ సర్టిఫికెట్


18) కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో అత్యధికంగా ఎంతమొత్తం బంగారం పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలిపింది ?
జ: 4 కేజీల దాకా (గతంలో 500 గ్రాములు మాత్రమే)
19) ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ను కొనుగోలు చేయడానికి ఆఫర్ ఇచ్చిన సంస్థ ఏది ?
జ: ఫ్లిప్ కార్ట్
20) ఫ్రీఛార్జెస్ మొబైల్ యాప్ ను ఏ సంస్థ కొనుగోలు చేయనుంది ?
జ: యాక్సిస్ బ్యాంక్
21) పేద, ధనిక తారతమ్యాలను తగ్గించే అసమానత్వ సూచీలో ప్రపంచ దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంత ?
జ: 132 వ ర్యాంకు
22) 2017 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ కొట్టిన సచిన్ సివాచ్ ఏ రంగానికి చెందిన క్రీడాకారుడు ?
జ: బాక్సింగ్
23) 2017 ఆసియాన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకున్న మణిపూర్ కు చెందిన క్రీడాకారిణి ఎవరు ?
జ: కోన్సమ్ ఊర్మిళా దేవి

అంతర్జాతీయం

24) చైనాకి పొరుగున ఉండే ఏ దేశంతో ఇటీవల భారత్ రక్షణ బంధాన్ని ఏర్పరచుకుంటోంది ?
జ: మంగోలియా
25) మంగోలియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ?
జ: ఖల్త్ మా బటుల్గా
26) అణ్వాయుధాలు తయారు చేయొద్దంటూ ఏ మూడు దేశాలపై అమెరికా కఠిన ఆర్థిక ఆంక్షలు విధించింది ?
జ: రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా
27) ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బెర్ట్ ఐన్ స్టీన్ కు చెందిన అరుదైన చిత్రాన్ని లాస్ ఏంజెలిస్ లో వేలం వేస్తున్న సంస్థ ఏది ?
జ: నేటేడీ శాండెర్స్
(నోట్: ఈ చిత్రాన్ని 1951 మార్చి 14న ఐన్ స్టీన్ పుట్టినరోజు సందర్భంగా తీశారు. దీని విలువ వేలంలో రూ.64.36 లక్షలు (లక్ష డాలర్లు) పలుకుతుందని అంచనా)
28) 2021లో ప్రపంచ బాక్సింగ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది ?
జ: ఇండియా
29) ఇటీవల మరణించిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు మెర్విన్ రోస్ ఏ దేశానికి చెందినవారు ?
జ: ఆస్ట్రేలియా

 

( Friends, ఈ టెస్టులకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు... గతంలో లాగా అన్ని FB గ్రూపుల్లో పోస్ట్ చేయడం సాధ్యం కావడం లేదు.  అందువల్ల... మీ FB ఫ్రెండ్ రిక్వెస్ట్ ను telanganaexams కు పంపండి.  అలాగే ఎక్కువమందికి మన యాప్, వెబ్ సైట్ చేరేలాగా ప్రతి పోస్టును మీ FB లేదా వాట్పాప్ గ్రూపుల్లో షేర్ అయ్యేలా పోస్ట్ చేయగలరని మనవి. )