Monday, September 24
Log In

CURRENT AFFAIRS-24 ప్రశ్నలు-12AUG

these current affairs prepared by: telanganaexams.com

రాష్ట్రీయం

1) తెలంగాణలో చిన్న రైతులపై ఎంత రుణభారం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది ?
జ: రూ.27 వేల కోట్లు
2) 2016-17 లో తెలంగాణలో ఎంతశాతం ద్రవ్యోల్భణం నమోదైనట్టు కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది ?
జ: 6శాతానికి మించి
3) కాకతీయ జౌళి పార్కుకి ఈనెల 16న వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎక్కడ శంకుస్థాపన చేయనున్నారు ?
జ: సంగెం మండలం చింతలపల్లి, గీసుకొండ మండలం శాయంపేటల మధ్య
4) అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు హైదరాబాద్ లో ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ?
జ: నవంబర్ 6 నుంచి 14 వరకూ
5) ఏ వర్గం వారికి ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు అమలు చేసే పథకాల్లో 5 శాతం రిజర్వేషన్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ?
జ: దివ్యాంగులకు
6) రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ?
జ: 181

these current affairs prepared by: telanganaexams.com

జాతీయం

7) దేశ ఎన్నో ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణం చేశారు ?
జ: 15వ
(నోట్: వెంకయ్యతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు )
8) 2022 నాటికి దేశంలో ఎంత మెగావాట్ల పవన విద్యుత్ ( Wind power)ను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 60 గిగా వాట్స్
9) కొత్త కనీసవేతనాల చట్టాన్ని ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీ ఏది ?
జ: ఢిల్లీ అసెంబ్లీ
10) సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ పదవికి కొత్తగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రసూన్ జోషి
(నోట్: కవి, గేయ రచయిత, పద్మశ్రీ గ్రహీత. గతంలో ఈ పోస్టులో ఉణ్న పహ్లాజ్ ను కేంద్ర సర్కార్ తొలగించింది )
11) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఏయే భారతీయ భాషల్లో ఆన్ లైన్ డిక్షనరీలను అందుబాటులోకి తెచ్చింది ?
జ: తమిళం, గుజరాతీ
12) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత మొత్తం డివిడెండ్ ను కేంద్ర సర్కార్ కి బదిలీ చేసింది ?
జ: రూ.30,659 కోట్లు
13) ఎన్ని బ్యాంకుల విలీనానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ బిల్ 2017 కు లోక్ సభ ఆమోదం తెలిపింది. ?
జ: ఐదు
(1) State Bank of Bikaner and Jaipur (SBBJ)
2) State Bank of Hyderabad (SBH)
3) State Bank of Mysore (SBM)
4) State Bank of Patiala (SBP)
5) State Bank of Travancore (SBT)
14) వాణిజ్య లావాదేవీల్లో బిట్ కాయిన్, లైట్ కాయిన్ లాంటి మార్గాల్లో డిజిటల్ కరెన్సీ మార్పిడిని ప్రారంభించిన సంస్థ ఏది ?
జ: BitBay
15) ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పారిశ్రామిక మండళ్ళు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది ?
జ: అనంతపూర్, విజయనగరం
16) ఒడిశాలో MSME సంస్థల అభివృద్ధిని పరిశీలించేందుకు ఫేస్ బుక్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
జ: SheMeansBusiness
17) అమెరికాకి చెందిన ఈగల్ ఫోర్డ్ షేర్ ఆయిల్ ను కొనుగోలు చేస్తున్న భారతీయ సంస్థ ఏది ?
జ: Indian Oil Corporation (IOC)
18) జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ రౌండ్ లో క్వాలిఫై అయిన మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు ?
జ: దేవందర్ సింగ్ కంగ్
19) దక్షిణాసియా ప్రాంతంలో శారీరక శ్రమను పెంచుకోవడం మీద అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సౌహార్ధ రాయబారిగా ఎవర్ని నియమించింది ?
జ: మిల్కా సింగ్
అంతర్జాతీయం

20) ఏ సముద్రంలో భద్రత కోసం భారత్ తో కలసి పనిచేయడానికి చైనా ఉమ్మడి గస్తీ నిర్వహించాలని నిర్ణయించింది ?
జ: హిందూ మహా సముద్రం
21) రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినో దేశానికి భారత రాయబారిగా నియమితులైనది ఎవరు ?
జ: రీనాత్ సంధు
22) సాంకేతిక సాయాన్ని అందుకునేందుకు SEBI ఏ దేశానికి చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ ఆర్గనైజేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఇరాన్
23) జంతువుల కొవ్వుతో తయారు చేసిన ప్లాస్టిక్ నోట్లను రద్దు చేయాలన్న డిమాండ్ ను తిరస్కరించిన బ్యాంక్ ఏది ?
జ: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్
24) FIFA వరల్డ్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ?
జ: బ్రెజిల్
(ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా 97వ స్థానంలో నిలిచింది )

these current affairs prepared by: telanganaexams.com

(Note: ఒక్క కరెంట్ ఎఫైర్స్ మాత్రమే మిగతా గ్రూపుల్లోని FB ల్లో పోస్ట్ చేస్తున్నాం.  telanganaexams.com వెబ్ సైట్ నుంచి అన్ని updates కావాలంటే...  telanganaexams  FACE BOOK కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి )