Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS-20ప్రశ్నలు-27AUG

రాష్ట్రీయం

1) కులమతాలతో పనిలేకుండా రాష్ట్రంలోని ఎంతమంది పేద మహిళలకు బతుకమ్మ చీరలను పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 1,04,57,610 చీరలు
2) కొత్త జిల్లాలు ఏర్పడటంతో తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లతో రోడ్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 5,107 కిమీ.
3) తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ చేపట్టనున్న కార్యక్రమం పేరేంటి ?
జ: తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్ )
4) నెహ్రూ రింగ్ రోడ్ కి అవతల 886కిమీల మేర విస్తరించే కొత్త రింగ్ రోడ్డుకి ఏమని పేరు పెట్టారు ?
జ: బంగారు తెలంగాణ వలయం
5) యాదాద్రి విద్యుత్కేంద్రానికి ఇటీవలే పర్యావరణ అనుమతి లభించింది. రూ.17 వేల కోట్లతో ఈ కేంద్రాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: నల్గొండ జిల్లా దామెరచర్ల
6) ఈ ఏడాది స్త్రీనిధి కింద మహిళలకు ఎంతమొత్తం రుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: రూ.1,810 కోట్లు
7) రాజీవ్ స్వగ్రుహ ఇళ్ళను ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ సైట్ ఏది ?
జ: http://www.tsswagruha.cgg.gov.in/

జాతీయం

8) వరదలతో అల్లాడుతున్న బిహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికోట్ల తక్షణ సాయం అందించారు ?
జ: రూ.500 కోట్లు
9) జీఎం పంటలు-పర్యావరణంపై వాటి ప్రభావంపై విచారణ జరిపిన పార్లమెంటరీ స్థాయీ సంఘంనకు ఎవరు బాధ్యతలు వహించారు?
జ: ఎంపీ రేణుకా చౌదరి
10) ప్రసారభారతి ప్రస్తుత ఛైర్మన్ ఎవరు ?
జ: డాక్టర్ ఎ.సూర్యప్రకాశ్
11) భారత విదేశాంగ శాఖకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా దేశంలో మొదటి విదేశీ భవన్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: ముంబై (మహారాష్ట్ర)
12) కేంద్ర కేబినెట్ ఇటీవలే ఓబీసీ క్రీమిలేయర్ వార్షిక ఆదాయపరిమితిని ఎంతకు పెంచింది ?
జ: రూ.8లక్షలు
13) డిజిటల్ హర్యానా సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: గురుగావ్ (సెప్టెంబర్ 15 )
14) సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రూఫ్ టాప్ లను గ్రిడ్ తో కనెక్ట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
జ: ఒడిషా

 (సోమవారం 28 నుంచి కొత్త బ్యాచ్ )
అంతర్జాతీయం

15) దుబాయ్ లో ప్రవాసంలో ఉన్న థాయ్ లాండ్ మాజీ ప్రధాని ఇంగ్ లక్ షినావత్ర ప్రస్తుతం ఏ దేశాన్ని ఆశ్రయం కోరుతున్నారు ?
జ: బ్రిటన్
16) అమెరికాలోని టెక్సస్ ను వణికిస్తున్న హరికేన్ పేరేంటి ?
జ: హార్వీ తుఫాన్
17) లింగమార్పిడి చేసుకున్న వారిని సైన్యంలోకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దేశం ఏది ?
జ: అమెరికా
18) ప్రముఖ పర్యావరణవేత్త టోనీ డే బ్రమ్ ఇటీవల కన్నుమూశారు. ఆయన ఏ దేశానికి చెందినవారు ?
జ: మార్షల్ ఐలాండ్స్
19) 2017 యునైటెడ్ నేషన్స్ వాల్డ్ టూరిజం ప్రకటించిన జాబితాలో అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శించిన దేశంగా ఏది నిలిచింది ?
జ: తువాలు
20) ఇంటర్నేషనల్ మిలటరీ మ్యూజిక్ ఫెస్టివల్ - 2017 ఏ దేశంలో జరగనుంది ?
జ: రష్యా (మాస్కోలో )