Tuesday, October 16
Log In

CURRENT AFFAIRS-22ప్రశ్నలు-30JULY

రాష్ట్రీయం

1) డాక్టర్ సి.నారాయణ రెడ్డి 87వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఆయన పేరున ఆవిష్కరించిన పుస్తకం పేరేంటి ?
జ: స్మరనారాయణీయం
2) సినారే చివరి కవితా సంపుటిని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. దాని పేరేంటి ?
జ: కలం ఆగింది
3) విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు దేశవ్యాప్తంగా వెయ్యి పాఠశాలలకు రూ.20లక్షలతో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏర్పాటు చేస్తోంది కేంద్ర సర్కార్. ఈ కార్యక్రమం పేరేంటి ?
జ: అటల్ టింకరింగ్ ల్యాబ్స్

జాతీయం

4) మన్ కీ బాత్ కార్యక్రమాలపై (23 ఎపిసోడ్లు) రూపొందించిన పుస్తకాన్ని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబైలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఏ సంస్థ రూపొందించింది ?
జ: బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్
5) ఏ పంట జన్యుమార్పిడికి సంబంధించిన సాగుకి అనుమతిస్తే పర్యావరణపరంగా ఇబ్బందులు ఉంటాయని కేంద్రం... సుప్రీంకోర్టులో వాదించింది ?
జ: ఆవాలు
6) తొలి మానవరహిత (రిమోట్) యుద్ధ ట్యాంకు చెన్నై శివారు ఆవడిలో తయారైంది. దాని పేరేంటి ?
జ: మంత్ర
7) ఎర్రని ప్లస్ గుర్తులో కూపర్ ఫాంట్ లో ఇంగ్లీష్ అక్షరాలు డీఆర్ రాసిన ప్రత్యేక లోగోని ఐఎంఏ మేధో సంపత్తి హక్కుగా గుర్తింపు పొందిన డాక్టర్లు ఎవరు ?
జ: అల్లోపతి వైద్యులకు
8) దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ’MAHSR’ కు ఏ దేశం సహకారం అందిస్తోంది ?
జ: జపాన్
(నోట్: ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ (MAHSR) )
9) మొబైల్ టికెటింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి మెట్రో ఏది ?
జ: ముంబై మెట్రో
10) ఆంధప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మూలాల నిర్ధారణకు హార్వర్డ్ ప్రొఫెసర్ల బృందం పర్యటిస్తోంది ?
జ: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో
11) ఆసియాన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మెన్స్ జూనియర్ కేటగిరీలో కాంస్య పతకం గెలచుకున్న అజయ్ సింగ్ ఎన్ని కేజీల విభాగంలో పోటీపడ్డారు ?
జ: 77 కేజీల కేటగిరీలో
12) దేశంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఉపయోగపడే విధంగా యాప్ ను విడుదల చేసిన దిగ్గజ సంస్థ ఏది ?
జ: మైక్రో సాఫ్ట్ ఇండియా
13) 2017 డెల్ గ్లోబల్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ సిటీస్ ఇండెక్స్ చోటు దక్కించుకున్న సిటీలు ఏవి ?
జ: బెంగళూరు, ఢిల్లీ
14) Small Industries Development Bank of India (SIDBI) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?
జ: లక్నో
15) రాజాజీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: ఉత్తరాఖండ్

 

అంతర్జాతీయం

16) పనామా పేపర్ల కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయడంతో ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: షహీద్ ఖాకన్ అబ్బాసీ
17) శ్రీలంకలోని ఓ పోర్టులో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది చైనా. ఆ పోర్ట్ పేరేంటి ?
జ: హంబంటోటా
18) ఉత్తరకొరియా మళ్ళోసారి 10 వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష జరిపింది. దాని పేరేంటి ?
జ: హ్యాసాంగ్ - 14
19) ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు ఎవరు ?
జ: కిమ్ జోంగ్ ఉన్
20) ఫ్రాన్స్ ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లోని ఏ శిఖరంపై 1966నాటి ఎయిరిండియా విమాన శకలాలు కనిపించాయి ?
జ: మౌంట్ బ్లాంక్ శిఖరం
21) దక్షిణ సముద్రంలో మండే మంచు నుంచి సహజ వాయువును ఉత్పత్తి చేయాలని చైనా నిర్ణయించింది. మండే మంచుకు సాంకేతిక నామం ఏంటి ?
జ: మీథేన్ హైడ్రేట్
22) 2017 వరల్డ్ హెపటైటిస్ డే థీమ్ ఏంటి ?
జ: Eliminate Hepatitis