Monday, October 15
Log In

CURRENT AFFAIRS- 22ప్రశ్నలు- 24JULY

రాష్ట్రీయం

1) కుమురం భీమ్ స్మారక కట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మించింది ?
జ: జోడేఘాట్ గ్రామం దగ్గర

జాతీయం

2) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవికాలం ఇవాళ్టితో (జులై 24తో) ముగుస్తోంది. ఆయన మాజీ రాష్ట్రపతిగా ఎక్కడ నివసించనున్నారు ?
జ: ఢిల్లీ లుటెయెన్స్ లోని 10, రాజాజీ మార్గ్ బిల్డింగ్ లో
3) ఢిల్లీ లుటెయెన్స్ లోని 10, రాజాజీ మార్గ్ బిల్డింగ్ లో ఇంతకుముందు ఉన్న మాజీ రాష్ట్రపతి ఎవరు ?
జ: ఏపీజే అబ్దుల్ కలాం
4) దేశంలో రేడియో ప్రసారాలు మొదలై జులై 23, 2017 నాటికి 90 యేళ్ళు పూర్తయ్యాయి. మొట్టమొదట రేడియో స్టేషన్ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది ?
జ: బాంబే స్టేషన్ (23 జులై 1927) (ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్)


5) ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్ ఆలిండియా రేడియోగా ఎప్పుడు అవతరించింది ?
జ: 8 జూన్ 1936లో
6) ప్రసార భారతి కింద పనిచేస్తున్న ఆలిండియా రేడియో ప్రస్తుతం ఎన్ని భాషలు, మాండలికాల్లో ప్రసారాలు చేస్తోంది ?
జ: 23 భాషలు 146 మాండలికాలు
7) మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 50 సూపర్ కంప్యూటర్లు తయారు చేయాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎవరు చేపడతారు ?
జ: నేషనల్ సూపర్ కంప్యూటర్స్ మిషన్
8) RIWATCH మ్యూజియం, చిమారీ బ్రిడ్జ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరన్ రిజిజూ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
9) 5వ నార్త్ ఈస్ట్ సమ్మిట్ - 2018 ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
10) సామాజిక న్యాయంపై ప్రపంచ సదస్సు ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?
జ: కర్ణాటక
11) పేదలందరికీ (దారిద్ర్య రేఖకు దిగువనున్నవారికి) ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
జ: ఉత్తరప్రదేశ్
(నోట్: 624 ప్రాంతాల్లో ఈ స్కీమ్ ను ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ ప్రారంభించారు )
12) గ్రామీణ స్థాయి నుంచి ఫుట్ బాల్ ఆటను ప్రోత్సహించేందుకు మిషన్ ఫుట్ బాల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జ: మేఘాలయ
(నోట్: ఆ రాష్ట్ర సీఎం ముకుల్ సంగ్మా షిల్లాంగ్ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు )


13) మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జట్టు ఓడిపోయినా భారతీయుల మనసు గెలిచింది. ఇంగ్లాండ్ ఇప్పటిదాకా ఎన్నిసార్లు ప్రపంచ టైటిల్ గెలుచుకుంది ?
జ: నాలుగు సార్లు
(నోట్: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓడటం రెండోసారి )

 

అంతర్జాతీయం

14) భారత్ కు ఏ అధునాతన యుద్ధ విమానాలు సరఫరా చేయడానికి రష్యా ముందుకు వచ్చింది ?
జ: మిగ్ - 35,
15) భారత్ నిధులతో ఏ దేశంలో స్కూల్స్ ప్రారంభం అయ్యాయి ?
జ: నేపాల్
16) వివాదస్పద ద్వీపంలో చైనా ఓ థియేటర్ ను నిర్మించింది. ఆ ద్వీపం పేరేంటి ?
జ: యాంగ్ జింగ్
17) ప్రపంచంలో 2016లో ఎక్కువగా ఉగ్రవాద దాడులు జరిగిన దేశం ఏది ?
జ: ఇరాక్ (2965 దాడులు)
18) ప్రపంచంలో 2016లో ఎక్కువగా ఉగ్రవాద దాడులు జరిగిన దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: మూడో స్థానం (927)
(నోట్: రెండో స్థానంలో ఆఫ్గానిస్తాన్ (1340), పాకిస్థాన్ ( 734). అమెరికా విదేశాంగ శాఖ ఈ వివరాలు వెల్లడించింది )
19) పదార్థ, వ్యతిరేక పదార్థాల లక్షణాలను కలిగిన ఓ ఏంజెల్ రేణువును ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు ?
జ: అమెరికాలోని స్టాన్‌ఫ‌ర్డ్‌ విశ్వవిద్యాలయం
20) జాయింట్ సీ 2017 తో బాల్టిక్ సముద్రంలో భారీ నౌకా విన్యాసాలు చేస్తున్న రెండు అగ్ర దేశాలు ఏవి ?
జ: చైనా, రష్యా
21) ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ క్యారియర్ USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ను ఏ దేశం సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది ?
జ: అమెరికా
(నోట్: 1,106 అడుగులున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో 1 లక్షల టన్నుల బరువున్న ఆయుధాలు తీసుకెళ్ళ వచ్చు. దీనికి రెండు న్యూజనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్లు విద్యుత్ ను అందిస్తాయి )
22) చెస్టెర్ బెన్నింగ్టన్ ఇటీవలే కన్నుమూశారు. ఆయన ఏ రంగానికి చెందినవారు ?
జ: సింగర్ ( అమెరికా )