Monday, September 24
Log In

CURRENT AFFAIRS-20 ప్రశ్నలు- 14AUG

రాష్ట్రీయం

1)స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో భాగంగా సాంస్కృతిక శాఖ విభాగంలో ఎవరికి అవార్డులు దక్కాయి ?
జ: సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, భాష్య విజయసారధి
2) 2016-17లో తెలంగాణలో ఐటీ ఎగుమతులు ఎన్ని కోట్లు ?
జ: 85,479 కోట్లు
3) ఐటీ ఎగుమతుల్లో 2015-16 కంటే ఎంత శాతం వృద్ధి రేటు 2016-17 లో కనిపించింది ?
జ: 13.85 శాతం (జాతీయ సగటు కన్నా 4 శాతం ఎక్కువ)
4) రాష్ట్రంలో Information Technology Investment Region (ITIR) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
జ: 2013 నవంబర్ 13
5) రాష్ట్రంలో Information Technology Investment Region (ITIR) ఏర్పాటైతే ఎంతశాతం IT ఎగుమతులు పెరుగుతాయని అంచనా వేశారు ?
జ: రు.2.35 లక్షల కోట్లు (15 లక్షల మందికి ఉపాధి )
6) ప్రభుత్వ బడుల్లో చదివే వారికి టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ IIT విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: అధ్యాయన్
7) పరీక్షల్లో సంస్కరణలు, డిజిటల్ వినియోగంపై రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలికి అవార్డు వచ్చింది. దీన్ని ఎక్కడ జరిగిన వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో అందజేశారు ?
జ: ఢిల్లీలో
8) రాష్ట్రంలో రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: కాజీపేట
9) గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో రైలు నవంబర్ నుంచి పరుగులు పెట్టనుంది. తొలివిడతగా 30 కి.మీ మార్గంలో మెట్రో రైలు నడవనుంది. అవి ఎక్కడెక్కడ ?
జ: నాగోల్ - అమీర్ పేట్ (17 కిమీ), మియాపూర్-అమీర్ పేట్ (13కిమీ)
10) అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో జరుగుతున్న ప్రపంచ పోలీస్ క్రీడల్లో రెండు కాంస్యాలు గెలుచుకున్న తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి ఎవరు ?
జ: బోస్ కిరణ్
(నోట్: టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పతకాలు వచ్చాయి)

జాతీయం
11) దేశంలో ఓటర్లుగా నమోదు చేసుకోడానికి ప్రవాస భారతీయుల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన పోర్టల్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఆ పోర్టల్ పేరేంటి ?
జ: ఓవ‌ర్‌సీస్ ఇండియన్ ఓటర్స్
12) 1947 ఆగస్టు 15న సెయింట్ జార్జి కోటపై ఎగరవేసిన జాతీయ పతాకం ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. దాన్ని ఏ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు ?
జ: చెన్నైలోని ఫోర్ట్ మ్యూజియంలో
13) అక్టోబర్ 2017లో ఏ దేశంతో కలసి భారీగా యుద్ధ విన్యాసాలు చేయాలని భారత్ నిర్ణయించింది ?
జ: రష్యాతో
14) దేశంలోనే మొదటిసారిగా వైమానిక విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్ లోని ఎక్కడ ప్రారంభించనున్నారు ?
జ: రాయ్‌బ‌రేలీ జిల్లాలో
(నోట్: ఈ యూనివర్సిటీకి రాజీవ్ గాంధీ నేషన్ ఏవియేషన్ యూనివర్సిటీ) అని పేరు పెట్టారు )
15) రైల్వే విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు ఏ నగరం శివార్లలో ప్రత్యేక ఓ గ్రామాన్ని నిర్మించాలని భావిస్తున్నారు ;?
జ: బెంగళూరు
16) అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో జరుగుతున్న ప్రపంచ పోలీస్ క్రీడల్లో టెన్నిస్ డబుల్స్ లో భారత్ జట్టు విజయం సాధించింది. ఈ ఆటలో పాల్గొన్న పోలీస్ అధికారులు ఎవరు ?
జ: 1) చండీగఢ్ ఎస్పీ అశిష్ కుమార్, 2) చిత్తూరు ప్రత్యేక బ్రాంచి డిఎస్పీ రామ్ కుమార్

 

అంతర్జాతీయం

17) హ్యాకింగ్ కు వీలులేని క్యాంటమ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటుకు ఏ దేశం ప్రయత్నిస్తోంది ?
జ: చైనా
18) చైనా ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటమ్ ఉపగ్రహాన్ని గత ఏడాది ప్రయోగించింది. దాని పేరేంటి ?
జ: మికియస్
19) ఏ దేశ అనుచిత వ్యాపార విధానాలపై దర్యాప్తు జరపాలని అమెరికా నిర్ణయించింది. దీంతోటి తమ వాణిజ్య, మేధో హక్కులకు నష్టం కలుగుతోందని అమెరికా భావిస్తోంది ?
జ: చైనా
20) ఏ మంచు మంచు ఫలకాల కింద 91 క్రియాశీల అగ్ని పర్వతాలు ఉన్నట్టు బ్రిటన్ కు చెందిన ఎడిన్‌బ‌రో వర్సిటీ నిపుణులు గుర్తించారు ?
జ: అంటార్కిటికా మంచు ఫలకం