Thursday, June 27

CURRENT AFFAIRS – SEPT 30

రాష్ట్రీయం
01) 2018 అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బధిరుల కోసం ఎక్కడ ఉత్సవాలు నిర్వహించనున్నారు ?
జ: హైటెక్స్, హైదరాబాద్ లో
02) గ్రామాల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టినందుకు స్వచ్ఛ భారత్ అవార్డులు వేటికి దక్కాయి ?
జ: రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్
03) వరంగల్ లోని నిట్ లో జరుగుతున్న టెక్నికల్ ఫెస్ట్ పేరేంటి ?
జ: టెక్నోజియాన్
04) తెలంగాణ CID విభాగంలో మహిళా భద్రత, శాంతి భద్రతల ఐజీగా విధులు నిర్వహిస్తున్న స్వాతి లక్రాకి రాజస్థాన్ ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చింది ?
జ: ప్రీసియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా

జాతీయం
05) పాక్ ఉగ్రవాదం, ఐరాస సంస్కరణలపై ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
06) త్రివిధ దళాలతో కూడిన సమీకృత రక్షణ సిబ్బంది విభాగం ( CISC) కి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్. రాజేశ్వర్
07) ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) ఛైర్మన్ గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
జ: ఎన్. రవి ( హిందూ గ్రూపు పత్రికల ప్రచురణ కర్త )
(వైస్ ఛైర్మన్: విజయ్ కుమార్ చోప్రా ( పంజాబ్ కేసరి గ్రూపు పత్రికల ఎడిటర్ )
08) ప్రైవేటు సంస్థలు ఆధార్ కార్డ్ నెంబర్ ను యాక్సెస్ చేయడానికి ఉద్దేశించిన ఆధార్ చట్టంలోని ఏ సెక్షన్ ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది ?
జ: సెక్షన్ 57
09) స్మార్ట్ సిటీ ఎక్స్ పో ఇండియా 2018 ఇటీవల ఏ సిటీలో జరిగింది ?
జ: జైపూర్
10) దేశంలో టీబీ వ్యాధిని తరిమికొట్టడానికి ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: అమెరికా

అంతర్జాతీయం
11) ఇండోనేసియాలో భూకంపం, సునామీ కారణంగా 400మంది చనిపోయారు. ఏ నగరంపై ప్రధానంగా ప్రభావం చూపించింది ?
జ: పలూ నగరం
12) జపాన్ ని వణికిస్తున్న టైఫూన్ పేరేంటి ?
జ: ట్రామీ
13) ర్యూగు ఆస్టరాయిడ్ పై మొదటిసారిగా రోబోటిక్ రోవర్స్ ను పంపిన దేశం ఏది ?
జ: జపాన్
14) ప్రపంచ పర్యాటక దినోత్సవం-2018 ( సెప్టెంబర్ 27) యొక్క థీమ్ ఏంటి ?
జ: Tourism and the Digital Transformation

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5 గ్రాండ్ టెస్టులు (TM) సెకండ్ పేపర్ పై ప్రత్యేక శ్రద్ధ

పూర్తి వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి :

https://telanganaexams.com/gp-secy-mock/